UA-35385725-1 UA-35385725-1

యువ క్రికెటర్లకు కాసులపంట

యువ క్రికెటర్లకు కాసులపంట

మెగావేలంలో ఇషాన్‌ కిషన్‌ సంచలనం

దీపక్‌ చాహర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లకు భారీ మొత్తాలు

అదరగొట్టిన హసరంగ, హర్షల్‌ పటేల్‌, పూరణ్‌, ఫెర్గూసన్‌, ప్రసిధ్‌కృష్ణ, రబడ

బెంగళూరు : భారత యువ క్రికెటర్లకు ఐపీఎల్‌లో కాసులపంట పండిరది. ముంబయి ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ 15.25 కోట్ల రూపాయలతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022 సీజన్‌ రికార్డులను బద్దలుగొట్టాడు. దీపక్‌ చాహర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హర్షల్‌ పటేల్‌, ప్రసిధ్‌ కృష్ణలు అదరగొట్టారు. వీరిలో చాలామంది గతసారి కంటే భారీ మొత్తం సొంతం చేసుకోవడంతోపాటు పాత జట్లకే మరోసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇషాన్‌ కిషన్‌ రూ. 15.25 కోట్లతో అత్యధిక ధరను దక్కించుకున్నాడు. గత వేలంలో ఇషాన్‌కు రూ.6.20 కోట్లు దక్కాయి. ఈసారి భారీ ధర ఇచ్చి మరీ ఈ యువ బ్యాటర్‌ను ముంబయి ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. అయితే ముంబయి రిటెయిన్‌ చేసుకున్న ఆ జట్టు సారథి రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు) తర్వాత భారీ ధరను పొందిన ఆటగాడిగా ఇషాన్‌ కిషన్‌ రికార్డు సృష్టించాడు. ముంబయి రిటెయిన్‌ చేసుకున్న మిగతా ముగ్గురిలో బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), కీరన్‌ పొలార్డ్‌ (రూ.6 కోట్లు) కంటే ఇషాన్‌ కిషనే ఎక్కువ. అంతేకాకుండా వేలంలో యువరాజ్‌ (రూ.16 కోట్లు) తర్వాత భారీ ధరను దక్కించుకున్న టీమ్‌ఇండియా ఆటగాడిగా ఇషాన్‌ నిలిచాడు.
దీపక్‌ చాహర్‌ చైన్నై సూపర్‌కింగ్స్‌ రిటెయిన్‌ చేసుకున్న అగ్రశ్రేణి క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ కంటే అధిక మొత్తం సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో దీపక్‌ చాహర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసుకుంది. గత వేలంలో దీపక్‌కి దక్కింది కేవలం రూ. 80 లక్షలే. చెన్నై రిటెయిన్‌ చేసుకున్న ఎంఎస్‌ ధోనీకి ఇచ్చేది రూ. 12 కోట్లు. సీఎస్‌కేలో రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు) తర్వాత అత్యధిక విలువ కలిగిన ఆటగాడిగా దీపక్‌ చాహర్‌ రికార్డు సాధించాడు. దీపక్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ తీవ్రంగా పోటీ పడిరది.
ఇక గతేడాది అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్న హర్షల్‌ పటేల్‌ రేటు అదిరిపోయింది. అలానే లంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగకూ భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టే రూ. 10.75 కోట్లు చొప్పున సొంతం చేసుకుంది. నికోలస్‌ పూరన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున రాణించిన ఆల్‌ రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసుకుంది. ఇటీవల కాలంలో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న వాషింగ్టన్‌ సుందర్‌ను హైదరాబాద్‌ రూ. 8.75 కోట్లకు దక్కించుకున్నది. మరో టీమిండియా ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను 12.25 కోట్లు పెట్టి కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో క్రిస్‌ మోరిస్‌(16 కోట్లు), ప్యాట్‌ కమిన్స్‌(15.5 కోట్లు), కైలీ జెమీషన్‌(15 కోట్లు) తదితరులు గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1