కేసీఆర్‌తో మమత మాటామంతీ
కోల్‌కతా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (KCR) ఊహించినట్లుగానే జాతీయ ఫ్రంట్‌కు పావులు కదులుతున్నట్లు కన్పిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారంనాడు కేసీఆర్‌తో మాట్లాడారు. కేంద్రంలో ఫెడరల్ ప్రభుత్వ ఏర్పాటుపై ఆమె ఆసక్తి కనబరిచారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ జయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. సాధారణ ప్రజల బాగు కోసం వినమ్రంగా కలిసి పనిచేయాలని దీదీ పిలుపునిచ్చారు. యూపీ ఎన్నికల్లో టీఎంసీ బరిలోకి దిగలేదని, చాలా విశాలమైన ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. వారణాసిలో మార్చి 3వ తేదీన జరగనున్న ర్యాలీలో పాల్గొనున్నట్లు దీదీ చెప్పారు. కాంగ్రెస్‌తో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా సక్రమైన సంబంధాలు లేవని, ఆ పార్టీ తనదైన శైలిలో వెళ్తుందని, తమ పార్టీ కూడా తమదైన శైలిలోనే వెళ్తోందని ఆమె అన్నారు. సమాఖ్యా ప్రభుత్వం ఏర్పాటు విషయంలో అందరి సహకారం అవసరమని దీదీ తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ప్రజలు కోరితే జాతీయ పార్టీ పెడతానని, మోదీని, బీజేపీని ఓడించి తీరుతామని కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెల్సిందే. (Story : కేసీఆర్‌తో మమత మాటామంతీ)
See Also : డోసు పెంచిన కేసీఆర్