Home Blog Page 964

విజ‌య‌వాడ‌లో కారు బీభ‌త్సం

0
Vijayawada Accident
Vijayawada Accident

విజ‌య‌వాడ‌లో కారు బీభ‌త్సం

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ‌లో కారు బీభ‌త్సం

* బెంజ్ సర్కిల్ ప్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది.
* ఈ ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.
* ఉదయం రోడ్లు ఊడుస్తున్న కార్పొరేషన్ సిబ్బందిపైకి వేగంగా దూసుకుపోయిన కారు.
* గాయపడినవారిని 108లో ఆసుపత్రికి తరలింపు.
* కారు వేగంగా ఢీకొట్టడంతో కార్పొరేషన్‌కు చెందిన వాహనం(ఆటో) ధ్వంస‌మైంది.
* ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Simle Story : విజ‌య‌వాడ‌లో కారు బీభ‌త్సం)

Vijayawada Accident
Vijayawada Accident
Vijayawada Accident
Vijayawada Accident

See Also : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై

మోడీపై మ‌రోసారి కేసీఆర్ నిప్పులు

0
KCR
KCR

మోడీపై మ‌రోసారి కేసీఆర్ నిప్పులు

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. బీజేపీని చెత్త‌బుట్ట‌లో వేయ‌డానికి అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీని పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్ వివ‌రాలు ఆయ‌న మాట‌ల్లోనే…
నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. అయినా ప్రజలకు కొన్ని వివరాలు చెప్పాలని చెప్పాం.
నరేంద్ర మోదీ గారు ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటున్నది.
అబద్దాలు చెబుతున్నరు. అందులో భాగంగానే విద్యుత్‌ సంస్కరణలు తెచ్చింన్రు.
డ్రాఫ్ట్‌ బిల్లు రెడీ అయ్యింది. డ్రాఫ్ట్‌ బిల్లు చేసి రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ లేఖ రాశారు. దానికి జవాబు ప్రధానికి లేఖ రాశారు.
అదే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాం. వీటన్నింటిని మించి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్లియర్‌గా వాళ్ల పాలసీ చెప్పారు.
అడిషనల్‌ బారోఇంగ్‌ లింక్డ్‌ టూ పవర్‌ సెక్టార్‌ రిఫార్మ్స్‌. ఇది పార్లమెంట్‌లో వాళ్లు ఇచ్చిందే..
ఇది కేసీఆర్‌ స్టోరీ కాదు. అగ్రికల్చర్‌ సెక్టార్‌కు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు.. ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టాలి.
కేంద్రం పంపిన ముసాయిదా బిల్లు.
అది మెడమీద వేలాడుతున్న కత్తి. బిల్లు పాస్‌ కాకముందే..
రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ రీఫామ్స్‌ చేస్తరో అడిషనల్‌గా 0.5 ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తమని ప్రకటించారు. అది ఐదేళ్లు ఇస్తమని ప్రకటించారు. పోయిన ఏడాది మనం తీసుకోలేదు.
అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ తీసుకున్నది. తీసుకోవడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారు. మిగతా వాటికి టెండర్లు పిలిచారు.
రూ.737కోట్లతో టెండర్లు పిలిచారు. 0.5శాతం అడిషనల్‌ ఎఫ్‌ఆర్‌బీఎం వస్తే రూ.5వేలపైచీలుకు కోట్లు వస్తయ్‌. రాబోయే ఐదేళ్లకు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ఇస్తం.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వం.
నష్టపోయిన మంచిది నీ డబ్బులు అక్కర్లేదంటే రూ.25వేలకోట్లు నష్టపోవాలే తెలంగాణ. ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్ల పెట్టా అని చెప్పిన.
తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి..
ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నరు కాబట్టి నేను పెట్టా అని చెప్పిన.
శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు పెట్టారు. టెండర్లు పిలిచారు..
ఇంప్లిమెంట్‌ చేస్తున్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తున్నరు.
ఇన్ని ఉండంగ.. మొన్న బడ్జెట్‌లో పెట్టారు.. ఇన్ని ఉండంగా.. పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు. చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్‌ నన్నడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది
రోజు రోజుకు. ఇవన్ని ఆధారాలుండి.. ఇంత జరిగి.. రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్‌ చేసి పంపి.. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండి పచ్చి అబద్దం చెబుతాం.
దీనిపై బహిరంగ క్షమాపణ చెబుతా. మీటర్లు పెట్టుమన్నా..?
పెట్టుమనందే జగన్మోహన్‌రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళంలా పెట్టిండా.
పెట్టుమనంతా ఎఫ్‌ఆర్‌బీఎంలా 0.5శాతం పెట్టినవా?.. దాన్ని మేం ఎందుకు తీసుకుంటలేమ్‌. ఎఫ్‌ఆర్‌బీఎం పవర్‌ రీఫామ్స్‌ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ” అంటూ కేసీఆర్ మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సెటైర్లు
పాపం ఆయన్ను చూస్తే జాలేస్తోందని.. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్
రోజురోజుకీ బీజేపీ పార్టీ పరువు పోతుంది.
తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది.
నిధులు ఇవ్వకుండా పీఎఫ్‌సీ.. ఆర్‌ఈసీపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ ఒత్తిడి తెస్తున్నారు.
మనకు ఉన్నటి వంటి నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్‌సీ ఆర్‌ఈసీ. రాష్ట్రానికి లోన్లు ఇస్తయ్‌. రాష్ట్రానికి మంచి డిసిప్లేయిన్‌ ఉంది కాబట్టి, లోన్లు రీపేమెంట్‌ మంచి ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తరు. ఆ ఇచ్చే డబ్బులు ఆపేయమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ పవర్‌ రీఫామ్స్‌ తెస్తలేరని ఒత్తిడి తెస్తున్నరు.. ఇదీ జరుగుతున్నది.
ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలుస్తదా? ఎందుకు మాట్లాడుతడు ఆయన. ఇప్పుడు బహిరంగ క్షమాపణ వేడుకోవాలి.
మీడియాకు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అడుగొచ్చు కదా. ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఇచ్చిన ఆధారాలు ఇచ్చాం దాని అర్థమేంటి.
ఒకరకంగా గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం. పార్లమెంట్‌ను అవమానించడం.. దేశ ప్రజలను మోసం చేయడం. ఇంకా డ్రాఫ్ట్‌ బిల్లుగానే ఉంది. ఇది జరిగే చరిత్ర.
దీని మీద చెబితే బాధ.. అంటే బాధ. నేను ప్రధానమంత్రి అని.. పైసలు ఇస్తడి ఆశపడి మిషన్‌ భగీరథ ఇనాగ్రేషన్‌కు పిలిచిన. ఆయన కూడా సభలో పచ్చి అబద్దాలు చెప్పారు. ఆయన ఏం చెబుతాడన్న అంతకు ముందే మేం రూ.11 పవర్‌ కొన్నరు.. మేం 1.10 రూపాయలకే ఇస్తున్నం అంటున్నడు.
భారతదేశ చరిత్రలో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎన్నడూ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. కానీ మేం ఇస్తున్నమని అంటే పెద్దమనిషి అని బాగుండదని ఊరుకున్నం. ఆ తర్వాత వెంటనే ఎలక్ట్రిసిటి అధికారులు అడిగితే అతిథిగా పిలిచినం తిడితే బాగుండదని ఊకున్నం. ఇట్ల ఎన్ని విషయాల్లో చెబుతరు.
నేను చాలెంజ్‌ చేసిన ఎవరూ మాట్లాడుతరు బీజేపీ వాళ్లు అని అన్న.. దేశంలో 4లక్షల మెగావాట్ల పవర్‌ ఉంది దేశంలో.. దాన్ని వాడే తెలివితేటలు లేవు ఈ కేంద్ర ప్రభుత్వానికి.. బ్యాడ్‌ పవర్‌ పాలసీ ఉందని చెప్పిన.
40వేల మెగావాట్ల పవర్‌ ఉత్పత్తి సంస్థలు దేశంలో నిర్మించబడ్డయ్‌. పీపీఏలు అయిపోయినయ్‌.. ఫ్యూయల్‌ టైయప్‌ అయ్యింది. కానీ ప్రొడక్షన్‌ కానిస్తలేరు. ఎందువల్ల.. ఈ దేశం వల్ల. ఈ దేశం అవలంభించే దిక్కుమాలిన పవర్‌ పాలసీ వల్ల. చేతకాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం వల్ల. 60శాతం దేశం పవర్‌ కట్స్‌లో ఉంటది. 24గంటల కరెంటు ఏరాష్ట్రంలో ఇవ్వరు ఒక తెలంగాణలో తప్పా ఇది వాస్తవం.
ఇది నిజమా? అబద్దమా?.. నేను పిచ్చి మాటలు మాట్లాడను ఆ అవసరం లేదు..
ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా. ఇంత దుర్మార్గంగా ఆ పార్టీ వాళ్లు ప్రతి విషయంలో అబద్ధాలు, మోసాలు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరు.
ఇవన్నింటిని మించి అఖిలభారత విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు ఒక్కటై సమావేశాలు పెట్టాయ్‌. మన వద్ద మింట్‌ కాపాండ్‌లో మన ఉద్యోగులు ఆందోళనలు చేశారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించి, వాళ్ల పార్టీకి చెందాలు ఇచ్చే వాళ్లకు డబ్బులు ఇచ్చేటోళ్లు. వాళ్లను సాదెటోళ్లు, ఎన్నికలకు డబ్బులిచ్చిటోళ్లకు, వేలకోట్ల దిగమింగి.. వాళ్లు పెట్టే సోలార్‌ విద్యుత్‌ కొనాలని చట్టం. దానికి అందమైన పేరు చట్టం, విద్యుత్‌ సంస్కరణలు..
మనకు మన తెలంగాణకు జల విద్యుత్‌ అందుబాటులో ఉన్నది కృష్ణా నదిపై ఎక్కువ. నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పులిచింతల, జూరాల. 2500వేల మెగావాట్ల దాగా ఉంటుంది.
గోదావరిపై తక్కువ ఉంది మనకు కృష్ణానదిపై ఎక్కువ ఉంది. ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ల బీజేపీ మిత్రులు పెట్టే 30వేల, 40వేల మెగావాట్ల సోలార్‌ కొనాలట గ్రీన్‌ ఎనర్జీ కింద. గ్రీన్‌ ఎనర్జీ అయినా నాగార్జున సాగర్‌, శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి బంద్‌ పెట్టి సరే దీన్ని కొనాలి.. లేదంటే ఫైన్‌ వేస్తం, ఇది చట్టం.
మీ పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెడుతరా? అన్ని తప్పుడు ప్రచారాలు, అబద్దాలపై ఎన్ని రోజులు నడుపుతరు భారతదేశాన్ని, ఇది ఎంత వరకు సమంజసం.
దీనిపై చర్చపెట్టండి. ఇన్ని అబద్దాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నది.
ఈ దేశం ఇలాగే నాశనం కావాలా? చాలా ఉంది ఇంకా భాగోతం. నేను దుఃఖంతో చెబుతున్నా.
అన్ని రంగాల్లో సర్వనాశనం ప్రతిరంగంలో.. పిచ్చి అబద్ధాలు. పచ్చి అబద్దాలు.. ఇక్కడ కాదా విదేశాల్లోనూ చెప్పుడే సిగ్గుపోతుంది.
2025 వరకు 5 ట్రిలియన్ల ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటదా? అది చంద్రయాన్‌ మీద పోయినదానితో సమానం అంటరు. మనం కూడా చంద్రమండలంపై దిగినట్టే అనుకోవాలే ఇగ.. ఇంత పచ్చి అబద్దమా.. ఇది ప్రగతా?
మోడీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయ‌మ‌నండి.
సాధారణంగా 12 శాతం గ్రోత్ ఉంటే 6 ఏండ్లలో దేశ ఎకానమీ డబుల్ అవుతుంది.
11 శాతం ఉంటే 7 ఏండ్లలో డబుల్ అవుతుంది. అది నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వడ్డీ వ్యాపారిని అడిగినా చెబుతడు.
ఇది కఠోరమైన వాస్తవం. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ అవసరం లేదు.
మీకు దమ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్‌లా అభివృద్ధి చేయండి.
అది చేయండి కానీ.. 5 ట్రిలియన్ ఎకానమీ కాదు. ఇది నేను చెప్పడమే కాదు.. నేను చెప్పిన విషయాన్నే చిదంబరంగారు కూడా రాజ్యసభలో చెప్పారు.
మావాళ్లు కూడా ఉన్నారు. అన్నీ గోల్ మాల్ మాటలు చెప్పి.. అబద్ధాలు చెప్పి ఎవరిని వంచించాలని అనుకుంటున్నరు. అందుకే వీళ్లను తరిమికొట్టకపోతే దేశమే నాశనం అయిపోతది.
అవ‌స‌ర‌మైతే జాతీయ‌స్థాయిలో కొత్త పార్టీ పెడ‌తాన‌ని కేసీఆర్ అన్నారు. (Story : మోడీపై మ‌రోసారి కేసీఆర్ నిప్పులు)

See Also : డోసు పెంచిన కేసీఆర్‌

మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!

0
Sarkaru Vari Paata
Sarkaru Vari Paata

మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు (Mahesh Babu) ‘కళావతి’ సాంగ్‌ అదిరిపోయింది. సర్కారువారి పాట (Sarkaru Vari Paata) చిత్రంలోని ‘కళావతి’ పాటను ఆదివారంనాడు చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో సాంగ్‌లో సిడ్‌ శ్రీరామ్‌ పాడుతున్నట్లు, సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజిక్‌ ఇస్తున్నట్లు ఉంటూనే మరోవైపు మహేష్‌బాబు, హీరోయిన్‌ కీర్తిసురేష్‌తో డ్యాన్స్‌ చూస్తుంటే సాంగ్‌ అద్భుతంగా వుంది. ఎందుకంటే ఈ పాటను విడుదల చేసిన కొన్ని క్షణాలకే యూట్యూబ్‌లో ఇది మిలియన్ల వ్యూయర్స్‌ను దాటిపోయింది. మాంగళ్యం తంతునా అంటూ సాకీ మొదలైన తర్వాత వందో..ఒక వెయ్యో అని పాట పల్లవి మొదలవుతుంది. ఇలాంటివి నాకు అలవాటు లేదంటూనే నిను జగపడమంటూ తెగ మనసు పిలుస్తున్నదని హృద్యంగా పాట సాగుతుంది. నువ్వే గతీ నువ్వే గతీ కళావతీ అంటూ మహేష్‌బాబు తన హీరోయిన్‌ చుట్టూ తిరుగుతూ అతను వేసిన స్టెప్పుల్లో కొత్తదనం కన్పించింది. పాట మాత్రం అదిరింది! (Story : మహేష్‌బాబు ‘కళావతి’ అదిరిపోయింది!)

‘కళావతి’ పాట సాహిత్యం చదువుతూ పాడుకోండి ఇలా…!

మాంగళ్యం తంతున అనేనా
మమ జీవన హేతున
కంటే బద్నామి శుభగే
త్వం జీవ శరదా శతం

వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు..
మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా
ముందో.. అటు పక్కో.. ఇటు దిక్కో..
చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా

ఇట్టాంటివన్నీ.. అలవాటే లేదే
అట్టాంటి నాకి.. తడబాటసలేందే
గుండె దడగుందే విడిగుందే జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే

కం ఆన్‌ కం ఆన్‌ కళావతీ..
నువ్వేగతే నువ్వేగతీ
కం ఆన్‌ కం ఆన్‌ కళావతీ..
నువు లేకుంటే అదోగతీ

మాంగళ్యం తంతున అనేనా
మమ జీవన హేతున
కంటే బద్నామి శుభగే
త్వం జీవ శరదా శతం

వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు..
మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా

అన్యాయంగా.. మనసుని కెలికావే
అన్నం మానేసి.. నిన్నే చూసేలా
దుర్మార్గంగా.. సొగసుని విసిరావే
నిద్ర మానేసి.. నిన్నే తలచేలా

Kalavathi Song Video

రంగా ఘోరంగా.. నా కలలని కదిపావే
దొంగ అందంగా.. నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చెడగొడితివి కదవే

కళ్ళా అవీ! కళావతీ
కల్లోలమైందె.. నా గతీ
కురులా అవీ.. కళావతీ
కుల్లబొడిసింది.. చాలు తీ!

కం ఆన్‌ కం ఆన్‌ కళావతీ..
నువ్వేగతే నువ్వేగతీ
కం ఆన్‌ కం ఆన్‌ కళావతీ..
నువు లేకుంటే అదోగతీ

మాంగళ్యం తంతున అనేనా
మమ జీవన హేతున
కంటే బద్నామి శుభగే
త్వం జీవ శరదా శతం

వందో.. ఒక వెయ్యో.. ఒక లక్షో.. మెరుపులు..
మీదికి దూకినాయా.. ఏందే నీ మాయా
ముందో.. అటు పక్కో.. ఇటు దిక్కో..
చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా!

Movie : Sarkaru Vaari Paata
Lyricist : Ananta Sriram
Male Singer : Sid Sriram
Music : S. Thaman
Actor : Mahesh Babu
Actress : Keerthy Suresh
Director : Parasuram
https://youtu.be/Vbu44JdN12s

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

0
Minister Perni Nani
Minister Perni Nani

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?
మచిలీపట్నం : ప్రత్యేక హోదా (Special Status) అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఎజెండాలో చేర్చి, ఆ తర్వాత తొలగించడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తిప్పికొట్టారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాను ఎజెండాలో పెట్టటం దేశ ద్రోహ నేరం లాంటిదా అని ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. ఏపీకి హోదా ఇవ్వకూడదన్నదే ఏపీలో ఉన్న టీడీపీ-బీజేపీ వర్గం వైఖరి అని, హోదాను హోల్‌సేల్‌గా అమ్మేసిన బాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే జీవీఎల్‌ కేంద్ర పెద్దల దగ్గర పట్టుబట్టి హోదా అంశాన్ని తీయించారని ఆరోపించారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
నిన్న వీరంతా ఎక్కడ దాక్కున్నారు..?
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు న్యాయం చేసేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ ఎజెండాలో తొలుత చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించామనేసరికి అప్పటిదాకా కలుగుల్లో దాక్కుని, ఒక్కసారిగా బయటకు వచ్చినట్టుగా, బీజేపీ, టీడీపీ వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. రాష్ట్ర బీజేపీలో ఆరెస్సెస్‌ కాలం నుంచి ఉన్న నిఖార్సైన వర్గం ఒకటి అయితే.. చంద్రబాబు సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు బీజేపీలోకి వెళ్ళి, రాష్ట్ర పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకున్న నకిలీ బీజేపీ వర్గం మరొకటి. వీరితోపాటు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో హోదాను హోల్‌ సేల్‌ గా అమ్మేసిన చంద్రబాబు… వీరందర్నీసూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాం.
1. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని కమిటీ ప్రత్యేక హోదా గురించి ఎజెండాలో పెట్టటం అన్నది దేశ ద్రోహ నేరం లాంటిదా?
2. హోదా అంశం ఎజెండాలో పెడితే జీవీఎల్‌ ఎందుకు అంతగా భయపడ్డాడు?. దాన్ని ఎజెండా నుంచి తీసేయటానికి జీవీఎల్‌ ఎందుకు తొందర పడ్డాడు?
3. ఏపీకి హోదా ఇవ్వకూడదన్నదే ఏపీ లో ఉన్న టీడీపీ-బీజేపీ వర్గం స్టాండా?
4. ప్రత్యేక హోదాను ఎజెండాలో పెట్టారని తెలిసిన తరవాత చంద్రబాబు ఎందుకు దాన్ని స్వాగతించలేదు?
5. ఈ రోజు ప్రెస్‌మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టటానికి ముందుకు వచ్చిన పయ్యావుల, అచ్చెన్నాయుడు, కనకమేడల… వీరంతా నిన్న ఎక్కడ దాక్కున్నారు?
6. ఏపీ బీజేపీ(టీడీపీ వర్గం) ఒక్క విషయం స్పష్టం చేయాలి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలని మీరు కేంద్రంలోని మీ ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా? లేదా?
7. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినందుకు చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.
ప్రత్యేక హోదా మీద జీవీఎల్‌, సోము వీర్రాజు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
1. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం అని 2014 బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేశారా? లేదా?
2. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా? లేదా?
3. ఇప్పటికీ దేశంలో అనేక రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందా? లేదా?
4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం మీకు ఇష్టం ఉందా? లేదా?
తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
1. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినది మీరు అవునా.. కాదా?
2. 2014-19 మధ్య మీరూ, బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో పంచుకున్నారా.. లేదా.. అక్కడాఇక్కడా పార్టనర్లు అవునా కాదా?
3. మీరు ప్రత్యేక ప్యాకేజీయే మంచిదని హోదాను తాకట్టు పెట్టారా.. లేదా?
4. మీరు అధికారం నుంచి దిగిపోయేనాటికి, ఎలాంటి ప్యాకేజీ కూడా తీసుకురాకుండా చేతులు ఎత్తేశారా లేదా?
రాష్ట్రం బాగుపడుతుంటే ఎందుకు మీకు ఈర్ష్యాద్వేషాలు?
– జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుంటే.. చూసి, ఓర్వలేక ఈర్ష్యా, అసూయలతో రగిలిపోతూ, మీరు చేస్తున్న నీచ స్థాయి రాజకీయాలను కట్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ, టీడీపీలకు హెచ్చరిక చేస్తున్నాం.
– ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan) గారు ప్రధానమంత్రిని కలిసి విభజన హామీలు, రాష్ట్ర పరిస్థితిపై చర్చించాక, విభజన హామీల గడువు తీరిపోతుంది, ఇప్పటికైనా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, నష్టం పూరించి, న్యాయం చేయాలని కోరిన మీదట.. కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి, ఈనెల 17న సబ్‌ కమిటీ చర్చించే ఎజెండా అంశాలను వెల్లడిరచారు. అయితే ఇంతలోనే రాష్ట్ర బీజేపీ నేతలు, టీడీపీ నేతలు కంగారుపడిపోయి.. ఎజెండాలో ప్రత్యేక హోదాను ఎలా చేరుస్తారంటూ హైరానాపడిపోయి కుట్ర రాజకీయాలకు తెరలేపారు.
ఎజెండాలో చేర్చినప్పుడు ఒక్క మాట మాట్లాడని బాబు..
– వాస్తవానికి రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి, ఏజెండా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వమే. విభజన అంశాలతో పాటు ప్రత్యేక హోదాను కూడా ఒక అంశంగా ఎజెండాలో చేరిస్తే.. అప్పుడు ఒక్క మాట మాట్లాడటానికి ఇష్టపడని చంద్రబాబు, అలానే రాష్ట్ర బీజేపీ పెద్దలు.. దాన్ని తొలగించాక ఏవేవే మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంట.. తామే మోడీ గారికి చెప్పామని, ప్రత్యేక హోదా అంశాన్ని చేర్పించామని చెప్పుకోవచ్చు. అలాకాకుండా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని గోతి కాడ నక్కల్లా కాచుకు కూర్చున్నట్టు… చంద్రబాబు సలహా మేరకు, ఆయన డైరెక్షన్‌ లో జీవీఎల్‌ కేంద్ర పెద్దల దగ్గర పట్టుబట్టి, మీరు ప్రత్యేక హోదాకు జీవం పోస్తే.. రాష్ట్రంలో బీజేపీ చచ్చిపోతుందని చెప్పి, ఆ అంశాన్ని తీయించి… ఈరోజు మళ్ళీ ఈ దయ్యాలు అన్నీ వేదాలు వల్లిస్తున్నాయి.
– హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చినప్పుడు చంద్రబాబు, టీడీపీ నోటికి తాళం వేసుకుంటే.. బీజేపీనేత జీవీఎల్‌ రాష్ట్రానికి మంచిచేసేందుకు కృషి చేయకపోయినా, నష్టం చేసేందుకు చేసిన కృషి వల్ల ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించినట్టున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌ లో జీవీఎల్‌ ఇటువంటి పాత్ర పోషించడానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నాం.
హోదా ఇవ్వటం సోము, జీవీఎల్‌ కు ఇష్టమా.. లేదా?
– 2014 బీజేపీ మేనిఫెస్టోలో పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారా.. లేదా.. ఏపీ ప్రజలను మోసం చేశారా లేదా.. అని నిలదీస్తున్నాం. ఇప్పటికైనా ప్రత్యేక హోదా హామీని బీజేపీ నేతలు నిలబెట్టుకుంటారా.. లేక చేతులెత్తేస్తారా.. లేక ఇంకా పిల్లి మొగ్గలు వేస్తారా.. ?
– దేశంలో చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అర్హత కొనసాగుతుందా లేదా.. ఆ ఫలాలను వారు అనుభవిస్తున్నారా.. లేదా..?- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సోము వీర్రాజు, జీవీఎల్‌ కు ఇష్టం ఉందా… లేదా..? చెప్పాలి. వీళ్ళకు ఏపీపై బఠాని గింజ అంత చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా మీ స్టాండ్‌ ఏమిటో సూటిగా చెప్పండి.
– ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది టీడీపీనా.. కాదా.. మీ ప్యాకేజీలకు హోదాను అమ్మినవాళ్ళు.. కేంద్రం ఎజెండాలో పెడితే మాట్లాడకుండా, తీయగానే మాట్లాడే మిమ్మల్ని ఏమనాలి, రాష్ట్రానికి మీరు చేస్తున్నది ద్రోహం కాదా..? హోదాను మోడీకి హోల్‌ సేల్‌ గా అమ్మేసింది టీడీపీ అవునా.. కదా.. ? పోనీ, ప్యాకేజీలో ఒక్క పైసా అయినా రాష్ట్రానికి తెచ్చారా.. దిగి పోయేనాటికి ఒక్క పైసా కూడా నిధులు తేని మీరు అసమర్థులా కాదా..?
– ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తీసేయడానికి జీవీఎల్‌ ఎందుకు ఆత్రం. అది తీస్తే గానీ మీకు నిద్ర పట్టలేదా..? హోదాను ఎజెండాలో నుంచి తీయించి.. మళ్ళీ మాపై నోరు పారేసుకుంటారా..?. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పేర్ని నాని అన్నారు. (Story : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?)

Also See : డోసు పెంచిన కేసీఆర్‌

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై

0
Work From Home
Work From Home

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై
ఏప్రిల్ 1 నుంచి ఆఫీసు మెట్లెక్కాల్సిందే

హైదరాబాద్ : కొవిడ్ 19 రోగం రెండేళ్ల‌కు పైగా, మూడు ద‌శ‌లుగా మ‌న‌ల్ని వేధించింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది రోగగ్ర‌స్తులు కాగా, ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. తొలి రెండు ద‌శ‌ల క‌రోనా జ‌నాన్ని విప‌రీతంగా భ‌య‌పెట్టింది. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌యంభ‌యంగా ఉండేది. అయితే వ్యాక్సినేష‌న్లు పెర‌గ‌డం, క‌రోనా ప‌ట్ల అవ‌గాహ‌న పెంపొందించుకోవ‌డం, ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలికి అల‌వాటుప‌డ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల క‌రోనా మూడో ద‌శను పెద్ద‌గా కేర్ చేయ‌లేదు. నిజానికి దాని ప్ర‌భావం కూడా త‌క్కువే. క‌రోనాతో జీవితాంతం స‌హ‌జీవ‌నం త‌ప్ప‌నిస‌రి అని అంద‌రికీ తెల్సిందే. అయిన‌ప్ప‌టికీ, మూడో ద‌శ ప్ర‌భావం అంత‌గా లేనికార‌ణంగా జ‌నం కూడా సాధార‌ణ జీవ‌నానికి అల‌వాటుప‌డుతున్నారు. ఈసారి ప్ర‌భుత్వాల నుంచి గానీ, కార్యాల‌యాల నుంచి గానీ ఆంక్ష‌లు కూడా త‌క్కువ‌గానే వున్నాయి. అందుకే రెండేళ్ల క్రితానికి ప్ర‌జ‌లు వెళ్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు చాలా కార్యాల‌యాలు ముఖ్యంగా ఐటీ ఆఫీసులు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోమ్ అవ‌కాశం ఇచ్చాయి. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం వ‌ల్ల ఇక ఐటీ ఆఫీసులతో స‌హా అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్యాల‌యాలు ఇంటి నుంచి ప‌నికి గుడ్‌బై చెప్ప‌నున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆఫీసుల‌కు వ‌చ్చి ప‌నిచేయాల‌న్న ఆదేశాలు ఇవ్వ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. వాస్త‌వానికి ఉద్యోగులు కూడా అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కొన్ని ఐటీ ఆఫీసులు ఇప్ప‌టికే త‌మ ఉద్యోగుల‌కు మెసేజ్‌లు పెట్టాయి. వెంట‌నే ఆఫీసుల‌కు రావాల‌ని కోరాయి.
తెలుగు రాష్ట్రాల్లో…
ఏప్రిల్‌ 1 నుంచి కార్యాలయాల్లో పనిచేసేందుకు సన్నద్ధం కావాలని ఐటీ సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి సందేశాలు పంపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 1500కు పైగా ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 6.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 90 శాతం మంది వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీనివల్ల ఐటీ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాల ఉపాధిపై ప్రభావం పడింది. కార్యాలయాల్లో పనిని పునరుద్ధరిస్తే ఆ వర్గాల ఉపాధికి భరోసా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది నగరానికి దూరంగా సొంతూళ్లలో ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి, అద్దె ఇళ్లు వెతుక్కోవడం, వసతిగృహాల్లో చేరడానికి వీలుగా కంపెనీలు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడిప్పుడే ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. అమ‌రావ‌తి, వైజాగ్‌ల‌లో ఎక్కువ‌గా ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 1200కి పైగా ఏపీలో ఐటీ కంపెనీలు ఉన్న‌ట్లుగా స‌మాచారం. ఈ సంస్థ‌ల్లో క‌నీసం నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. వారిలో 70 శాతం మంది ఇప్ప‌టికే వ‌ర్క్ ఫ్రం హోమ్ విధానంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ కంపెనీల యాజ‌మాన్యాలు సైతం వ‌ర్క్ ఫ్రం హోమ్‌కు గుడ్‌బై చెప్పే ప్లాన్‌లో వున్నాయి. అమ‌రావ‌తి, వైజాగ్‌ల‌లో ఉన్న ఐటీ కంపెనీల్లో మెజారిటీ కంపెనీలు బెంగ‌ళూరు, హైద‌రాబాద్ సంస్థ‌ల‌కు బ్రాంచి ఆఫీసులుగానే వున్నాయి. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌లో ఆఫీసుల‌కు వ‌చ్చి ప‌నిచేయ‌డం మొదలుకాగానే, ఇక్క‌డ కూడా వ‌ర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ కు గుడ్‌బై చెప్ప‌నున్నారు. ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. కొన్ని సంస్థ‌లు ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా ప్రాజెక్టుల వారీగా రప్పించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఒక ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా… గ్రూపులుగా విభజించనున్నాయి. తొలుత వారానికి 2-3 రోజులు కార్యాలయాల్లో, మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్న‌ట్లుగా స‌మాచారం. కరోనాతో రెండేళ్లుగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండ‌టం వ‌ల్ల వే ఆఫ్ డిస్క‌ష‌న్‌, థీమ్ ఆఫ్ డిస్క‌ష‌న్‌, గుడ్ రిజ‌ల్ట్ ఫ్రం డిస్క‌ష‌న్ వంటి అంశాల విష‌యంలో ఐటీ కంపెనీల‌కు న‌ష్టాలే జ‌రిగాయి. అందుకే ఆఫీసుల‌కు రావ‌డం ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్నాయి. ప్రస్తుతం కార్యాలయాలకు పది శాతం మంది వస్తున్నారు. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా కార్యాలయం నుంచి పని ప్రారంభించుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్‌ నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు వస్తారని ఒక సంస్థ బాధ్యుడు చెపుతున్నారు. (Story : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌కు బైబై)

డోసు పెంచిన కేసీఆర్‌

0
KCR
KCR

డోసు పెంచిన కేసీఆర్‌

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు త‌న‌దైన శైలిలో డోసు పెంచారు. మోడీ విధానాల‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ స‌హ‌జంగానే ఆరు మాసాలకోసారి మోడీని తిడుతూవుంటారు. ఆ త‌ర్వాత ఢిల్లీ వెళ్లి రాజీప‌డుతూ వుంటార‌న్న ఆరోప‌ణ‌లు వున్నాయి. కానీ ఈసారి మోడీ స‌ర్కారు దిమ్మ‌దిరిగిపోయేలా విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించారు. రాష్ట్రంలో బీజేపీ హ‌వా నెమ్మ‌దిగా పెర‌గ‌డం, కాంగ్రెస్ కు ప్ర‌జ‌ల్లో అభిమానం త‌గ్గుతుండ‌టంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీని టార్గెట్ చేయ‌డం మిన‌హా వేరే మార్గం లేద‌ని కేసీఆర్ భావించిన‌ట్లుగా క‌న్పిస్తున్న‌ది. అందుకే శ‌నివారం ఆయ‌న భువ‌న‌గిరి స‌మావేశంలో మోడీపై విరుచుకుప‌డ్డారు. ఒక ద‌శ‌లో కాంగ్రెస్‌కు ప‌రోక్షంగా స‌పోర్ట్ కూడా చేశారు.
ఈ స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే…
దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది.

వ్యవసాయ బావికి మోటారు పెట్టాలంటున్న ప్రధాని మోడీని తరిమి తరిమి కొట్టాలి.

ఎనిమిదేండ్ల బిజెపి పాలనలో దేశం సర్వనాశనమైంది.

దేశ రాజకీయాల్లో మొలకెత్తిన కుక్కమూతి పిందే బిజెపి

ఈ దరిద్రాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే దేశ ప్ర‌జ‌ల‌కు అంత మంచిది.

రైతులను అరిగోస పెట్టడానికి పిచ్చి పాలసీలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మోడీకి తెలంగాణ ఉద్యమ సెగ చూపిద్దాం

రైతులకు వ్యతిరేకంగా మోడీ వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి దాదాపు ఏడాది కాలం రైతులను ఏడిపించారు.

ఢిల్లీ దగ్గర రైతులను అవమానించారు.

రైతులను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులుగా చీత్రికరించే ప్రయత్నం చేశారు.

ఓ కేంద్ర మంత్రి ఏకంగా రైతులు ధర్నా చేస్తుంటే వారి మీదికి కారు ఎక్కించి రైతులను చంపడం దుర్మార్గం.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు భయపడి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు.

చివ‌ర‌కు ఏకంగా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు.

తెలంగాణలో సొంత పైసలు పెట్టి రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తుంటే కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీని అమలు చేయాలని, రాష్ట్రంలోని ప్రతి బావి దగ్గర ఉండే మోటారుకు మీటరు పెట్టాలని కేంద్రం మెడ మీద కత్తి పెట్టి ఒత్తిడి తెస్తున్న‌ది.

కానీ ఎట్టి పరిస్థితిల్లో మోటారు దగ్గర మీటరు పెట్టబోం

మరో ఐదారేండ్లు రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని స్థిరీకరించేలా చేస్తాం.

వాస్తవాలు మాట్లాడితే.. “కెసిఆర్‌ నీ అంతు చూస్తామ అని బెదిరిస్తుండ్రు. కానీ కెసిఆర్‌ ఎవ్వరికీ భయపడడు. అలా చేస్తే తెలంగాణ వచ్చేదా?

మోడీ సిగ్గు పడాలి. దేశం ఎవ్వడి అయ్య సొత్తు కాదు.

సర్వ నాశనం చేస్తుంటే.. చేతులు మూడ్చుకుని చూస్తూ కూర్చోబోం

జనగామలో మాట్లాడితే.. బిజెపి వాళ్ల లాగులు తడిసినయ్‌. కెసిఆర్‌ను పీకీ పారేస్తం. సముద్రంలో నీటి చుక్క అంత అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు. కెసిఆర్‌ను చూసి బిజెపి ఎందుకు భయపడుతుందో చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అవినీతి జరుగుతోంది.

కేంద్ర మంత్రుల అవినీతి చిట్టా నా చేతికి వచ్చింది.

వారి అంతు తేలుస్తా

త్వరలోనే ఆ గుంట నక్కల అవినీతిని బయటకు తీసుకొస్తాం

చాలామంది ఫోన్లు చేసి అవినీతిని బయటపెట్టాలంటూ చెబుతున్నారు.

దేశమంతా తిరిగి ప్రధాని మోడీ సంగతి చెబుతాం.

ఇటీవలే మమతా బెనర్జీ, ఉద్దవ్‌ థాక్రే, స్టాలిన్‌లు నాతో మాట్లాడారు.

మోడీకి గర్వం అంత మంచిది కాదు

ఎనిమిదేండ్ల బిజెపి పాలనలో దేశం సర్వనాశనమైంది.

ఏ ఒక్క రంగాన్నీ కేంద్ర ప్రభుత్వం బాగు చేయలేదు.

దేశాన్ని అభివృద్ది చేయమంటే బిజెపి మత పిచ్చిని లేపుతోంది.

పొద్దున లేస్తే లాఠీ ఛార్జీలు.. లూటీ ఛార్జీలు జరిగితే.. పెట్టుబడులు ఏలా వస్తాయి.

యావత్‌ దేశానికి తలమానికంగా ఉండే బెంగుళూరులోని సిలికాన్‌ వ్యాలీ ఐటీ రంగంలో మొదటి స్థానంలో ఉండేది. కానీ నేడు దాన్ని కాశ్మీర్‌ వ్యాలీగా మార్చేశారు.

కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఆడపిల్లలు, పసికూనల మీద రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.

దేశంలో నిత్యం నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది.

పారిశ్రామిక ఉత్పత్తులు నెలనెలా పడిపోతున్నాయి.

దేశంలో సుమారు 16 లక్షల కంపెనీలు మూతపడ్డాయి.

ఇదేనా మీ పరిపాలనకు తార్కాణం?

ఇలాంటి మత విద్వేశాలు ఎవడి కడుపు నింపుతాయో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి.

ప్రజలంతా గమనించి రాజకీయంగా స్పందించి సరైన తీర్పు ఇవ్వాలి.

లేకుంటే దేశం నాశనమైపోతుంది.

దేశంలో ఆకలి పెరుగుతోంది.

115 దేశాల్లో సర్వే చేస్తే.. ఇండియా 101వ స్థానంలో ఉంది.

బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్తాన్‌ లాంటి దేశాలు సైతం మనకంటే బెటర్‌ పొజిషన్లో ఉన్నాయి.

మరి బిజెపి ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలి.

మోడీ లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల దేశంలోని అనేకమంది రోడ్డున పడ్డారు.

స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి పరిస్థితులు ఒక్క మోడీ ప్రభుత్వంలోనే కనిపించాయి.

పవిత్రమైన గంగానదిలో శవాలు తేలుతాయా..? దీనికి ఏం సమాధానం చెబుతారు?

మనం మేల్కోకపోతే.. చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. అందరం కలిసి పోరాడుదాం

గ్రీన్‌ పవర్‌ కొనాలే. ఆయన దోస్తులు.. పెట్టుబడిదారులు ఎవరో.. 30 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ పెడుతడట.. మనం కొనాలట.

నాగార్జునసాగర్‌, శ్రీశైలంలో ఇదే జిల్లాలో పులిచింతలకాడ మనకు హైడ్రో ఎలక్ట్రికల్‌ పవర్‌ ఉంటే.. అది ఉన్నా కూడా దాన్ని బంద్‌ పెట్టి ఆయన తరఫున పెట్టుబడిపెట్టే షావుకార్లు ఇచ్చేదే కొనాలట. దానికి అందమైన పేరు విద్యుత్‌ సంస్కరణ. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే మీకు డబ్బులు ఇస్తం. లేకుంటే ఇయ్యం. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పిచ్చెక్కి రైతులతో పెట్టుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంగా దీన్ని ఒప్పుకుందమా?

ఫ్రీగా కరెంటు ఇవ్వాలంటే.. మరి ఏం చేద్దాం.. నరేంద్ర మోడీని.. తరిమితిరిమి కొట్టాలి

మాకు ఇవ్వకున్నా పర్లేదు.. ఉన్నంతలో మేం ఇచ్చకుంటామంటే.. అలా ఇవ్వడానికి లేదు అంటున్నారు.. మరి కొట్లాడాలా.. ఇంట్ల పండాలా

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై బిజెపి ప్రభుత్వం సంస్కారం మరిచి మాటల దాడి చేసింది. రాహుల్‌ గాంధీతో నాకేం సంబంధం లేకున్నా ఆయన నాన్న, నాన్నమ్మ, తాతలు దేశం కోసం ఎంతో సేవ చేశారు. అలాంటి రాహుల్‌ గాంధీని పట్టుకుని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వాశర్మ ‘నువ్వు ఎక్కడో పుట్టావో.. మేం అడిగామా రాహుల్‌ గాంధీ’ అంటూ మాట్లాడారు. ఇదేనా బిజెపి సంస్కారం..?

మీకు ఏ మాత్రం సంస్కారం ఉన్నా.. అస్సామ్‌ ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలి.

ఓపికకు హద్దులుంటాయి.. ఏం తమాషా చేస్తున్నారా.. దేశం నాశనమైపోతే ప్రజలు ఉరుకుంటారా..?

న్యాయంకోసం పోరాడేందుకు తెలంగాణ రాష్ట్రం పులిలా ముందుంటుంది.

అది తెలంగాణ గడ్డలో ఉండే పౌరుషం.

-ఇదీ కేసీఆర్ ప్ర‌సంగం. దాటిగా ధీటుగానే వుంది. కాక‌పోతే మ‌రో వారం ప‌ది రోజుల్లో ఆయ‌న ఢిల్లీ వెళ్ల‌క‌పోతే…నిజంగానే ఆయ‌న మాట‌లు న‌మ్మాల్సిందే. జాతీయ రాజ‌కీయాల్లో మార్పు చూడాల్సిందే. (Story: డోసు పెంచిన కేసీఆర్‌)

See Also : కోటిస్తే పేరుపెడ‌తా

ఐపీఎల్‌లో ఇప్ప‌టికి వీళ్లే

0
IPL-2022-Auction
IPL-2022-Auction

ఐపీఎల్‌లో ఇప్ప‌టికి వీళ్లే
ఫ్రాంచైజీల వారీగా ఆట‌గాళ్ల వివ‌రాలు

బెంగళూరు: ఐపీఎల్‌లో ఇప్ప‌టికి వీళ్లే! ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మెగా వేలంలో శ‌నివారంనాడు తొలిరోజు ప‌ది ఫ్రాంచైజీలు కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను కైవ‌సం చేసుకున్నాయి. ఇషాన్ కిష‌న్ వంటివారు హైలైట్స్‌గా నిలిచారు. ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో శనివారం మొత్తం 74 మంది ఆటగాళ్లను వివిధ ఫ్రాంఛైజీలు దక్కించుకున్నాయి. తమకు నచ్చిన ఆటగాళ్లను భారీ ధరకు సొంతం చేసుకున్నాయి.

ముంబయి ఇండియన్స్‌: బాసిల్‌ థంపి (రూ.30 లక్షలు), మురుగన్‌ అశ్విన్‌ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్‌ బ్రేవిస్‌ (రూ.3 కోట్లు), ఇషాన్‌ కిషాన్‌ (రూ.15.25 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.27.85 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌: తుషార్‌ (రూ.20 లక్షలు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు), దీపక్‌ చాహర్‌ (రూ.14 కోట్లు), ఆసిఫ్‌ (రూ.20 లక్షలు), బ్రావో (రూ.4.4 కోట్లు), ఉతప్ప (రూ.2 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.45 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: పూరన్‌ (10.75 కోట్లు), సుచిత్‌ (రూ.20 లక్షలు), శ్రేయస్‌ గోపాల్‌ (రూ.75 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.4 కోట్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (రూ.8.75 కోట్లు), భువనేశ్వర్‌ కుమార్‌ (రూ.4.20 కోట్లు), నటరాజన్‌ (రూ.4 కోట్లు), ప్రియమ్‌ గార్గ్‌ (రూ.20 లక్షలు), అభిషేక్‌ శర్మ (రూ.6.50 కోట్లు), రాహుల్‌ త్రిపాఠి (రూ.8.50 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.20.15 కోట్లు.

రాజస్థాన్‌ రాయల్స్‌: కరియప్ప (రూ.30 లక్షలు), రియాన్‌ పరాగ్‌ (రూ.3.80 కోట్లు), బౌల్ట్‌ (రూ.8 కోట్లు), అశ్విన్‌ (రూ.5 కోట్లు), చాహల్‌ (రూ.6.50 కోట్లు), హెట్‌మయర్‌ (రూ.8.50 కోట్లు), ప్రసిద్ధ్‌ కృష్ణ (రూ.10 కోట్లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (రూ.7.75 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.15 కోట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌ (రూ.7 కోట్లు), అనుజ్‌ రావత్‌ (రూ.3.40 కోట్లు), హేజిల్‌వుడ్‌ (రూ.7.75 కోట్లు), ఆకాశ్‌ దీప్‌ (రూ.20 లక్షలు), షాబాజ్‌ అహ్మద్‌ (రూ.2.40 కోట్లు), దినేశ్‌ కార్తీక్‌ (రూ.5.50 కోట్లు), హర్షల్‌ పటేల్‌ (రూ.10.75 కోట్లు), హసరంగ (రూ.10.75 కోట్లు); మిగిలిన మొత్తం: 9.25 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శివమ్‌ మావి (రూ.7.25 కోట్లు), షెల్డన్‌ జాక్సన్‌ (రూ.60 లక్షలు), కమిన్స్‌ (రూ.7.25 కోట్లు), శ్రేయస్‌ (రూ.12.25 కోట్లు), నితీశ్‌ రాణా (రూ. 8 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.12.65 కోట్లు

దిల్లీ క్యాపిటల్స్‌: శార్దూల్‌ (రూ.10.75 కోట్లు), మిచెల్‌ మార్ష్‌ (రూ.6.50 కోట్లు), ముస్తాఫిజుర్‌ (రూ.2 కోట్లు), కేఎస్‌ భరత్‌ (రూ.2 కోట్లు), వార్నర్‌ (రూ.6.25 కోట్లు), కుల్‌దీప్‌ యాదవ్‌ (రూ.2 కోట్లు), అశ్విన్‌ హెబ్బర్‌ (రూ.20 లక్షలు), కమలేష్‌ నాగర్‌కోటి (రూ.1.10 కోట్లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (రూ.20 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.16.50 కోట్లు

పంజాబ్‌ కింగ్స్‌: జితేశ్‌ శర్మ (రూ.20 లక్షలు), షారుక్‌ ఖాన్‌ (రూ.9 కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (రూ.3.80 కోట్లు), ధావన్‌ (రూ.8.25 కోట్లు), ఇషాన్‌ పోరెల్‌ (రూ.25 లక్షలు), రబాడ (రూ.9.25 కోట్లు), రాహుల్‌ చాహర్‌ (రూ.5.25 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌ (రూ.60 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.28.65 కోట్లు

గుజరాత్‌ టైటాన్స్‌: నూర్‌ అహ్మద్‌ (రూ.30 లక్షలు), రాయ్‌ (రూ.2 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు), రాహుల్‌ తెవాతియా (రూ.9 కోట్లు), అభినవ్‌ (రూ.2.60 కోట్లు), ఫెర్గూసన్‌ (రూ.10 కోట్లు), సాయి కిశోర్‌ (రూ.3 కోట్లు); మిగిలిన మొత్తం: రూ.18.85 కోట్లు

ల‌క్నో సూపర్‌జెయింట్స్‌: అవేశ్‌ ఖాన్‌ (రూ.10 కోట్లు), డికాక్‌ (రూ.6.75 కోట్లు), మార్క్‌వుడ్‌ (రూ.7.50 కోట్లు), మనీశ్‌ పాండే (రూ.4.60 కోట్లు), హోల్డర్‌ (రూ.8.75 కోట్లు), దీపక్‌ హుడా (రూ.5.75 కోట్లు), కృనాల్‌ పాండ్య (రూ.8.25 కోట్లు), అంకిత్‌ సింగ్‌ (రూ.50 లక్షలు); మిగిలిన మొత్తం: రూ.6.90 కోట్లు (Story : ఐపీఎల్‌లో ఇప్ప‌టికి వీళ్లే)

See Also : యువ క్రికెటర్లకు కాసులపంట

 

 

 

కోటిస్తే పేరుపెడ‌తా

0
KTR
KTR

కోటిస్తే పేరుపెడ‌తా
హైదరాబాద్ – పాఠ‌శాల‌కు కోటి రూపాయ‌లు ఇస్తే ఆ పాఠ‌శాల‌కు వారి పేరు పెడ‌తామ‌ని ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముం దుకు వచ్చి రూ. కోటి లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే వారు సూచించిన పేరును ఆ పాఠశాలకు పెడతామని మంత్రి అన్నారు. రూ.పది లక్షలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే ఆయా క్లాస్‌ రూమ్‌కి వారు సూచించిన పేరు పెట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు తమకు తోచినంత మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముందుకు వచ్చే వారందరికీ కూడా ప్రత్యేక వెబ్‌ సైట్‌ రూపొందించిన తద్వారా డొనేషన్లు తీసుకోనున్నట్లు మంత్రి కెటిఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని కెటిఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐలతో శనివారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కె తారకరామారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని, లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని, వాటికి సంబంధించిన ఫలాలు అందుతున్న విషయాన్ని కెటిఆర్‌ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, వాటి ద్వారా విద్యార్థులు సాధిస్తున్న విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. నూతన విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సైతం బలోపేతం చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందని మంత్రి కెటిఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 7289 కోట్ల రూపాయలతో, దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివద్ధి చేయనున్నట్లు మంత్రి కెటిఆర్‌ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ర్టం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని ఈ విషయంలో కోరుతున్నట్లు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు త్వరలోనే సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాలలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు కలిసిరావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాలు లేదా తాము ఎంచుకున్న ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు లేదా వాటి అభివృద్ధికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చే ఎన్నారైల అందరికీ విద్య శాఖ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. (Story :కోటిస్తే పేరుపెడ‌తా)

See Also : జనవరిలో హైదరాబాద్‌లో 5,568 అపార్ట్‌మెంట్ల అమ్మకాలు

పిల్లలకు వ్యాక్సిన్‌ ఓకేనా?

0
Covid Vaccine
Covid Vaccine

పిల్లలకు వ్యాక్సిన్‌ ఓకేనా?
శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తే తప్ప 5-15 ఏళ్లలోపు పిల్లలకు టీకా వద్దంటున్న కేంద్ర మంత్రి
న్యూదిల్లీ : పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌పై ఇంకా గందరగోళం కొనసాగుతోంది. శాస్త్రవేత్తలు చెపితే తప్ప దానిపై ముందడుగు వేయలేమని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. దేశంలో కోవిడ్‌ వాక్సినేషన్‌ జోరుగా సాగుతున్నప్పటికీ, 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు వ్యాక్సినేషన్‌ విషయంలో శాస్త్రవేత్తలు చేసే సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. ఈ వయస్సు వారికి వ్యాక్సినేషన్‌పై నిపుణులు ఇప్పటివరకు ఎటువంటి సిఫార్సులు చేయలేదని మంత్రి గుర్తుచేశారు. శాస్త్రవేత్తల సంఘం చేసే సిఫార్సుల ఆధారంగా ఏ వయస్సు వారికి ఎప్పుడు వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని, వారంలోగా ప్రికాషన్‌ గ్రూపు కోసం సిఫార్సులు అమలు చేస్తామని తెలిపారు. సిఫార్సులు వచ్చాక 5`15 ఏళ్ల వారికి టీకాలు ఇస్తామన్నారు. 15`18 మధ్య వయస్సు వారికి గతనెలలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదలైంది. వ్యాక్సినేషన్‌ సమస్య లేదని, సరిపడ టీకాలు అందుబాటులో ఉన్నాయని మాండవియా చెప్పారు. 5-15 ఏళ్ల పిల్లలపై వ్యాక్సిన్‌ ప్రభావంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని, వారి సిఫార్సుల మేరకే టీకాలు అందజేస్తామన్నారు. మూడవ దశలో వైరస్‌ కట్టడికి వాక్సిన్‌లను భారత్‌ సమర్థంగా వినియోగించుకుందని తెలిపారు. ఇప్పటివరకు 96శాతం మంది మొదటి టీకా పొందగా 77 శాతం మంది రెండు టీకాలు పొందారని, 15`18 వయస్సు వారిలో 75 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని కేంద్రం లెఖ్కలు చెపుతోంది.(Story: పిల్లలకు వ్యాక్సిన్‌ ఓకేనా?)

See Also: కరోనా తగ్గుముఖం

వ్యాక్సిన్లనూ వదలరా?

0
Narendra Modi
Narendra Modi

వ్యాక్సిన్లనూ వదలరా?
టీకాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని ఖండిరచిన ప్రధాని మోడీ
డెహ్రాడూన్‌ : కొవిడ్‌ టీకాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా ప్రధాని మోడీ కూడా స్పందించారు. కరోనా వ్యాక్సిన్ల విషయంలో కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని నరేంద్రమోడీ విమర్శించారు. ఉత్తరాఖండ్‌ ఎన్నికలు పురస్కరించుకొని శనివారం రుద్రపూర్‌లో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేదేమీ లేకపోవడంతో కోవిడ్‌ టీకాలను రాజకీయాలకు వాడుకుంటుందని మండిపడ్డారు. ఇటీవల మరణించిన దేశ ప్రథమ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కాంగ్రెస్‌ నిందిస్తోందని ఆరోపించారు. జనరల్‌ రావత్‌ను అవమానిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఉత్తరాఖండ్‌ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించిందని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా బియ్యం అందజేశామని, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదన్నారు. కోవిడ్‌ కాలంలో ఏ ఒక్క పేదవాడిని ఆకలి కడుపులతో పండుకోనివ్వలేదన్నారు. ఉత్తరాఖండ్‌ అభివృద్ధి విషయంలో బీజేపీని ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేరని, రాష్ట్రంలో రోడ్లు, రైల్వే, విమానాల అనుసంధానం పనులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు చేసిందని మోదీ చెప్పారు.(Story :వ్యాక్సిన్లనూ వదలరా?)

‘హిజాబ్‌’పై రచ్చరచ్చ!

Photo Gallery

error: Content is protected !!