Home Blog Page 955

హర్రర్ థ్రిల్లర్ అను!

0
Movie Anu
Movie Anu

షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ అను. !!!

హర్రర్ థ్రిల్లర్ అను! తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం అను. ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. హొలీ సందర్భంగా ఈ చిత్రంలోని లిరికర్ సాంగ్ ఏమైంది ఏమో సాంగ్ ను విడుదల చేశారు. సాంగ్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ మూవీలో మిగిలిన సాంగ్స్ త్వరలో విడుదల కానున్నాయి.
హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ బాగుంటాయని చిత్ర యూనిట్ తెలిపారు. కథ, కథనాలు బాగున్న సినిమాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అను సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉందని హీరో ప్రశాంత్ కార్తిక్ తెలిపారు. దర్శకుడు భీమినేని శ్రీనివాస్, మరియు దేవి ప్రసాద్ ఈ చిత్రంలో మంచి పాత్రల్లో నటించారు. సినిమా ఔట్ ఫుట్ బాగా వచ్చింది. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.
బ్యానర్: తేజస్వి క్రియేటివ్ వర్క్స్
నటీనటులు: ప్రశాంత్ కార్తిక్, మిష్టి చక్రవర్తి, కార్తిక్ రాజు, ఆమని, భీమినేని శ్రీనివాస్, దేవి ప్రసాద్ తదితరులు
సంగీతం: గంటసాల విశ్వనాధ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ గోపిశెట్టి (Story: హర్రర్ థ్రిల్లర్ అను!)

ఘోరాతి ఘోరం!

0
Accident in Andhra Karnataka Border
Accident in Andhra Karnataka Border

ఘోరాతి ఘోరం!

ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ప్రమాదం.. 20 మంది మృతి!

అనంత‌పురం: ఆంధ్రా- కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కానీ 20 మందికిపైగా మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. 38 మందికి గాయాల‌య్యాయి. ఈ బ‌స్సులో 130 మంది ప్ర‌యాణిస్తున్నారు. రెండు బ‌స్సుల్లో వెళ్లాల్సిన వారు ఒకే బ‌స్సులో వెళ్లాల్సి రావ‌డంతో బ‌స్సు ఓవ‌ర్‌లోడ్ అయింది. పైగా డ్రైవ‌రు నిర్ల‌క్ష్య కార‌ణంగానే బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డిన‌ట్లు పోలీసులు చెపుతున్నారు.

అయితే ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న బస్సు టాప్‌పై ఎక్కువ మంది డిగ్రీ విద్యార్థులున్నట్లు సమాచారం. మృతుల్లో టాప్‌పై నుంచి దూకిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో ఏపీకి చెందిన షాన్‌వాజ్‌(20) మృతి చెందారు. కంబదూరు మండలం బెస్తరపల్లిలో ఇతను మెకానిక్‌గా పని చేసేవాడని గుర్తించారు. మృతుల్లో కర్ణాటక వాసులు అమూల్య(20), అంజిత్‌(23), కల్యాణ్‌(27) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ దుర్ఘ‌ట‌న‌లో 20 మందికిపైగా మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే, శ‌వాల‌ను పోస్ట్‌మార్ట‌మ్‌కు తీసుకువెళ్ల‌కుండా వారి బంధువులు వాటిని తీసుకుపోయిన‌ట్లు తెలిసింది. దీంతో ఎంత మంది చ‌నిపోయారో అధికారికంగా తెలియ‌డం లేద‌ని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. (Story: ఘోరాతి ఘోరం!)

ఘోరాతి ఘోరం! న్యూస్ ఫుల్ వీడియో కోసం మీడియాఫైల్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌ను చూడండి! (Copy Paste the bolow URL)

https://www.youtube.com/channel/UCu2Q3FwLOZJ_eR_A-1YDwsg

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

0

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…! ఆర్ ఆర్ ఆర్ టీమ్ దుబాయ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్ ఆర్ రాజ‌మౌళి, హీరోలు జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు ఈ మీట్‌లో పాల్గొన్నారు. దుబాయ్ జ‌రుగుతున్న ఎక్స్‌పో సంద‌ర్భంగా ఈ ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ఆర్ ఆర్ ఆర్ ప్రొమోష‌న్‌లో భాగంగా టీమ్ ప్ర‌స్తుతం దుబాయ్‌లో వుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి, ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు చిత్రం గురించి ఏమ‌న్నారో ఈ వీడియోలో చూడండి!

Story: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

See Also : మెగాస్టార్ మేడే!

94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం!

0
vitamin ‘D’ deficiency in women
vitamin ‘D’ deficiency in women

94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం!

మహిళల్లో విటమిన్ ‘డి’ లోపం వ్యాప్తి అంచనాలు 50% నుండి 94% వరకు ఉన్నాయి –  నిర్ధారణ అయిన సంఖ్య మొత్తంలో అతి కొద్ది భాగం మాత్రమే!

ఇంటిలోనే ఉండడం మరియు అనారోగ్యకరమైన ఆహార జీవనశైలి వ్యాధికి శాపంగా మారుతున్నాయి.

94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం! : ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (FOGSI) పల్స్ ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి భారతీయ మహిళల్లో విటమిన్ ‘డి’ లోటును తగ్గించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాయి. ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్, డాక్టర్ శాంతకుమారి మరియు పల్స్ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ రాంబాబు ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంలో వివిధ సూచనలతో విటమిన్ ‘డి’ తగిన స్థాయిలపై అవగాహన కల్పిస్తూ, చికిత్సకు సంబంధించిన సైంటిఫిక్ ప్రాక్టీస్ పాయింట్లను రూపొందించడం ద్వారా ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించారు.

భారతదేశంలో స్త్రీల ఆరోగ్యం నానాటికీ తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నది. మహిళల శ్రేయస్సు మరియు రోగనిరోధక శక్తి స్థాయిలు దృఢంగా ఉండాల్సిన వారి మొత్తం ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఏది ఏమైనప్పటికీ, మహిళల ఆరోగ్యం క్షీణించడానికి తాజాగా వెల్లడైన ప్రధాన సూచికలలో ఒకటి విటమిన్ ‘డి’ లోపం. ఈ లోపం చాలా సాధారణమైనదిగా గుర్తించబడినప్పటికీ సాధారణంగా చూస్తే ఇది రోగలక్షణం కాదు. వయస్సువారీ వర్గాలలో 50% నుండి 94% వరకు ప్రాబల్యం ఉన్నట్లుగా యాదృచ్ఛికంగా గత దశాబ్దంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి మరియు దీని ప్రాబల్యం దేశవ్యాప్తంగా కనిపించింది. ఇతర వ్యాధులకు చికిత్స పొందుతున్నప్పుడు మరియు కొన్ని సందర్భాల్లో తరచుగా ఇది సరిదిద్దలేనంత లోపంగా ఉంటున్నది.

ఈ నిశ్శబ్ద రుగ్మతపై అవగాహన కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కేవలం రోగులకు మాత్రమే పరిమితం చేయడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. విటమిన్ ‘డి’ లోపం సమస్యను ఎదుర్కోవడానికి వైద్య సమాజం సహకారం కూడా చాలా అవసరం. టైమ్స్ ఆఫ్ గైనకాలజీ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించే సూచనలపై శాస్త్రీయమైన చర్చలను చేయడం ద్వారా వైద్య సమాజంలో దీనిపై అవగాహన పెంపొందించడానికి మరియు ఈ అంశం ఊపందుకోవడానికి సరైన మార్గం అని డాక్టర్ శాంతకుమారి అన్నారు. FOGSI కు నేను అధ్యక్షురాలిని, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండి ఈ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిని. FOGSI భారతదేశంలో 262 సంఘాలతో 38000 మంది గైనకాలజిస్టుల సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 132 దేశాలలో ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అండ్ అబ్‌స్టెట్రిక్స్ FIGO కు ట్రస్టీగా ఉన్నాను. మనం ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో గత రెండు సంవత్సరాలుగా COVID మనకు నేర్పింది. శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యవంతమైన శరీరం అవససరం. బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. స్త్రీలైనా, పురుషులైనా ప్రజల ఆరోగ్యంపై మనం పెట్టుబడి పెట్టాలి. దురదృష్టవశాత్తూ మహిళల్లో సూక్ష్మ మరియు స్థూల పోషకాల యొక్క అధిక లోపాన్ని మనం చూస్తున్నాము, సాధారణ సమస్యలలో ఒకటి రక్తహీనత, అయినప్పటికీ దీని ప్రాబల్యం 80% నుండి 90% వరకు తగ్గింది, అయితే ఇప్పటికీ జనాభాలో 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మన దేశంలో ప్రబల సమస్య సూక్ష్మ మరియు స్థూల పోషకాలతో పాటు ఐరన్ లోపం, రక్తహీనత. మన దేశంలోని అన్ని ఆరోగ్య సమస్యలకు మూలం పోషకాల లోపమే కారణం. ఈ పోషకాహార లోపానికి కారణం మనం తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన సరైన పోషకాలు లేకపోవడమే. మనం ఆచరించే జీవనశైలి కూడా ఆరోగ్యకరమైన జీవితానికి కావలసినవన్నీ అందివ్వడం లేదు. అది పంటలను పండించడానికి ఉపయోగించే పురుగుమందులు కావచ్చు, అనారోగ్యకరమైన జీవనశైలి మార్పులు, పర్యావరణ కారకాలు శరీరంకు కావలసిన సూక్ష్మ మరియు స్థూల పోషకాల అవసరాలను ప్రభావితం చేస్తాయి మరియు పోషకాహార లోపం అన్ని సమస్యలను మనం ఎందుకు ఎదుర్కొంటున్నాము అనేవి చాలా ముఖ్యమైన కారణాలు కావచ్చు. విటమిన్ డి లోపం గురించి తాజాగా అనేక చర్చలు జరుగుతున్నాయి, కొన్ని దశాబ్దాల క్రితం మన దేశంలో సూర్యరశ్మికి గురికావడం వల్ల ఉష్ణమండల అయిన మన దేశంలో ఇది ఒక సమస్యగా ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు మరియు మన వాతావరణం మరియు జీవనశైలి కారణంగా భారతీయులమైన మనం అదృష్టవంతులమని మనం భావించాము. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ పరిస్థితులు మారాయి, మనం ఉన్నదాని నుండి ఇతర సంస్కృతులను అనుసరించేలా మనం మారాము. మనం ఖండాంతర అలవాట్లను అవలంబించాము మరియు మన అసలు అలవాట్లను మరచిపోయాము, ఇనుప పాత్రలలో వంట చేయడం, శారీరక వ్యాయామం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం వంటివి మానేశాము, ఎందుకంటే మన పద్దతులు ప్రాచీనమైనవి మరియు ఆ విదేశీ పద్దతులే సరైన పద్ధతులు అని మనం భావించాము. గత దశాబ్దంలో అకస్మాత్తుగా మనం విటమిన్ డి లోపంతో ఉన్నామని గ్రహించాము. ఈ విటమిన్ డి లోపం మన జీవక్రియ ప్రక్రియను చాలా ప్రభావితం చేస్తోంది మరియు చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు, నేడు హైదరాబాద్ భారతదేశం యొక్క డయాబెటిక్ రాజధానిగా మారింది. విటమిన్ డి లోపం మహిళల్లో కండరాలు మరియు ఎముకల నొప్పికి దోహదం చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మేము విటమిన్ డి లోపాలను తనిఖీ చేయడానికి ఎప్పుడూ ఉపయోగించలేదు, కానీ మేము విటమిన్ డి కోసం పరీక్షలు చేసినప్పుడు అకస్మాత్తుగా చాలా లోపాలను కనుగొన్నాము, ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, మూత్రపిండాల వైఫల్యం, డయాలసిస్, ఎముకల నొప్పి, కండరాల నొప్పులు మొదలైన అనేక కేసులను మనం చూస్తున్నాం. ప్రజలు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకుంటున్నారు. నొప్పి అనేది విటమిన్ డి లోపం యొక్క లక్షణం, పోషకాల ద్వారా దాన్ని పరిష్కరించే బదులు మనం పెయిన్ కిల్లర్‌లతో మాత్రమే నెట్టుకొసస్తున్నాము, దానివలన మరికొన్ని దుష్ర్పభావాలు కొని తెచ్చుకుంటున్నాము. స్త్రీలు తమ ఆరోగ్యం గురించి కౌమారదశ నుండి వృద్దాప్యం వరకు తగిన జాగ్రత్త వహించాలి, ఎందుకంటే శారీరక శ్రమ మరియు తగినంత ఆహారం రెండింటి ద్వారా ఎముక మరియు కండరాల బలం కలిసి ఉంటే కనుక స్త్రీ గర్భవతి అయినప్పుడు లేదా వృద్ధాప్యంలో ఉన్నా దుష్ప్రభావాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. నొప్పికి పెయిన్ కిల్లర్ మాత్రమే సమాధానం కాదు, దానికి మూల కారణాన్ని గుర్తించి పరిష్కరించాలి, అది సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తుంది. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, బలమైన రోగనిరోధక శక్తితో మనం కోవిడ్ వంటి వ్యాధులతో కూడా మెరుగ్గా ఉండగలము.

విటమిన్ ‘డి’ లోపం మూడు అత్యంత సాధారణమైన లక్షణాలు ఏమిటంటే నిరంతరం అలసటతో ఉండడం, ఇందులో వ్యక్తి చాలా త్వరగా అలసిపోతాడు మరియు అన్ని సమయాలలోనూ అలసిపోతాడు, ఎముకలు, కీళ్ళు మరియు కండరాల నొప్పులు ఉండడం, శారీరకమైన నొప్పులు, నడుము నొప్పి మరియు చివరిదే అయినా విస్మరించరాని లక్షణం తక్కువ రోగనిరోధక శక్తితో ఇన్ఫెక్షన్లు పునరావృతం కావడం, నిజానికి విటమిన్ ‘డి’ లోపం ఉన్న రోగులలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది.

విటమిన్ ‘డి’ లోపానికి దోహదపడే కొన్ని కారణాలు ఎక్కువగా ఇంటిలోనే ఉండే జీవనశైలి మరియు నగర జీవనశైలిలో సూర్యరశ్మికి తక్కువగా గురికావడం, పోషకాహార లోపం ఉన్న స్త్రీలలో అంతరం లేని మరియు ప్రణాళిక లేని గర్భాధారణలు, ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరిలోనూ విటమిన్ ‘డి’ స్థాయిలను మరింత దిగజార్చడానికి దారితీస్తుంది.

భారతదేశంలో, విటమిన్ ‘డి’ లోపం విస్తృతంగా వ్యాపించింది మరియు ప్రస్తుతం నిర్ధారణ చేయబడిన సంఖ్యలు మొత్తం సంఖ్యలో అతి కొద్ది భాగం మాత్రమే. ముందస్తుగా గుర్తించడం మరియు దిద్దుబాటు సంరక్షణ ప్రారంభించడానికి పరీక్షా సౌకర్యాలతో పాటు అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి అని రాంబాబు చెప్పారు. ఇంతకుముందు మనం చాలా శారీరక శ్రమ చేసేవాళ్ళం, ఆ విధంగా తగినంత విటమిన్ డి మనకు లభించేది మరియు విద్యుత్ శక్తి లేనప్పుడు త్వరగా చీకటి పడడంతో త్వరగా నిద్రపోయే వాళ్ళము, అది మనల్ని ఆరోగ్యంగా ఉంచేది. కానీ ఈ రోజున మనం దానికి సరిగ్గా వ్యతిరేకం చేస్తున్నాము, మనం అర్థరాత్రి వరకు మేల్కొని, నిద్ర నుండి ఆలస్యంగా మేల్కొంటున్నాము, సూర్యరశ్మి అనేది తగలకుండా కార్యాలయాలకు ప్రయాణిస్తున్నాము, మనల్ని మనం పూర్తిగా కప్పేసుకుంటున్నాము. విటమిన్ డి లోపం యొక్క ఈ సమస్యకు ప్రస్తుత జీవనశైలి చాలా వరకు దోహదపడుతున్నది. ఈ సమస్యను పరిష్కరించడానికి మనకు మార్కెట్‌లో ఉన్న సప్లిమెంట్‌లు సరిపోవు. మన శరీరాలు జీర్ణాశయం ద్వారా విటమిన్ డిని గ్రహించేలా చేయబడలేదు, అది చర్మం ద్వారా గ్రహించబడేలా చేయాలి. మన ఆహారాలలో కూడా చాలా వరకు విటమిన్ డి ఉండదు. మనపై పని చేసే సప్లిమెంట్లను మనం తీసుకోవాలి, మార్కెట్‌లో లభించే బలవర్థకమైన ఆహారాలు చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే పాశ్చాత్య ప్రపంచంలో వలె కాకుండా ఉడకబెట్టడం మరియు వేయించడం వంటి మన వంట పద్ధతులు బలవర్థకమైన ఆహారాలతో సరిపోవు కాబట్టి భారతదేశంలోగా సహాయపడకపోవచ్చు. సూక్ష్మపోషకాలు హీట్ సెన్సిటివ్‌లు, మనం ఇక్కడ ఎదుర్కొనే సవాళ్లలో అది ఒకటి. మన శరీరాలు సప్లిమెంట్లను గ్రహించేలా చేయడానికి ఆరోగ్య జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. (Story: 94% మ‌హిళ‌ల్లో ఆ విట‌మ‌న్ లోపం!)

ది కశ్మీర్ ఫైల్స్ కు అనూహ్య స్పందన

0
The Kashmir Files
The Kashmir Files

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు – నిర్మాత అభిషేక్ అగర్వాల్

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో `ది కశ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భం గా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు.

– ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా.
– సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్వచ్చి  కలిసింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుండి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది.
– అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. 2 వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు.

– సినిమా అనేది కమర్షియల్. కానీ 5 లక్షల మంది కశ్మీర్ పండిట్ ల బాధలు, సమస్యలను 32 ఏళ్ళనాటివి బయటకు తెచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
– ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ ఫీలింగ్ ను వ్యక్తం చేశారు.
– ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్  చేశాం.. మూడు నెలలపాటు యు.ఎస్., కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.

–  హిందీలో ఇది నా తొలి సినిమా. దీనికి సీక్వెల్ అనేది వుండదు.
– వివేక్ కథ చెప్పాకే నాకు సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది.
– ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు.
– అందుకే ఈ సినిమా పరంగా ఏదైనా అభినందలు వుంటే అది కశ్మీర్ పండితులకు చెల్లుతుంది. వారికే ఈ సినిమా అంకితం.
– ప్రధాని మోడీగారిని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను.
– ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగా ప్రిపేర్ అయ్యాను.
– కరెక్ట్గా చెప్పాలంటే నిజాయితీగా తీస్తే భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు.
– త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం.
– మా సినిమాకు అస్సాం, యు.పి., గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం  9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది.
– ఇంకా ఈ సినిమాలో చెప్పలేని కొన్ని విషయాలున్నాయి. ఏది ఏమైనా 370 ఆర్టికల్ వరకే సినిమా తీశాం. ఆ తర్వాత కంటిన్యూ చేసే ఆలోచన ప్రస్తుతం లేదు.
– ఈ సినిమాలో నాతోపాటు నా కుటుంబసభ్యులు, స్టాఫ్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. 24గంటలు వారు ఈ సినిమాకు పనిచేశారు.

– ఈ సినిమా థియేటర్లో తర్వాత ఓటీటీలోకూడా విడుదలకాబోతుంది.

– ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు వారికి.
– షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి.

– ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు.

– నా కొత్త సినిమాలు.
రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది. అని తెలిపారు. (Story: ది కశ్మీర్ ఫైల్స్ కు అనూహ్య స్పందన)

రూ.6499 ధరకే స్మార్ట్‌ఫోన్!

0
Itel Smart Phone
Itel Smart Phone

రూ.6499 ధరకే స్మార్ట్‌ఫోన్!

6.6-అంగుళాల హెచ్ డి + వాటర్‌డ్రాప్ డిస్‌ప్లేతో భారతదేశపు అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ A49ని రూ.6499 ధరకే విడుదల చేసిన ఐటెల్

  • ఆల్-రౌండర్ ఐటెల్A49 సూపర్ బిగ్ 6.6-అంగుళాల HD+ వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే, AI పవర్ మాస్టర్‌తో కూడిన భారీ 4000 mAh బ్యాటరీ మరియు రూ. 6499 ధరకే మల్టీ-ఫీచర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్న ఏకైక స్మార్ట్‌ఫోన్.

రూ.6499 ధరకే స్మార్ట్‌ఫోన్! భారతదేశపు అత్యంత విశ్వసనీయ బ్రాండ్ మరియు రూ.7 వేలకు దిగువ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఐటెలం ఈరోజు తన నవతరం స్మార్ట్‌ఫోన్‌ ఐటెల్ A49 ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఐటెల్ A47 మరియు A48 లాంచ్‌తో భారతదేశంలో తన A సిరీస్ భారీ విజయాన్ని సాధించిన తర్వాత, ఐటెల్ A49 ఒక సూపర్ పెద్ద 6.6-అంగుళాల HD+ IPS వాటర్‌డ్రాప్ డిస్‌ప్లేతో మరియు భారీ 4000 mAh Li-పాలిమర్ ఇన్‌బిల్ట్ బ్యాటరీతో సరసమైన ప్రీమియం సెగ్మెంట్‌ను ప్రవేశపెట్టింది ప్రజల కోసం సాంకేతికతను ప్రజాస్వామ్యం చేయాలనే తన తత్వాన్ని దీని ద్వారా సమలేఖనం చేసింది, ఐటెల్ అంచనాలను అధిగమించి, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుందో పునర్నిర్వచించింది.

రూ. 6499 ధర వద్ద దూకుడుగా స్మార్ట్ ఫోన్ ధరను నిర్ణయించింది, A49 పరిణామాత్మకమైన అప్‌గ్రేడ్ వారసత్వంతో పాటు సామాన్యులకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని తక్కువ ధర వద్ద మెరుగుపరుస్తుంది. ఈ ఫ్యూచరిస్టిక్ స్మార్ట్‌ఫోన్ భారతదేశం అత్యంత చవకైన 2GB HD+ వాటర్‌ డ్రాప్‌ డిస్ ప్లే స్మార్ట్‌ఫోన్, ఇందులో భారీ ఇన్‌బిల్ట్ లిథియం పాలిమర్ బ్యాటరీ, అధునాతన డ్యూయల్ సెక్యూరిటీ ఫీచర్లు, అధిక-డేటా సామర్థ్యం నిల్వ, AI డ్యూయల్ కెమెరాతో ఫోటోగ్రఫీకి శక్తితో పాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. ఎక్కువగా చూడటం లేదా వినోదం కోసం, కస్టమర్ల డిజిటల్ అవసరాలను తీరుస్తుంది. ప్రత్యేక ఆఫర్‌తో కూడా వస్తుంది, ఇక్కడ కస్టమర్లు కొనుగోలు చేసిన 100 రోజులలోపు పగిలిన స్క్రీన్‌ను ఉచితంగా వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను పొందవచ్చు.

ట్రాన్స్‌షన్ ఇండియా CEO, Mr. అరిజీత్ తలపత్రా, స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెడుతున్న సందర్బంగా మాట్లాడుతూ, “రూ.7 వేల కంటే తక్కువ ధరల విభాగంలో ఐటెల్ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకుంది మరియు ఈ బ్రాండ్ యొక్క సానుకూల వృద్ధి ఊపందుకుంటున్నది, మాస్ కస్టమర్లకు తన బలమైన నిబద్ధతను తెలిపినట్లయ్యింది. అందుబాటులో ఉన్న ధరల విభాగాలలో అధిక-నాణ్యత ఉత్పత్తులపై. ఐటెల్ A49 ప్రారంభం అత్యంత సరసమైన ధరలో అంతరాయం లేని మరియు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించడంలో itel యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఐటెల్ A49 అనేది పరిశ్రమలో పెను మార్పులు తీసుకురానున్నది. ఇది సెగ్మెంట్-లీడింగ్ అల్టిమేట్ ఫీచర్‌లతో పూర్తిగా లోడ్ చేయబడింది, లీనమయ్యే వీక్షణ అనుభవం మరియు శక్తివంతమైన బ్యాటరీ యొక్క నవయుగం కస్టమర్ల ఆకాంక్షను తీర్చడానికి రూపొందించబడింది.

itel A49 | పెద్ద బ్యాటరీ మరియు డిస్‌ప్లేతో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్

సెమీ-అర్బన్ మరియు గ్రామీణ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేరుస్తూ, ఐటెల్ A49 సరసమైన ధరలో వినియోగదారులకు ఆల్ రౌండ్ అనుభవాన్ని అందించే అద్భుతమైన ఫీచర్లతో లోడ్ చేయబడింది. థియేటర్ లాంటి వీక్షణ అనుభవాన్ని అందించడానికి స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS వాటర్‌డ్రాప్ ఫుల్-స్క్రీన్ డిస్‌ప్లేతో అందిస్తున్నది.

ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)తో మరియు అంతరాయంలేని మల్టీ టాస్కింగ్ ఫంక్షనాలిటీ కోసం 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ ఉన్నది. మెమరీ కాన్ఫిగరేషన్ల విషయానికొస్తే, ఫోన్ 2GB RAM మరియు 32GB ROMతో 128GB వరకు విస్తరించదగిన మెమరీతో వస్తుంది. బ్యాటరీ ముందు భాగంలో, ఐటెల్ A49 ఒక భారీ 4000mAh ఇన్‌బిల్ట్ Li-పాలిమర్ బ్యాటరీ మరియు AI పవర్ మాస్టర్‌తో కూడిన స్మార్ట్ పవర్-సేవ్ మోడ్‌ ఆధారితమైనది. ఫోన్ వేగంగా ఫేస్ అన్‌లాక్ మరియు అంతరాయం లేని అన్‌లాకింగ్ అనుభవం కోసం బహుళ-ఫీచర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి డ్యూయల్ సెక్యూరిటీ ఫీచర్‌లతో కూడా వస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ 5MP AI వెనుక కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరా-అద్వితీయ కెమెరా సెటప్‌లో కాన్ఫిగర్ చేయబడింది, ఇది ఫోన్ యొక్క ప్రీమియం రూపాన్ని మరియు అనుభూతిని అందిస్తుంది. AI బ్యూటీ మోడ్‌తో ముందున్న 5MP సెల్ఫీ కెమెరా తక్కువ లైటింగ్ పరిస్థితుల్లో కూడా ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన సెల్ఫీని తీస్తుంది. స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక మెమరీ కార్డ్‌తో డ్యూయల్ సిమ్ స్లాట్‌లను అందిస్తుంది. ఇది డ్యూయల్ 4G VoLTE/ViLTE ఫంక్షనాలిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. కొత్త itel A49 స్మార్ట్‌ఫోన్ గ్రేడియంట్ గ్లోసీ ఫినిషింగ్‌తో క్రిస్టల్ పర్పుల్, డోమ్ బ్లూ మరియు స్కై సియాన్ 3 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

బాక్స్ లో అంశాల వివరాలు

ఫోన్ అడాప్టర్, USB కేబుల్, బ్యాటరీ, బ్యాక్ కవర్, యూజర్ మాన్యువల్ మరియు వారంటీ కార్డ్‌తో వస్తుంది.

 

స్పెసిఫికేషన్లు – ఐటెల్ ఎ 49
డిస్ ప్లే రిజల్యూషన్ 16.66 సెం.మీ.(6.6) హెచ్ డి + ఐపిఎస్ వాటర్ డ్రాప్ డిస్ ప్లే
మెమోరీ 2 జిబి ర్యామ్ + 32 జిబి ROM
వెనుక కెమేరా 5 ఎమ్ పి +విజిఎ డ్యుయల్ ఎఐ
ముందు కెమేరా 5 ఎమ్ పి
ఫేస్ అన్ లాక్ అవును
ఫింగర్ ప్రింటర్ సెన్సర్ అవును
బ్యాటరీ 4000mAh
ప్రాసెసర్ 1.4 GHz క్వాడ్ కోర్
OS వెర్షన్ అండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)
నెట్‌వర్క్ 4G/3G/2G
కలర్లు క్రిస్టల్ పర్పుల్, డోమ్ బ్లూ, స్కై సియాన్
ధర రూ. 6499

 

ఐటెల్ గురించి: 10 సంవత్సరాల క్రితం స్థాపించబడిన itel అందరికీ నమ్మదగిన స్మార్ట్ లైఫ్ బ్రాండ్. “ఎంజాయ్ బెటర్ లైఫ్”ని బ్రాండ్ ఫిలాసఫీగా స్వీకరించి, ప్రతి ఒక్కరికీ బడ్జెట్ అనుకూలమైన వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. నూతన సాంకేతికతకు ప్రవేశం ఇవ్వడం ద్వారా సాంకేతికతను ప్రజాస్వామ్యం చేస్తుంది మరియు వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ లేకుండా కనెక్ట్ అవుతుంది. 10 సంవత్సరాలకు పైగా జరిగిన అభివృద్ధి తర్వాత, itel ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన ఉనికిని విస్తరించింది. itel స్మార్ట్‌ఫోన్‌లు, టీవీ, ఉపకరణాలు, ఎలక్ట్రిక్‌లు, స్పీకర్‌లు, గృహోపకరణాలు మరియు ల్యాప్‌టాప్ ఉత్పత్తుల ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది మరియు 2021లో, ఇది $75 కంటే తక్కువ నంబర్.1 గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా మరియు నంబర్.1 ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. (Story: రూ.6499 ధరకే స్మార్ట్‌ఫోన్!)

 

మంచి ఆదరణ అంటే ఇదేనేమో

0
Nallamala
Nallamala

మంచి ఆదరణ అంటే ఇదేనేమో

నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ..”నల్లమల” సక్సెస్ మీట్ లో దర్శకుడు రవి చరణ్ 

మంచి ఆదరణ అంటే ఇదేనేమో! నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవి చరణ్ ‌దర్శ‌కత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించిన చిత్రం “న‌ల్ల‌మ‌ల‌”. మార్చి 18 శుక్రవారం థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులనుండి  హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా  చిత్ర బృందం హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయుల
సమావేశంలో కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ హొలీ శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ , ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా అద్భుతంగా ఉందని చెపుతున్నారు. ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా తియ్యడం జరిగింది. మంచి కంటెంట్ కు మంచి ఆదరణ అంటే ఇదేనేమో అనిపించేలా ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు.సినిమా ఇంత బాగా రావడానికి ముందు మా నిర్మాత నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. నా టెక్నికల్ టీం అంతా చాలా కష్టపడ్డారు..నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నల్లమల సినిమాను ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ భానుశ్రీ‌ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ తో విడుదలైన మా నల్లమల చిత్రం చాలా బాగుందని చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా “ఎమున్నావే.. పిల్లా ” సాంగ్ కు ప్రేక్షకులనుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.ఆ సాంగ్ కంటే కూడా ఈ సినిమా చాలా బ్యూటీఫుల్ ఉంది.విజువల్స్ గాని, మేకింగ్,టేకింగ్ గాని అద్భుతంగా వచ్చాయి. సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మా సినిమా నచ్చుతుంది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఇంత మంచి సినిమాలో నటించే  అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీన‌టులు: 
అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి  శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను
సాంకేతిక నిపుణులు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్.ఎమ్
సినిమాటోగ్రఫీ: వేణు మురళి
సంగీతం, పాటలు: పి.ఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్:  పీవీ రాజు
ఫైట్స్: నబా
స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్

పిఆర్ఓ – శ్రీ‌ను – సిద్ధు (Story: మంచి ఆదరణ అంటే ఇదేనేమో)

జోరుగా హుషారుగా ఫ‌స్ట్ లుక్‌

0
Joruga Husharuga 1st Look
Joruga Husharuga 1st Look

జోరుగా హుషారుగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌ ఆవిష్కరించిన సాయికుమార్

విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం `జోరుగా హుషారుగా`. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ బ్యానర్ పై నిరీశ్ తిరువీదుల నిర్మిస్తున్నారు. అను ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి ప్రచార చిత్రం ఆవిష్కరణ శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ `జోరుగా హుషారుగా` చిత్ర ఫస్ట్లుక్ను  ఆవిష్కరించారు.

అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ, టైటిల్ కు తగినట్లుగా హుషారైన టీమ్తో పని చేశాను. ఎస్.ఆర్. కళ్యాణమండపం చేశాక కొత్త దర్శకులు భిన్నంగా ఆలోచిస్తూ పాత్రలు ఇస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం ఇందులో బాగా చూపించారు. విరాజ్ను ఓటీటీలో చూశాక బాగా చేశాడనిపించింది. తను మార్తాండ్ కె.వెంకటేష్ మేనల్లుడు అని తెలిశాక ఆనందం కలిగింది. రోహిణి నా భార్యగా నటించింది. మధునందన్ చక్కటి పాత్ర చేశాడు. ప్రణీత్ చేసిన పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. ఈ చిత్రం చూస్తే, మన పక్కింటి కథలా వుంటుంది. బంధాలు, అనుబంధాలు,  ఫ్రెండ్షిప్తోపాటు వ్యక్తి జీవనపోరాటం వంటి అంశాలు ఇందులో వుంటాయి. మేకింగ్, విజువల్స్ బాగా కనిపిస్తాయి. నేను యాభైఏళ్ళుగా నటిస్తున్నా నేను చేసిందే రైట్ అనుకునేవాడిని. కానీ ఒక్కోసారి నాది రాంగ్ అని కూడా చెప్పే దర్శకులు ఇప్పుడు వున్నారు. అలాంటి కొత్త తరంతో న్యూ ట్రెండీ ఫిలిం ఇది` అని తెలిపారు.

దర్శకుడు అనుప్రసాద్ తెలుపుతూ, ఇది నా తొలి సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాం.  సంగీత దర్శకుడు ప్రణీత్ ద్వారా కథను నిర్మాతకు వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది.. నేను అనుకున్నది అనుకున్నట్లు వచ్చేలా నిర్మాత సహకరించారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుపుకుంటోంది. సాయికుమార్గారు మా సినిమాకు అండగా నిలిచారు.  రెండు నెలలలో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, కోవిడ్ టైంలో సినిమా మొదలు పెట్టాం. కష్టమైన వాతావరణంలో కూడా నిర్మాత చాలా సహకరించారు. దర్శకుడు కొత్తవారైనా స్క్రిప్ట్ చక్కగా రాసుకున్నారు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాను. మిడిల్క్లాస్ ఫ్యామిలీ కథ. సహనటులు పూజిత, సోను, క్రేజీ ఖన్నా, మధునందన్  చాలా చక్కగా నటించారని తెలిపారు.

హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ, లాక్డౌన్ తర్వాత ఈ సినిమా షూట్ జరిగింది. ఇది చాలా ఫన్ ఫిలిం. టైటిల్లోనే హుషారు వున్నట్లుగా మేమంతా అలా నటించాం. దర్శకుడు కథ బాగా రాసుకున్నారు. ఇందులో ఎమోషన్స్ బాగా పండాయి. పాటలు, సంగీతం బాగా కుదిరిందని అన్నారు.

నటుడు మధునందన్ తెలుపుతూ, కరోనా టైంలో మాకు పనిలేనప్పుడు పని కల్పించారు నిర్మాత. దర్శకుడు షార్ట్ ఫిలిం చేసిన తర్వాత ఈ సినిమా చేశాడు.  కథపై ఆయనకు మంచి పట్టు వుంది. ఆయన మా నుంచి  నటన రాబట్టుకున్నారని తెలిపారు.

నిర్మాత నిరీశ్ తిరువీదుల మాట్లాడుతూ, అందరి కృషితో సినిమా బాగా వచ్చింది. సుద్దాల అశోక్తేజ, రామజోగయ్యశాస్త్రి, పూర్ణాచారి మంచి సాహిత్యం రాశారు. ఫేమస్ గాయనీ గాయకులతో పాటలు పాడించాం. మంచి లొకేషన్స్ లో తీశాం. దర్శకుడిలో క్లారిటీ వుంది. మొదట్లో తను ఏదైతే చెప్పాడో అది నేను స్కీన్పై చూశాను. హీరోకు కథ చెప్పగానే వెంటనే అంగీకరించాడు. పోస్టర్లో చూపినట్లుగా తనే అందరినీ భుజాలపై మోసేలా పాత్ర వుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

ఇంకా సోనూ ఠాగూర్,  క్రేజీఖన్నా, సతీష్ తదితరులు మాట్లాడారు. (Story: జోరుగా హుషారుగా ఫ‌స్ట్ లుక్‌)

చోర్ బజార్ ‘జడ’ సాంగ్ విడుదల

0

హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘చోర్ బజార్’’ చిత్రం నుంచి మెలోడీ గా
సాగే ‘జడ’ లిరికల్ సాంగ్ విడుదల

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ
నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్
చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్
పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు
సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్”
సినిమా నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని
‘అబ్బబ్బా ఇది ఏం పోరి’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ సాగే పాట ఇది. పాట ఎలా ఉందో
చూస్తే..అబ్బబ్బా ఇది ఏం పోరి..చూడగానే కళ్లు చెదిరి, కోసేసానమ్మో దాని
జడపై మనసు పడి…మెడకీ నడుముకి నడుమ నాగుబాములాగ కదలాడి..ఉరిబోసిందమ్మో
దాని కురులతో ఊపిరికి..అంటూ సాగుతుందీ పాట. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని
అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆకట్టుకునేలా పాడారు. మిట్టపల్లి సురేందర్
సాహిత్యాన్ని అందించారు. భాను కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో సీనియర్ నాయిక
అర్చన, హీరో ఆకాష్ పూరీ కనిపిస్తారు.  “చోర్ బజార్” సినిమా త్వరలో
థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, సంగీతం – సురేష్
బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ – గాంధీ నడికుడికర్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో – లహరి, కాస్ట్యూమ్స్
డిజైనర్ – ప్రసన్న దంతులూరి, ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ – భాను,
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను ,  స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో –
జీఎస్కే మీడియా,  మేకప్ – శివ, కాస్ట్యూమ్ చీఫ్ – లోకేష్, డిజిటల్ మీడియా
– వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ –
ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత – వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం – బి. జీవన్
రెడ్డి. (Story: చోర్ బజార్ ‘జడ’ సాంగ్ విడుదల)

See Also: మెగాస్టార్ మేడే!

‘మ్యూజిక్‌ స్కూల్‌’లో 11 పాట‌లు!

0
Shriya Saran-Music School
Shriya Saran-Music School

‘మ్యూజిక్‌ స్కూల్‌’లో 11 పాట‌లు!

ఇళయరాజా సంగీతం అందిస్తున్న ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమా మూడో షెడ్యూల్‌ పూర్తి…. 

– 11లో 10 పాటల చిత్రీకరణ పూర్తి!

‘మ్యూజిక్‌ స్కూల్‌’లో 11 పాట‌లు! ఇళయరాజా మ్యూజిక్‌ అందిస్తున్న మ్యూజికల్‌ స్కూల్‌ సినిమా మూడో షెడ్యూల్‌ పూర్తయింది. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. 45రోజుల షెడ్యూల్‌లో 10 పాటల చిత్రీకరణ పూర్తిచేశారు. ఇంకో పాట చిత్రీకరణ మిగిలింది. చిన్ని ప్రకాష్‌, రాజు సుందరం ఈ పాటలకు కొరియోగ్రఫీ  చేశారు. తొలి రెండు షెడ్యూళ్లకు బ్రాడ్వే కొరియోగ్రాఫర్‌ ఆడం ముర్రే నృత్య దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే మ్యూజికల్‌ సినిమాను ఇవ్వాలన్న ఆకాంక్షతో మేకర్స్ ఫైనల్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు.
శ్రియా శరణ్‌ మాట్లాడుతూ ”అమేజింగ్‌ షూట్‌ కంప్లీట్‌ చేశాం. వి లవ్‌ యూ కిరణ్‌ సార్‌. చిన్ని ప్రకాష్‌ సార్‌, రాజు మాస్టర్‌ కొరియోగ్రఫీ చాలా బావుంది. షర్మన్‌తోనూ, పలువురు చైల్డ్ ఆర్టిస్టులతోనూ షూటింగ్‌ చేయడం  చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా  చేస్తున్నందుకు పాపారావు సార్‌కి ధన్యవాదాలు” అని అన్నారు.
షర్మన్‌ జోషి మాట్లాడుతూ ”మ్యూజిక్‌ స్కూల్‌ మూడో షెడ్యూల్‌ పూర్తయింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్‌ చేసిన డ్యాన్సులు, పాటల సీక్వెన్స్ లు పూర్తి చేశాం. రావుగారి టీమ్‌ చాలా బాగా హ్యాండిల్‌ చేసింది. ప్రతి విభాగంలోనూ ఎక్సలెన్స్ కోసం పాటుపడుతూ ముందుకు సాగుతుంటే ఆనందంగా ఉంది” అని అన్నారు.
దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ ”నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా పిల్లలు  చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బెటర్‌ ఔట్‌పుట్‌ కోసం నేను ప్రత్యేకించి ఎవరినీ అడగలేదు. అందరూ అంతగా ఇన్వాల్వ్ అయి చేశారు. 80 శాతం షూటింగ్‌  పూర్తయింది. మేం అనుకున్న టైమ్‌ ప్రకారం సినిమా పూర్తవుతుందనే  నమ్మకం ఉంది” అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్‌ కిరణ్‌ డియోహాన్స్ మాట్లాడుతూ ”45 రోజుల అద్భుతమైన షెడ్యూల్‌ని పూర్తి చేశాం. యామిని ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరిగింది. శ్రియా శరణ్‌, షర్మన్‌ జోషీ, ప్రకాష్‌రాజ్‌గారితో  పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. చాలా స్మూత్‌గా పనిచేశాం. థాంక్స్ టు యామిని ఫిల్మ్స్ ” అని అన్నారు.
రాజు సుందరం మాట్లాడుతూ ”ప్రతిభావంతులైన చిన్నారులతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాపారావు సార్‌కి, కిరణ్‌కి ధన్యవాదాలు” అని అన్నారు.
యామిని ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. పాపారావు బియ్యాల స్క్రిప్ట్ రాసి, దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ, తెలుగులో ఈ మ్యూజిక్‌ స్కూల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కిరణ్‌ డియోహాన్స్ కెమెరాను హ్యాండిల్‌ చేస్తున్నారు.
 షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్‌, బెంజమిన్‌ జిలానీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వినయ్‌ వర్మ, మోనా మోనా అంబేగవోంకార్‌, గ్రేసీ గోస్వామీ, ఓజు బారువా, బగ్స్ భార్గవ, మంగళ భట్‌, ఫణి ఎగ్గోటి, వాక్వర్ షేక్‌, ప్రవీణ్‌ గోయెల్‌, రజ్‌నీష్‌, కార్తికేయ, రోహన్‌ రాయ్‌, ఒలివియా చరణ్‌, వివాన్‌ జైన్‌, సిదీక్ష, ఆద్య,  ఖుషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (Story: ‘మ్యూజిక్‌ స్కూల్‌’లో 11 పాట‌లు!)

Photo Gallery

error: Content is protected !!