Home Blog Page 954

వేగేశ్న సతీష్ ‘కథలు!

0
Kathalu
Kathalu

వేగేశ్న సతీష్ ‘కథలు!

వేగేశ్న సతీష్ ‘కథలు(మీవి మావి)’ వెబ్ సిరీస్!

ప్రస్తుతం టాలీవుడ్లో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్ దర్శకులు కూడా వెబ్ సిరీస్ లు చేస్తూ OTT ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ వేగేశ్న సతీష్ కూడా OTT లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’, ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ సినిమాలు చేస్తున్న వేగేశ్న సతీష్   పల్లెటూరి కథలతో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు.

అయితే ఇది పూర్తిగా ఆయన మార్క్ పల్లెటూరి కథలతో తెరకెక్కనున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్. అందుకే దీనికి  ‘కథలు(మీవి మావి)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.  ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది.

త్వరలోనే మిగిలిన కథలు షూట్ చేసి ఒక ప్రముఖ OTT సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు తీసి దర్శకుడిగా మెప్పించిన వేగేశ్న సతీష్ ఈ వెబ్ సిరీస్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూసేలా ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.

ఈ సిరీస్ కోసం కొందరు ప్రముఖ నటీ నటులు అలాగే సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడించనున్నారు. (Story: వేగేశ్న సతీష్ ‘కథలు!)

See Also: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

నాని గెట‌ప్ అదిరిపోయింది!

0
Nani Dasara
Nani Dasara

నాని గెట‌ప్ అదిరిపోయింది!

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో  రూపొందుతోన్న దసరా చిత్ర ఫస్ట్ లుక్,  స్పార్క్ ఆఫ్ దసరా వీడియో విడుదల

విభిన్నమైన చిత్రాలను చేస్తూ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో నాని దసరా చిత్రంతో అలరించనున్నాడు.
టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో
మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా దసరా రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని మొదటి పాన్ ఇండియా చిత్రం దసరా.
సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌లో దసరాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా
నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది.
ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో గ్లింప్స్ కూడా విడుదలయ్యాయి. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని  పక్కనే నిప్పు ఉండటం దానిపై చెయ్యి పెడుతోన్న
డిఫరెంట్ లుక్ నెటిజన్ల ను  ఆకట్టుకుంది. నాని తొలిసారి భిన్నమైన లుక్, గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్పార్క్ ఆఫ్ దసరా వీడియోలో నాని బీడీ వెలిగించి సింగరేణి మైన్స్ ద్వారా తన గ్యాంగ్‌తో కలిసి నడుస్తూ స్టైల్‌ గా ఎంట్రీ ఇచ్చాడు. నాని తన అగ్రెసివ్ యాటిట్యూడ్‌ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీనికి
సంతోష్ నారాయణన్  BGM తోడుకావడం నాని పాత్ర పై మరింత అంచనాలు పెంచాయి.
గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జరిగే కథ ఇది. నాని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. దసరా యాక్షన్ డ్రామా. దసరా గ్లింప్స్ కు  అద్భుతమైన స్పందన వచ్చింది.
సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీతో సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య తారాగణం.
ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.
తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు
సుధాకర్ చెరుకూరి నిర్మాత
ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ISC
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి
PRO: వంశీ-శేఖర్ (Story: నాని గెట‌ప్ అదిరిపోయింది!)

Nani Dasara
Nani Dasara

See Also: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు సన్మానం

0
Allu Arjun
Allu Arjun

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు సన్మానం

డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన
పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా
ఘన విజయం సాధించిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సన్మానం కార్యక్రమం శనివారం పార్క్ హయత్ హోటల్లో ఘనంగా జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి , భానుప్రకాష్ ఐఏఎస్ (మాజీ యూనిటెడ్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్
ప్రిన్సిపాల్ సెక్రటరీ పీఎంవో చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మరియు మాజీ అస్సాం చీఫ్ సెక్రెటరీ )
ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ లతో పాటు
అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో సత్కరించారు. (Story: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు సన్మానం)

See Also: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

సాంస్కృతిక ఆణిముత్యం నేతి పరమేశ్వరశర్మ

0
Nethi Parameshwara Sharma
Nethi Parameshwara Sharma

సాంస్కృతిక ఆణిముత్యం నేతి పరమేశ్వరశర్మ

పెనుగొండ లక్ష్మీనారాయణ

తెనాలి సాంస్కృతిక చైతన్య దీపిక, తెనాలి సాంస్కృతిక చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన అభ్యుదయ సాహితీవేత్త నేతి పరమేశ్వరశర్మ. పరిపూర్ణ జీవితం గడిపిన ఆయన 94 ఏళ్ళ వయసులో ఈ నెల 16న తెనాలిలో కన్నుమూశారు. 1928లో కృష్ణాజిల్లా దివిసీమలో నంగేగడ్డ గ్రామంలో నిమ్మగడ్డ సుబ్బమ్మ, శ్రీరాములుకు జన్మించిన శర్మ 5 సంవత్సరాల వయసులో తెనాలి వాస్తవ్యులు నేతి కమలాంబ, సీతారామస్వామికి దత్తుడయ్యాడు.
శర్మ బాల్యమంతా తెనాలికి అతి సమీపంలోని పెదరావూరు గ్రామంలో గడిచింది. తెనాలి సాంస్కృతిక ప్రభావం ఆ గ్రామంపైనా ఉంది. ఆ వూరిలో నాటక ప్రదర్శనలు జరిగేవి. అన్న చలపతిరావు ప్రోత్సాహంతో ‘రంగూన్‌ రౌడి’ నాటకంలో సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పాత్ర ధరించారు. అదే వారికి తొలి నాటకానుభవం. తరవాత సాంస్కృతిక రంగానికి చేరువైనారు. ముఖ్యంగా నాటక రంగానికి సేవ చేయటాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించారు. తెనాలిలోని క్రాంతి థియేటర్‌కు 1952లో కార్యదర్శిగా ఎన్నికైనారు. తెనాలిని కేంద్రంగా చేసుకొని విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అనేక నాటకాలలో 35, 40 సంవత్సరాల పాటు విభిన్న ప్రవృత్తి గల పాత్రలు పోషించారు.
‘‘నాటక పోటీలకు వెళ్లాలన్న, బహుమతులు సంపాదించాలన్న కోరిక మాకు పెద్దగా ఉండేది కాదు. ఈ పరిషత్తు నాటక పోటీలు బూర్జువా సంప్రదాయాలని, ఎవరో నలుగురు కలిసి చేసే న్యాయ నిర్ణయంపైన నటుని నటనా కౌశలం నిర్ణయం కాదని, ప్రజాతీర్పు మించినది లేదని, గుర్తింపు ప్రజల్లో రావాలిగాని, పరిషత్తుల ద్వారా కాదని భావించేవాళ్లం. అసలు చాలా కాలం పరిషత్తులను పట్టించుకోలేదు. పైగా మా నాయకులు కూడా పోటీలను అంతగా ప్రోత్సహించేవారు కాదు. అయినా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొని బహుమతులు సంపాదించాను’’ అని ‘స్వకీయం’లో చెప్పుకున్న ప్రజా కళాకారుడు పరమేశ్వరశర్మ. ఈ మాటలను బట్టి వారికి కళారంగంపై స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తుంది.
తెనాలిలో నివాసమేర్పరచుకున్న పరమేశ్వరశర్మ తనకున్న కమ్యూనిస్టు రాజకీయ నమ్మకాల వల్ల, అవిశ్రాంతంగా కళారంగంలో పాల్గొంటున్నందువలన ఉద్యోగం సంపాదించుకోలేకపోయారు. అయితే తెనాలి తాలూకా హైస్కూల్‌ కమిటీ కార్యదర్శి కల్లూరి కృష్ణమూర్తి కొన్ని షరతులతో ఉపాధ్యాయ ఉద్యోగం కల్పించారు. ఆ ఉద్యోగం చేస్తూనే నాటక రంగ కార్యకలాపాలను నటుడిగా, కార్యకర్తగా విస్తృతపరచుకున్నారు. 1965 నాటికి క్రాంతి థియేటర్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అదే సంవత్సరం నటరాజ కళామందిర్‌ను స్థాపించారు. దాదాపు రెండేళ్లపాటు ఆ సంస్థలో సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించారు. సాంఘిక నాటక రంగం క్రమక్రమంగా పరిషత్తులకే పరిమితమవుతున్న పరిస్థితి. తెనాలిపై కూడా ఆ ప్రభావం పడటాన్ని గ్రహించారు శర్మ. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి తెనాలిలో కొన్ని సమాజాల ప్రతినిధులను కలుపుకొని ‘ది తెనాలి యునైటెడ్‌ ఎమెచ్యూర్స్‌’ అనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సమాజం ద్వారా ప్రముఖ నాటక రచయిత కొడాలి గోపాలరావు రచించిన ‘దొంగ వీరడు’ నాటకాన్ని అనేక ప్రదేశాలలో టిక్కెట్లు అమ్మి ప్రదర్శించారు. అప్పటి వరకూ తెలుగు సాంఘిక నాటక రంగంలో టిక్కెట్లు అమ్మి ప్రదర్శించటం జరగలేదు. ఒక కొత్త మంచి సంప్రదాయానికి శర్మ ఆధ్వర్యంలో తెర లేచింది. దొంగ వీరడు నాటకాన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు పలువురు చలనచిత్ర నటులు హాజరై అభినందించారు. ఇలా తెనాలి రంగస్థల కీర్తి ప్రతిష్ఠలను మద్రాసు నగరంలో సైతం చాటారు. ఆ తరవాత ‘కళాభారతి’ అనే నాటక సంస్థను పలువురు స్థానిక కళాకారుల సహకారంతో తెనాలిలో నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా ‘జై భవానీ’ నాటకాన్ని తెనాలిలోనేగాక ఈ నాటకంలో బాజీ ప్రభువు పాత్రను ప్రసిద్ధ రంగస్థల నటులు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి నటిస్తే, పరమేశ్వరశర్మ హీరో పాత్ర పోషించారు. ఈ నాటకం తెలుగు నాటకానికి అందునా ఔత్సాహిక నాటక రంగానికి ఊపిరందించిందన్నారు శర్మ.
తెనాలిలో ప్రసిద్ధ వైద్యులు డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తితో కలిగిన పరిచయంతో ‘ఉత్తమ చలనచిత్ర అభిమానుల సంఘం’ ఏర్పాటు చేశారు. దానికి తొలి అధ్యక్షుడు పరమేశ్వరశర్మే. 1986లో ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ గావించారు. తరవాత తెనాలిలో జరిగిన అనేక నాటక పోటీల నిర్వహణలో పాలుపంచుకున్నారు. తెనాలిలో పట్టణ రంగస్థల తొలి కార్యవర్గంలో ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఎందరో పేద కళాకారులకు పెన్షన్‌ సౌకర్యం కలిగించటంలో కృషి చేశారు. తరవాత ‘అభ్యుదయ కళా సమితి’ కార్యదర్శిగా సాంఘిక ప్రయోజనాన్ని కలిగించే కార్యక్రమాలు నిర్వహించారు.
గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ 1989లో ప్రజానాట్యమండలి మహాసభలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని 1943లో ఆవిర్భవించిన అరసం స్వర్ణోత్సవాలను 1994 ఫిబ్రవరి 12,13 తేదీలలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు బొల్లిముంత శివరామకృష్ణ. నేను కార్యకర్తను. రాష్ట్ర వ్యాపితంగా ఎందరో ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్తలు హాజరైన సభలివి. తెనాలిలోని పలు సాంస్కృతిక సంస్థలకు మార్గదర్శిగా, నేతగా వాటి నిర్వహణలో తన వంతు సహకారాన్ని అందించి తెనాలి సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటిన కళాజీవి నేతి పరమేశ్వర శర్మ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవ పోటీలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. పరమేశ్వర శర్మ అనేక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించారు. నటునిగా కీర్తినార్జించారు. ఎంతో ప్రతిభావంతమైన నటుడైన పరమేశ్వర శర్మ ఒకే ఒక్క చలనచిత్రం ‘స్వాతంత్య్రం మా జన్మహక్కు’లో నటించారు. మరిన్ని అవకాశాలు లభించేవి ఆయనకు. తెనాలిని వదలలేకపోయారు.
తెనాలి సాంస్కృతిక సాహిత్య చరిత్రను వివరిస్తూ ‘నూరేళ్ల తెనాలి రంగస్థలి’ రచన చేపట్టారు. మే 1998న ప్రథమ ముద్రణ. మరికొన్ని చేర్పులతో జూన్‌ 2006లో మలి ముద్రణ గావించారు. ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని అందించినవారు బాపు. 778 పుటల ఈ పుస్తకం ఎంతో సంచలనాత్మకమైనది. వందల కొద్దీ కళాకారులు, రచయితల ఛాయా చిత్రాలు, ఎన్నో అపురూపమైన చిత్రాలను, జీవిత విశేషాలను, సంస్థల వివరాలను అందించారు. ఏడు పదుల వయసులో వయోభారాన్ని లెక్కచేయక అనేక ఊర్లు, ప్రాంతాలు పర్యటించి విశేషంగా విషయ సేకరణ చేశారు. ఈ పుస్తకాన్ని అమెరికాలోని డా॥ రాబర్ట్‌ పుల్టన్‌ రీజనల్‌ లైబ్రరీవారు రిఫరెన్స్‌ గ్రంథంగా స్వీకరించారు. పత్రికలు, ప్రముఖులు ఎంతగానో ఆయనను ప్రశంసించారు. ఈ పుస్తక ప్రచురణ సమయంలో నాతో అనేకసార్లు సమాచారం కొరకు ముచ్చటించారు. కోరిన సమాచారాన్ని అందించాను. ఈ అపురూప గ్రంథ రచనలో నా స్వల్ప సహకారం ఉన్నందుకు సంతోషిస్తున్నాను.
ఆంధ్రరాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అభ్యుదయ సాహితీవేత్త పులుపుల వెంకటశివయ్య పేరిట నెలకొల్పిన ‘అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారాన్ని’ 2008 సంవత్సరంలో అరసం జిల్లాశాఖ గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో నేతి పరమేశ్వరశర్మకు అందించాం. ప్రజా సాంస్కృతికోద్యమంలో, అభ్యుదయ సాహిత్యోద్యమంలో ఏడు దశాబ్దాలకు పైగా అవిశ్రాంత కృషి చేసిన నేతి పరమేశ్వరశర్మ ‘మృతియే లేకున్న రుచియేది బతుకులోన’ అన్న గాలీబు పాటను రుజువు చేస్తూ జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. అభ్యుదయ రచయితల సంఘం పక్షాన వారికి జోహార్లు.
– వ్యాస రచయిత అరసం జాతీయ కార్యదర్శి
9440248778

(Story:సాంస్కృతిక ఆణిముత్యం నేతి పరమేశ్వరశర్మ)

See Also: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

0
Crude oil
Crude oil

నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

న్యూఢిల్లీ: భారత్‌ ఒక్కటే కాదు..ఇంకా చాలా దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నది. ఇందులో ప్రధాన దేశాలు వున్నాయి. అందుకే ఈ విషయం అమెరికాకు మింగుడుపడటం లేదు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోని అనేక దేశాలు ఇంకా రష్యా ముడిచమురును కొనుగోలు చేస్తూనే వున్నాయి. ఉక్రెయిన్‌కు నేటికీ సరైన మద్దతు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇదే. నేటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలేంటో తెలుసా? ఓసారి తెలుసుకుందాం!
1. బల్గేరియా : బాల్కన్‌ ద్వీపకల్పంలోని అతిపెద్ద ఆయిల్‌ రిఫైనింగ్‌ సంస్థ నెఫ్తోచిమ్‌ బర్గాస్‌ రిఫైనరీ అనేది రష్యాకు చెందిన ల్యూకాయిల్‌ అనే సంస్థ యాజమాన్యంలో నడుస్తున్నది. ఇది బల్గేరియాలో వుంది. బల్గేరియా స్వదేశీ మార్కెట్‌లో ప్రాథమిక ఇంధన సరఫరాదారు ఇదే. 60 శాతం రష్యా క్రూడాయిల్‌ ఇక్కడకు నేరుగా సరఫరా అవుతున్నది. ప్రస్తుతం 40 శాతం రష్యేతర ముడిచమురును బల్గేరియా ఉపయోగిస్తున్నది. అయితే ఆంక్షలకు తలొగ్గి వుండాల్సి వస్తే నూటికి నూరు శాతం రష్యేతర ముడిచమురును బల్గేరియా ఉపయోగించగలగాలి. కానీ అంత సామర్థం నెఫ్తోచిమ్‌ బర్గాస్‌కు వుందా లేదా అన్నది తేలలేదు. కాకపోతే ల్యూకాయిల్‌ రష్యన్‌ సంస్థ కాబట్టి, ఈ అనుమతి బల్గేరియాకు ఇస్తుందా లేదా అన్నది అనుమానమే. ఇప్పటికైతే రష్యా మీద చమురు కోసం ఆధారపడాల్సిందేనని స్పష్టమవుతున్నది.
2. చైనా : యూరోపియన్‌ యూనియన్‌ తర్వాత రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద రెండవ దేశం చైనా. ఓవైపు యుద్ధం జరుగుతున్నా, సముద్రమార్గాన నౌకల ద్వారా చమురు సరఫరాలు మరింత పెరిగే అవకాశం వుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఎ) తెలిపింది. చైనాకు మరింత ముడి చమురు వెళ్లబోతుందని ప్రముఖ చమురు ఉత్పాదక పర్యవేక్షణ సంస్థ, కార్గో ట్రాకింగ్‌ డేటా ప్రొవైడర్‌, ట్రేడ్‌ ఫ్లో నిఘా సంస్థ అయితే పెట్రో`లాజిస్టిక్స్‌ భావిస్తున్నదని రాయిటర్స్‌ వార్తాసంస్థ పేర్కొంది.
3. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) : ప్రస్తుతం యూరోపియన్‌ యూనియన్‌లో 27 దేశాలున్నాయి. ఇప్పటివరకు ఈ దేశాలు 40 శాతం గ్యాసు, 27 శాతం ముడిచమురు దిగుమతుల కోసం రష్యాపైనే ఆధారపడి వున్నాయి. ఇప్పుడు రష్యా దిగుమతుల అదుపుపై అమెరికా చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ దేశాలు రెండుగా చీలాయి. అయితే దీర్ఘకాలంగా సాగుతున్న రష్యా శిలాజ ఇంధనాల తవ్వకాల ప్రణాళిక ఈ మేనెలతో ముగిసే అవకాశం వుంది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్‌, ట్రాన్స్‌నెఫ్ట్‌, గాజ్‌ప్రోమ్‌ నెఫ్ట్‌లపై కొత్త ఆంక్షలను ఆమోదించడానికి సిద్ధమైనప్పటికీ, వాటి నుండి చమురు కొనుగోలు కొనసాగుతుందని చెపుతోంది. ఇదొక విచిత్రమైన వైఖరి.
4. ఫ్రాన్స్‌ : 2021లో ఫ్రాన్స్‌ చేసుకున్న మొత్తం దిగుమతుల్లో 9.5 శాతం రష్యా ముడి చమురు ఉత్పత్తులే ఉండటం విశేషం. ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నట్లు ఫ్రెంచ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఇండస్ట్రీ (యుఎఫ్‌ఐపి) ఇంకా చెపుతూనే వుంది. రష్యన్‌ డీజిల్‌ను మాత్రం ఇప్పటికే కాదనుకున్నట్లు సమాచారం. కాకపోతే ఎక్కువ వ్యయం భరించాల్సి వుంటుంది.
5. జర్మనీ : జర్మనీలోని అతిపెద్ద రిఫైనరీ మిరో (ఎంఐఆర్‌ఓ)లో దాదాపు 14 శాతం ముడి చమురు రష్యా నుంచే వస్తున్నది. మిరో అంటే ది మినరల్‌ఆయెల్‌రఫైనెరీ ఒబెర్రీన్‌ గ్యాంభ్‌ రిఫైనరీ. ఈ సంస్థ ఫిలిప్స్‌66 అనే సంస్థతో సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్నది. ఫిలిప్స్‌66కు ఇందులో 18.75 శాతం వాటా వుంది. అలాగే, జర్మనీకి చెందిన మరో ఆయిల్‌ కంపెనీ పిసికె ష్వెద్‌ రిఫైనరీలో రోస్‌నెఫ్ట్‌ డ్యూష్‌ల్యాండ్‌ అనే సంస్థకు 54 శాతానికిపైగా వాటా వుంది. ఇది రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌ అనే సంస్థకు అనుబంధ కంపెనీ. దానికి ద్రూజ్‌బా పైప్‌లైన్‌ ద్వారా చమురు పంపిణీ చేస్తారు. టోటల్‌ ఎనర్జీస్‌ యాజమాన్యంలో నడుస్తున్న లెవునా రిఫైనరీ సహకారంతో ఇది జరుగుతుంది. ఈ చిక్కులన్నీ జర్మనీకి వున్నాయి. ఇప్పటికిప్పుడు రష్యాతో ఢీ అంటే జర్మనీకే అధికంగా నష్టం.
6. గ్రీస్‌ : గ్రీస్‌ అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ హెల్లెనిక్‌ పెట్రోలియంలో 2021 ద్వితీయార్థంలో దాదాపు 15 శాతం రష్యా ముడిచమురు ఖాతా వున్నట్లు ఆ సంస్థే చెపుతున్నది. అయితే రష్యాపై ఆంక్షలు తప్పవంటే, సౌదీ అరేబియా నుంచి అదనపు సరఫరాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తామని చెపుతున్నది. ఇది కాస్త భారమే అయినా తప్పదంటోంది. కాకపోతే గ్రీస్‌ తొందరపడకుండా ఆచితూచి స్పందిస్తోంది.
7. ఇండియా : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూస్తాన్‌ పెట్రోలియం అధికభాగం రష్యా యూరల్స్‌ సంస్థపైనే ఆధారపడుతున్నది. ట్రేడిరగ్‌వర్గాల కథనం మేరకు మే నెల కోసం 2 మిలియన్‌ బ్యారెల్స్‌ను కొనుగోలు చేసింది. అలాగే, భారత అగ్రశ్రేణి రిఫైనరీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మే డెలివరీ కింద యూరల్స్‌ నుంచి 3 మిలియన్‌ బ్యారెల్స్‌ను కొనుగోలు చేసిందని వాణిజ్యవర్గాలు వెల్ల‌డించాయి. అంటే రష్యాను భారత్‌ వ్యతిరేకిస్తే మన దేశంలో కచ్చితంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. చమురుతోపాటు ఇతర ఉత్పత్తుల దిగుమతులు కూడా రష్యా నుంచి అధికంగా వున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, తటస్థంటా వుండాలన్న భారత్‌ వైఖరే ఉత్తమం.
8. ఇటలీ : ఇసాబ్‌ (ఐఎస్‌ఎబి) అనేది ఇటలీలో అతిపెద్ద రిఫైనరీ. స్విట్జర్లాండ్‌ ఆధారిత లిటాస్కో ఎస్‌ఎ దీని యజమాని. ఇది రష్యాకు చెందిన లూకాయిల్‌ నియంత్రణలో పనిచేస్తున్నది. మార్చి 4 నాటికి యథాప్రకారం దీని పనితీరులో ఎలాంటి మార్పు లేదు. వివిధ రకాల ముడిచమురు ప్రక్రియలను ఇది కొనసాగిస్తున్నది.
9. హంగేరీ : హంగేరియన్‌ ఆయిల్‌ గ్రూప్‌ ఎంఓఎల్‌కు ద్రూజ్‌బా పైప్‌లైన్‌ నుంచి నిరంతరాయంగా చమురు సరఫరా కొనసాగుతోంది. ద్రూజ్‌బా పైప్‌లైన్‌ రష్యాదే. పైగా రష్యాపై చమురు, గ్యాసుకు సంబంధించిన ఆంక్షలను హంగేరీ ప్రధానమంత్రి విక్టర్‌ ఓర్బాన్‌ మొదట్నించీ వ్యతిరేకిస్తూనే వున్నారు. ఇప్పటికీ అదే వైఖరితో వున్నారు.
10. నెదర్లాండ్స్‌ : డచ్‌ ప్రభుత్వం గానీ, రోటర్‌డామ్‌ పోర్ట్‌ గానీ రష్యా చమురుపై నిషేధం విధించలేదు. దాదాపు 30 శాతం చమురు రోటర్‌డామ్‌ పోర్ట్‌ ద్వారానే నెదర్లాండ్స్‌లోకి చేరుకుంటున్నది. అది పూర్తిగా రష్యాదే. ప్రతియేటా దాదాపు 20 మిలియన్‌ టన్నుల రష్యన్‌ చమురు ఉత్పత్తులు నెదర్లాండ్స్‌కు చేరుకుంటాయి. రష్యాపై ఆంక్షలు విధించాలన్న ఆలోచనే ఈ దేశానికి లేదని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.
11. పోలండ్‌ : పోలండ్‌ దేశంలో అతిపెద్ద రిఫైనరీ పికెఎన్‌ ఓర్లెన్‌. పోలండ్‌, లిథువేనియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లోని రిఫైనరీలన్నీ రష్యా ముడిచమురుపైనే ఆధారపడి వున్నాయి. తప్పదంటే దేనికైనా సిద్ధమని, రష్యా సరఫరాపై పూర్తి నిషేధానికి రెడీ అన్నట్లుగా పోలండ్‌ చెపుతోంది. అయితే పోలండ్‌ గురించి ఆ దేశం చెప్పుకోవచ్చు. కానీ లిథువేనియా, చెక్‌ రిపబ్లిక్‌ల గురించి చెప్పే హక్కు ఆ దేశానికి లేదు. పైగా అమెరికా నుంచి అతిపెద్ద హామీ వుంటే తప్ప పోలండ్‌ ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలిసింది.
12. టర్కీ : రష్యా చమురు ఉత్పత్తులు టర్కీ దేశానికి భారీగానే వస్తున్నాయి. రష్యా ముడి చమురు కొనుగోలును ఆపాలన్న ఆలోచనేదీ టర్కీకి లేదు. పైగా మాస్కోపై ఆంక్షలను ఈ దేశం ఇదివరకే బహిరంగంగానే తిరస్కరించింది. టర్కీలో తుప్రాస్‌ అనేది అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ. ఇది పూర్తిగా రష్యాపైనే ఆధారపడి వుంది. (Story: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!)

See Also: రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

0
Russia-Ukraine War
Russia-Ukraine War

రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?

నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప‌డింది. ముఖ్యంగా రష్యా నుంచి వివిధ దేశాలకు చమురు సరఫరా విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో క్రూడాయిల్‌పై తీవ్ర ప్రభావం ప‌డింది. రష్యా నుంచి వచ్చే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం తటస్థంగానే వుండిపోయింది. అమెరికా వంటి దేశాలు ఉక్రెయిన్‌కు మద్ధతు ప్రకటించినప్పటికీ, భారత్‌ మాత్రం రష్యాను వ్యతిరేకించలేదు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్‌ను భారత్‌ కొనుగోలు చేస్తుందా లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
భారతీయ చమురు సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కంపెనీలు రష్యా ముడిచమురు (క్రూడాయిల్‌)ను భారీ రాయితీలకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ మేరకు ఏనాడో ఒప్పందాలు కుదిరాయి. ఒక బ్యారల్‌ 100 డాలర్ల మేర అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు వుండగా, భారత్‌కు అంతకన్నా తక్కువ ధరకే రష్యా అమ్ముతోంది. దానికి కారణమేమిటంటే, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌కు రష్యా అత్యంత సన్నిహితమైన మిత్రదేశం. దాదాపు 80 శాతం దిగుమతులు రష్యా నుంచే జరుగుతున్నాయి. అందులో ఆయిల్‌ కూడా వుంది. రష్యాకు భారత్‌ ప్రత్యేక దేశం అయినందున చమురు ధరల్లో కూడా తేడా వుంటుంది. భారత్‌, రష్యాల మధ్య ఏనాడూ సంబంధాలు చెడిపోలేదు. కొత్తగా ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో అమెరికా ఎంత రెచ్చగొట్టినా, ఒత్తిడి తెచ్చినా భారత్‌ మాత్రం తటస్థంగా వుందే తప్ప రష్యాను వ్యతిరేకించలేదు. ఇప్పటికిప్పుడు రష్యాపై విధిస్తున్న ఆంక్షలను భారత్‌ సమర్ధిస్తే నష్టపోయిదే భారతే. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నది. రష్యా నుంచి రాయితీపై ముడిచమురు దిగుమతి కొనసాగినట్లయితే, అమెరికా ఆంక్షలను భారత్‌ ఉల్లంఘించినట్లా కాదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. దీన్ని ఉల్లంఘనగా భావించలేమని ఇప్పటికే వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ అన్నారు. అయితే చరిత్రను మార్చాల్సిన సమయమిదేనని, రష్యాకు మద్దతివ్వడమంటే ఆక్రమణకు మద్దతు ఇవ్వడమేనని గుర్తించాలని సాకీ వ్యాఖ్యానించారు.
ఏదేమైనప్పటికీ, భారత్‌ ఒక్కటే కాదు..ఇంకా చాలా దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నది. ఇందులో ప్రధాన దేశాలు వున్నాయి. అందుకే ఈ విషయం అమెరికాకు మింగుడుపడటం లేదు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోని అనేక దేశాలు ఇంకా రష్యా ముడిచమురును కొనుగోలు చేస్తూనే వున్నాయి. ఉక్రెయిన్‌కు నేటికీ సరైన మద్దతు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఇదే. నేటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలేంటో తెలుసా? ఓసారి తెలుసుకుందాం!
1. బల్గేరియా : బాల్కన్‌ ద్వీపకల్పంలోని అతిపెద్ద ఆయిల్‌ రిఫైనింగ్‌ సంస్థ నెఫ్తోచిమ్‌ బర్గాస్‌ రిఫైనరీ అనేది రష్యాకు చెందిన ల్యూకాయిల్‌ అనే సంస్థ యాజమాన్యంలో నడుస్తున్నది. ఇది బల్గేరియాలో వుంది. బల్గేరియా స్వదేశీ మార్కెట్‌లో ప్రాథమిక ఇంధన సరఫరాదారు ఇదే. 60 శాతం రష్యా క్రూడాయిల్‌ ఇక్కడకు నేరుగా సరఫరా అవుతున్నది. ప్రస్తుతం 40 శాతం రష్యేతర ముడిచమురును బల్గేరియా ఉపయోగిస్తున్నది. అయితే ఆంక్షలకు తలొగ్గి వుండాల్సి వస్తే నూటికి నూరు శాతం రష్యేతర ముడిచమురును బల్గేరియా ఉపయోగించగలగాలి. కానీ అంత సామర్థం నెఫ్తోచిమ్‌ బర్గాస్‌కు వుందా లేదా అన్నది తేలలేదు. కాకపోతే ల్యూకాయిల్‌ రష్యన్‌ సంస్థ కాబట్టి, ఈ అనుమతి బల్గేరియాకు ఇస్తుందా లేదా అన్నది అనుమానమే. ఇప్పటికైతే రష్యా మీద చమురు కోసం ఆధారపడాల్సిందేనని స్పష్టమవుతున్నది.
2. చైనా : యూరోపియన్‌ యూనియన్‌ తర్వాత రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద రెండవ దేశం చైనా. ఓవైపు యుద్ధం జరుగుతున్నా, సముద్రమార్గాన నౌకల ద్వారా చమురు సరఫరాలు మరింత పెరిగే అవకాశం వుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఎ) తెలిపింది. చైనాకు మరింత ముడి చమురు వెళ్లబోతుందని ప్రముఖ చమురు ఉత్పాదక పర్యవేక్షణ సంస్థ, కార్గో ట్రాకింగ్‌ డేటా ప్రొవైడర్‌, ట్రేడ్‌ ఫ్లో నిఘా సంస్థ అయితే పెట్రో`లాజిస్టిక్స్‌ భావిస్తున్నదని రాయిటర్స్‌ వార్తాసంస్థ పేర్కొంది.
3. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) : ప్రస్తుతం యూరోపియన్‌ యూనియన్‌లో 27 దేశాలున్నాయి. ఇప్పటివరకు ఈ దేశాలు 40 శాతం గ్యాసు, 27 శాతం ముడిచమురు దిగుమతుల కోసం రష్యాపైనే ఆధారపడి వున్నాయి. ఇప్పుడు రష్యా దిగుమతుల అదుపుపై అమెరికా చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ దేశాలు రెండుగా చీలాయి. అయితే దీర్ఘకాలంగా సాగుతున్న రష్యా శిలాజ ఇంధనాల తవ్వకాల ప్రణాళిక ఈ మేనెలతో ముగిసే అవకాశం వుంది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్‌, ట్రాన్స్‌నెఫ్ట్‌, గాజ్‌ప్రోమ్‌ నెఫ్ట్‌లపై కొత్త ఆంక్షలను ఆమోదించడానికి సిద్ధమైనప్పటికీ, వాటి నుండి చమురు కొనుగోలు కొనసాగుతుందని చెపుతోంది. ఇదొక విచిత్రమైన వైఖరి.
4. ఫ్రాన్స్‌ : 2021లో ఫ్రాన్స్‌ చేసుకున్న మొత్తం దిగుమతుల్లో 9.5 శాతం రష్యా ముడి చమురు ఉత్పత్తులే ఉండటం విశేషం. ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నట్లు ఫ్రెంచ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఇండస్ట్రీ (యుఎఫ్‌ఐపి) ఇంకా చెపుతూనే వుంది. రష్యన్‌ డీజిల్‌ను మాత్రం ఇప్పటికే కాదనుకున్నట్లు సమాచారం. కాకపోతే ఎక్కువ వ్యయం భరించాల్సి వుంటుంది.
5. జర్మనీ : జర్మనీలోని అతిపెద్ద రిఫైనరీ మిరో (ఎంఐఆర్‌ఓ)లో దాదాపు 14 శాతం ముడి చమురు రష్యా నుంచే వస్తున్నది. మిరో అంటే ది మినరల్‌ఆయెల్‌రఫైనెరీ ఒబెర్రీన్‌ గ్యాంభ్‌ రిఫైనరీ. ఈ సంస్థ ఫిలిప్స్‌66 అనే సంస్థతో సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్నది. ఫిలిప్స్‌66కు ఇందులో 18.75 శాతం వాటా వుంది. అలాగే, జర్మనీకి చెందిన మరో ఆయిల్‌ కంపెనీ పిసికె ష్వెద్‌ రిఫైనరీలో రోస్‌నెఫ్ట్‌ డ్యూష్‌ల్యాండ్‌ అనే సంస్థకు 54 శాతానికిపైగా వాటా వుంది. ఇది రష్యాకు చెందిన రోస్‌నెఫ్ట్‌ అనే సంస్థకు అనుబంధ కంపెనీ. దానికి ద్రూజ్‌బా పైప్‌లైన్‌ ద్వారా చమురు పంపిణీ చేస్తారు. టోటల్‌ ఎనర్జీస్‌ యాజమాన్యంలో నడుస్తున్న లెవునా రిఫైనరీ సహకారంతో ఇది జరుగుతుంది. ఈ చిక్కులన్నీ జర్మనీకి వున్నాయి. ఇప్పటికిప్పుడు రష్యాతో ఢీ అంటే జర్మనీకే అధికంగా నష్టం.
6. గ్రీస్‌ : గ్రీస్‌ అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ హెల్లెనిక్‌ పెట్రోలియంలో 2021 ద్వితీయార్థంలో దాదాపు 15 శాతం రష్యా ముడిచమురు ఖాతా వున్నట్లు ఆ సంస్థే చెపుతున్నది. అయితే రష్యాపై ఆంక్షలు తప్పవంటే, సౌదీ అరేబియా నుంచి అదనపు సరఫరాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తామని చెపుతున్నది. ఇది కాస్త భారమే అయినా తప్పదంటోంది. కాకపోతే గ్రీస్‌ తొందరపడకుండా ఆచితూచి స్పందిస్తోంది.
7. ఇండియా : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూస్తాన్‌ పెట్రోలియం అధికభాగం రష్యా యూరల్స్‌ సంస్థపైనే ఆధారపడుతున్నది. ట్రేడిరగ్‌వర్గాల కథనం మేరకు మే నెల కోసం 2 మిలియన్‌ బ్యారెల్స్‌ను కొనుగోలు చేసింది. అలాగే, భారత అగ్రశ్రేణి రిఫైనరీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మే డెలివరీ కింద యూరల్స్‌ నుంచి 3 మిలియన్‌ బ్యారెల్స్‌ను కొనుగోలు చేసిందని వాణిజ్యవర్గాలు వెల్లడిరచాయి. అంటే రష్యాను భారత్‌ వ్యతిరేకిస్తే మన దేశంలో కచ్చితంగా చమురు సంక్షోభం తలెత్తుతుంది. చమురుతోపాటు ఇతర ఉత్పత్తుల దిగుమతులు కూడా రష్యా నుంచి అధికంగా వున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, తటస్థంటా వుండాలన్న భారత్‌ వైఖరే ఉత్తమం.
8. ఇటలీ : ఇసాబ్‌ (ఐఎస్‌ఎబి) అనేది ఇటలీలో అతిపెద్ద రిఫైనరీ. స్విట్జర్లాండ్‌ ఆధారిత లిటాస్కో ఎస్‌ఎ దీని యజమాని. ఇది రష్యాకు చెందిన లూకాయిల్‌ నియంత్రణలో పనిచేస్తున్నది. మార్చి 4 నాటికి యథాప్రకారం దీని పనితీరులో ఎలాంటి మార్పు లేదు. వివిధ రకాల ముడిచమురు ప్రక్రియలను ఇది కొనసాగిస్తున్నది.
9. హంగేరీ : హంగేరియన్‌ ఆయిల్‌ గ్రూప్‌ ఎంఓఎల్‌కు ద్రూజ్‌బా పైప్‌లైన్‌ నుంచి నిరంతరాయంగా చమురు సరఫరా కొనసాగుతోంది. ద్రూజ్‌బా పైప్‌లైన్‌ రష్యాదే. పైగా రష్యాపై చమురు, గ్యాసుకు సంబంధించిన ఆంక్షలను హంగేరీ ప్రధానమంత్రి విక్టర్‌ ఓర్బాన్‌ మొదట్నించీ వ్యతిరేకిస్తూనే వున్నారు. ఇప్పటికీ అదే వైఖరితో వున్నారు.
10. నెదర్లాండ్స్‌ : డచ్‌ ప్రభుత్వం గానీ, రోటర్‌డామ్‌ పోర్ట్‌ గానీ రష్యా చమురుపై నిషేధం విధించలేదు. దాదాపు 30 శాతం చమురు రోటర్‌డామ్‌ పోర్ట్‌ ద్వారానే నెదర్లాండ్స్‌లోకి చేరుకుంటున్నది. అది పూర్తిగా రష్యాదే. ప్రతియేటా దాదాపు 20 మిలియన్‌ టన్నుల రష్యన్‌ చమురు ఉత్పత్తులు నెదర్లాండ్స్‌కు చేరుకుంటాయి. రష్యాపై ఆంక్షలు విధించాలన్న ఆలోచనే ఈ దేశానికి లేదని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.
11. పోలండ్‌ : పోలండ్‌ దేశంలో అతిపెద్ద రిఫైనరీ పికెఎన్‌ ఓర్లెన్‌. పోలండ్‌, లిథువేనియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లోని రిఫైనరీలన్నీ రష్యా ముడిచమురుపైనే ఆధారపడి వున్నాయి. తప్పదంటే దేనికైనా సిద్ధమని, రష్యా సరఫరాపై పూర్తి నిషేధానికి రెడీ అన్నట్లుగా పోలండ్‌ చెపుతోంది. అయితే పోలండ్‌ గురించి ఆ దేశం చెప్పుకోవచ్చు. కానీ లిథువేనియా, చెక్‌ రిపబ్లిక్‌ల గురించి చెప్పే హక్కు ఆ దేశానికి లేదు. పైగా అమెరికా నుంచి అతిపెద్ద హామీ వుంటే తప్ప పోలండ్‌ ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలిసింది.
12. టర్కీ : రష్యా చమురు ఉత్పత్తులు టర్కీ దేశానికి భారీగానే వస్తున్నాయి. రష్యా ముడి చమురు కొనుగోలును ఆపాలన్న ఆలోచనేదీ టర్కీకి లేదు. పైగా మాస్కోపై ఆంక్షలను ఈ దేశం ఇదివరకే బహిరంగంగానే తిరస్కరించింది. టర్కీలో తుప్రాస్‌ అనేది అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ. ఇది పూర్తిగా రష్యాపైనే ఆధారపడి వుంది. (Story: రష్యన్‌ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?)

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

మల్లు స్వరాజ్యం కన్నుమూత

0
Mallu Swarajyam
Mallu Swarajyam

మల్లు స్వరాజ్యం కన్నుమూత

హైదరాబాద్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(92) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆమె బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సిపిఐ(ఎం) సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ప్రాంత ప్రజల్ని సమీకరించి నైజాం సర్కార్‌, రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకి పట్టి సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం కష్టజీవుల హక్కులకోసం కడదాక ఉద్యమించారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళా హక్కులతో పాటు శ్రామిక మహిళా ఉద్యమాలు, ముఖ్యంగా సారా వ్యతిరేక పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా, ఎంఎల్‌ఏగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. నమ్మిన ఆశయాల కోసం ఎర్రజెండా బాటలో అహర్నిశలు శ్రమించిన ఉద్యమ నేత మృతి కార్మిక వర్గానికి తీరని లోటు. ఎంతోమంది ప్రగతిశీలమహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు. (Story: మల్లు స్వరాజ్యం కన్నుమూత)

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

వావ్‌! యాదాద్రి గుడికి నానో టెక్నాలజీ

0
Yadadri Nano Technology
Yadadri Nano Technology

వావ్‌! యాదాద్రి గుడికి నానో టెక్నాలజీ

యాదాద్రి బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం

వావ్‌! యాదాద్రి గుడికి నానో టెక్నాలజీ! అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత  ఉందా ? అంటే  ఉందని  ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్‌ గోల్డ్‌ డిపోజిషన్‌ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీ పరంగా అనే సమాధానం వస్తుంది. అటు నాసా, ఇటు యాదాద్రి కలశాలకు ఉపయోగించినది ఈ సాంకేతికతనే ! నాసా లేదంటే మన ఇస్రోలో రక్షణ వ్యవస్ధలు లేదంటే యంత్రసామాగ్రి పరిరక్షణకు ఈ గోల్డ్‌ కోటింగ్‌ సాంకేతికతనే వినియోగిస్తుంటారు.  అదే  తరహా సాంకేతికతను హైదరాబాద్‌ సమీపంలోని యాదాద్రి దేవాలయ బంగారు కలశాలపై కూడా ఉపయోగించారు. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని పూర్తిగా పునరుద్ధరించి మార్చి 28వ తేదీన భక్తుల కోసం తెరువబోతున్నారు.

హైదరాబాద్‌కు 52 కిలోమీటర్ల దూరంలో  ఉన్న ఈ దేవాలయంలో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా 52 అతి సున్నితంగా రూపొందించిన కలశాలు ఉన్నాయి. ఈ కలశాలను చెన్నైకు  చెందిన స్మార్ట్‌ క్రియేషన్స్‌ తీర్చిదిద్దింది. ఈ కంపెనీ భారతదేశంలో అతి ప్రధానమైన దేవాలయాలకు పనిచేయడంతో పాటుగా అంతర్జాతీయంగా పలు దేవాలయాలకు బంగారు తాపడం, దేవతామూర్తులకు బంగారుతాపడం చేయడం వంటి పనులెన్నో చేస్తుంది. ఈ నెలల్లోనే ప్రజల సందర్శనార్థం దేవాలయం తెరువనుండటం వల్ల నరసింహ స్వామి ఆశీస్సుల కోసం వచ్చే భక్తులను ఈ కలశాలు ఆకట్టుకోనున్నాయి.

స్మార్ట్‌ క్రియేషన్స్‌ ఫౌండర్‌ పంకజ్‌ భండారీ మాట్లాడుతూ ‘‘దేశ విదేశాలలో దేవాలయాలకు బంగారు తాపడాలు చేయడంలో రెండు దశాబ్దాల చరిత్ర మాకు ఉంది. గత 24 సంవత్సరాలుగా దాదాపు 5500 దేవాలయాల్లో మేము మా 100కు పైగా కళాకారులు, వారి కుటుంబాలతో ఈ పనులను చేశాము’’ అని అన్నారు.

ఈ ఎన్‌టీడీజీ సాంకేతికతను గురించి ఆయన వెల్లడిస్తూ ‘‘ఇది పేటెంటెడ్‌ సాంకేతికత. దీనిలో బంగారం అతి తక్కువగా వినియోగించడం జరుగుతుంది. మా బంగారు దేవాలయ ప్రాజెక్టులన్నీ కూడా సాధారణంగా భక్తుల విరాళాల మీదనే సాగుతుంటాయి. ఎన్‌టీజీడీ సాంకేతికతతో  ఈ ప్రాజెక్టులు అందుబాటు ధరలో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్‌తో చదరపు అడుగుకు 5 గ్రాముల బంగారం వినియోగం తగ్గుతుంది. అలాగే గోల్డ్‌ కోటింగ్‌తో పోలిస్తే ఈ విధానంలో మందం కూడా మైక్రాన్‌లకు తగ్గుతుంది. అంతేకాదు, సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే దీనిని నిర్వహించడం సులభం. ఇంకో విషయయేమిటంటే, ఏ సమయంలో అయినా దీనిలో వాడిన బంగారం మొత్తం తిరిగిపొందవచ్చు’’ అని అన్నారు. (Story: వావ్‌! యాదాద్రి గుడికి నానో టెక్నాలజీ)

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

టాలీవుడ్‌కు మిర్నా మీన‌న్‌!

0
Mirnaa Menon
Mirnaa Menon

టాలీవుడ్‌కు మిర్నా మీన‌న్‌!

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పై నిర్మాత కెకె రాధామోహన్ త‌మ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇందులో హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవ‌లే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్‌ గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా మిర్నా మీనన్ ను ఆహ్వానించారు.  గతంలో మలయాళం, తమిళం లో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్ లు ఇద్దరికీ త‌గిన ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతిక బృందం విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంగీతం ఆర్ఆర్ ధృవన్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. గిడుతూరి సత్య ఎడిటింగ్, కొలికపోగు రమేష్ ఆర్ట్, రామకృష్ణ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. సినిమా టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ తదితరులు, సాంకేతిక సిబ్బంది: స‌మ‌ర్ప‌కులు: లక్ష్మీ రాధామోహన్, ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్, నిర్మాత: కెకె రాధామోహన్, రచయిత, దర్శకుడు: ఫణి కృష్ణ సిరికి, సంగీతం: RR ధ్రువన్, డిఓపి: సతీష్ ముత్యాల, కళ: కొలికపోగు రమేష్, ఎడిటర్: సత్య గిడుతూరి, యాక్షన్: రామ కృష్ణ, కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: MS కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను), PRO: వంశీ-శేఖర్, డిజైన‌ర్‌: రమేష్ కొత్తపల్లి (Story: టాలీవుడ్‌కు మిర్నా మీన‌న్‌!)

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

ఓటీటీలో సుశాంత్‌!

0
Sushanth
Sushanth

కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై  నిర్మిస్తున్న  ZEE 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయిన హీరో  సుశాంత్..

ఓటీటీలో సుశాంత్‌! మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడుగా “కాళిదాసు”చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన యువ కథా నాయకుడు సుశాంత్..తను కెరీర్  మొదలుపెట్టిన తక్కువ సమయం లోనే  కరెంట్, అడ్డా, దొంగాట, అటాడు కుందాం..రా , చి౹౹ల౹౹సౌ౹౹ వంటి మొదలగు హిట్ సినిమాలలో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు..”అల వైకుంఠ పురములో”..సినిమాతో మంచి క్లాస్ క్యారెక్టర్ లో నటించి అక్కినేని అభిమానులతో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. కరోనా టైం లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా ద్వారా మంచి విజయం సాధించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

తాజాగా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండడంతో వెబ్ సిరీస్ లో ఏంతో ఆసక్తి కరమైన కథ సుశాంత్ కు నచ్చడంతో  తొలిసారిగా “ZEE5” వెబ్ సిరీస్ ను సెలెక్ట్ చేసుకొని నటించడం విశేషం. ప్రస్తుతం ZEE5 లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ ను కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు  “ZEE5” వెబ్ సిరీస్ లో నటించ డానికి ముందుకు వచ్చిన సుశాంత్ ను ZEE 5 టీం గ్రాండ్ వెల్ కం చెపుతూ మా రాబోయే వెబ్‌సిరీస్‌కు స్వాగతం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు..

ఇప్పటి వరకు ప్రేక్షకులు  సుశాంత్ ను పోలీస్ గెటప్ లో చూడలేదు. పోలీస్ జీప్ ముందు మఫ్టీ లో కూల్ గా నిల్చొని చూస్తున్న ఫోటో ను చూస్తుంటే తను నటించే ZEE5  వెబ్ సిరీస్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.ఈ గెటప్ ను చూస్తుంటే తను నటించే ZEE5  వెబ్ సిరీస్ మీద విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ నెల18 న జరిగే సుశాంత్ బర్త్ డే వేడుకలో సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేస్తూ తను నటించే వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ZEE 5  యూనిట్ తెలియజేసింది. (Story: ఓటీటీలో సుశాంత్‌!)

See Also: దుబాయ్‌లో రాజ‌మౌళి ఏమ‌న్నారంటే…!

మెగాస్టార్ మేడే!

Photo Gallery

error: Content is protected !!