UA-35385725-1 UA-35385725-1

గందరగోళంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

గందరగోళంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

న్యూస్‌తెలుగు/ వినుకొండ : మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ సభ్యుల ఆగ్రహావేశాలు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు సుమారు 1: 30 లకు పైగా సమావేశం గందరగోళంగా మారింది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం. అజెండాలోని 31 అంశాలు చదివి వినిపించగా అన్ని అంశాలు సమావేశం ఆమోదించినట్లు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి ప్రకటించగా, అత్యవసర సమావేశం అజెండాలోని నాలుగు అంశాల్లో వివాదాస్పదంగా ఉన్న నాలుగవ అంశం ప్రస్తుతం ఆపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక వైసిపి కౌన్సిలర్లు ఒకరు తరువాత ఒకరు చైర్మన్ దస్తగిరి పై, అధికారులపై విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల దాటిపోయింది తమ వార్డుల్లో ఏ ఒక పని పూర్తిస్థాయిలో జరగలేదు, సమావేశాలకు వస్తున్నాం పోతున్నాం. ఇక తమ పదవీకాలం 10 నెలలు మాత్రమే ఉంది. ఇక వార్డుల్లో తమ మొఖాలు ప్రజలకు ఎలా చూపించాలంటూ నిప్పులు చెరిగారు. దీంతో మద్య మధ్యలో వైసిపి చైర్మన్గా గెలిచిన డాక్టర్ దస్తగిరి, వైసిపి కౌన్సిలర్ల పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగేళ్లుగా అధికారులను ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. ఇప్పుడు ఆ అధికారులు లేరు, ప్రభుత్వం మారిపోయింది. నాలుగేళ్లు మున్సిపాలిటీ నిధులు స్వాహా అయ్యాయి. ఇప్పుడు ఆ అధికారులు కూడా లేరు. కొత్త ప్రభుత్వం నుండి నిధులు రాగానే ఆయా అవార్డుల్లో ఆగిపోయిన పనులు పూర్తి చేద్దాం అంటూ కొత్త ప్రభుత్వానికి వంత పలకకనే పలికారు.. 12వ.వార్డు కౌన్సిలర్ నాలుగేళ్లుగా తమ వార్డులో ఒక్క పని కూడా జరగలేదంటూ ఆగ్రహించారు. ఇక 32 వ వార్డు టిడిపి కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి మాట్లాడుతూ. మూడేళ్ల కాలంలో తమ వార్డులో లక్షన్నర అభివృద్ధి పనులు మాత్రమే జరిగాయని వివరించారు. 31వ వార్డ్ కౌన్సిలర్ ఎం.లక్ష్మి రెడ్డి మాట్లాడుతూ. తమ వార్డులో రోడ్లన్నీ గోతులు మయంగా మారాయని అధికారులను తీసుకువెళ్లి చూపించినప్పటికీ నేటికీ కాంట్రాక్టర్లు రావడం లేదంట్లు, ఆ గోతులు పూడ్చలేదని ఆగ్రహించారు. దీంతో అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లు వెళ్లిపోతున్నారు. కొత్త కాంట్రాక్టర్లు ఎవరూ రావడం లేదు అంటూ బదులిచ్చారు. ఒక దశలో వైసిపి కౌన్సిలర్ ఎం. ఎస్. కే భాష. చైర్మన్ దస్తగిరి మధ్య అభివృద్ధి పనులపై తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదన్నారు. గంటా కాలేషా వైసిపి మాట్లాడుతూ తమ వార్డులో వర్కులన్నీ ఆగిపోయాయని, విద్యుత్ సింగిల్ ఫేస్ వస్తుందని, గ్రాంటు ఎన్నిసార్లు అడిగినా మంజూరు చెయ్యలేదన్నారు. రెడ్డి నాగ పద్మ వైసిపి. కాలువల్లో పూడికతీత పనులు, మార్కాపురం రోడ్డులో కూడా చేపట్టాలని కోరారు. ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ పి బ్రహ్మయ్య మాట్లాడుతూ. కాలువల్లో మురుగు సక్రమంగా తీయడం లేదని, జంగిల్ క్లియరెన్స్ అసలు మరిచిపోయారని ఆయన వాపోయారు. వైసిపి వైస్ చైర్మన్ బేతం గాబ్రియేలు మాట్లాడుతూ. ఎన్.ఆర్.టి రోడ్లో ఆక్రమణలు పూర్తిస్థాయిలో పెరిగిపోయాయని అవి వెంటనే తొలగించాలని, మెయిన్ డ్రయిన్స్లో పూడిక తీత పనులు వెంటనే చేపట్టాలని కోరారు. 23వ వార్డ్ కౌన్సిలర్ నన్నేసా మాట్లాడుతూ. పక్షపాతంతో వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ తమ వార్డులో ఏ అభివృద్ధి పని చేపట్టలేదని,అలాంటప్పుడు ఈ సమావేశాలు ఎందుకు మేము రావడం ఎందుకు అంటూ ఆగ్రహించారు. సభ్యులు ఎంఎస్కే భాష మాట్లాడుతూ. 32 వార్డుల సభ్యులను ఒక్కసారిగా సమావేశపరచి. ఆ అవార్డుల్లో ఏ పనులు జరగాలో ఎందుకు అడగరని చైర్మన్ పై ఆగ్రహించారు. దీంతో చైర్మన్ దస్తగిరి కూడా ఆగ్రహిస్తూ ఈ నాలుగేళ్ల కాలంలో గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అని ఎదురు ప్రశ్నించారు.. దీంతో ఇటీవల మున్సిపల్ కమిషనర్ గా వినుకొండకు వచ్చిన ఎం. సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకొని మాట్లాడుతూ. ప్రస్తుతం వినుకొండ మున్సిపాలిటీ ఆరు కోట్లు అప్పుల్లో ఉందని, ప్రభుత్వం నుండి నిధులు రాగానే ఆయా అవార్డుల్లో నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తామని అన్నారు. కాగా మూడేళ్లుగా మరమ్మతుకు నోచుకోని స్ట్రీట్ లైట్లను తాను వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే 180 స్ట్రీట్ లైట్లు బాగు చేయించామని, వివిధ ప్రాంతాల్లో 150 లైట్లు రీ ఫిటింగ్ చేయించామని, పట్టణంలో చెడిపోయిన నీటి కొళాయిలు, బోర్లు మరమ్మతులు చేయించా మన్నారు. పట్టణంలో త్వరితగతిన అభివృద్ధి పనులన్నీ చేపడతామని, సభ్యులు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. దీంతో సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఈ సమావేశంలో శానిటరీ అధికారి ఎస్కే ఇస్మాయిల్, మేనేజర్ వెంకటరామయ్య, టీపీఎస్ వెంకట రామమ్మ పాల్గొన్నారు. (Story : గందరగోళంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1