ఏఆర్డిఎస్ వైరస్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆపన్న హస్తం
ప్రముఖ వేత్త సందా రాఘవ
న్యూ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని సత్య సాయి నగర్కు చెందిన బిందు అనిల్ కుమార్ రెడ్డి దంపతులకు మూడు సంవత్సరాల మోక్షిత శ్రీ, ఒకటిన్నర సంవత్సరం కుమారుడు ఉన్నారు. తండ్రి అనిల్ కుమార్ రెడ్డి బైక్ మెకానిక్ గా పని చేసుకుంటూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఇంతలో మోక్షిత శ్రీ కి భయంకరమైన ఊపిరితిత్తుల వ్యాధి అనే పెద్ద జబ్బు సోకింది. ఈనెల 8వ తేదీన ఉన్న పొలం గా అనారోగ్యానికి గురి కావడంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందించారు. అనంతరం చిన్నారి పరిస్థితి గ్రహించిన ఆసుపత్రి డాక్టర్లు బెంగళూరుకు రెఫర్ చేయడం జరిగింది. అక్కడి డాక్టర్లు పరీక్షించి ఆక్సిజన్ రక్తంలోకి కలవకుండా ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఏర్పడిందని ఇందుకోసం యెకో వైద్యం చేయాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు సూచించారు. దాదాపు 1.5 లక్షల దాకా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అంత స్తోమత తనకు లేదని వివిధ చోట్ల అప్పులు చేశాడు. తదుపరి బాధితుడు ప్రముఖ టిడిపి నాయకులు సంధ రాఘవా కు తెలియజేశారు. చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయిన సంధ రాఘవ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టిడిపి ఇన్చార్జ్ పరిచాల శ్రీరామ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. తదుపరి పరిటాల శ్రీరామ్ తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులను ఫోన్లో సంప్రదించి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సరైన వైద్యం చేసి బతికించాలని తెలిపారు. తదుపరి చందా రాఘవ తన వంతు సహాయంగా 50 వేల రూపాయలు అందించి హుటా హుటిన ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ సిమ్స్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం అందించాలన్న ఆదేశాలను పంపారు. తదుపరి తల్లిదండ్రులు కృతజ్ఞతలను తెలియజేశారు.(Story:ఏఆర్డిఎస్ వైరస్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆపన్న హస్తం)