వైద్య శిబిరానికి విశేష స్పందన
న్యూస్ తెలుగు/వినుకొండ : వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే సందర్భంగా ఆదివారం నిర్వచిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినందుకు ఆనందంగా ఉందని వినుకొండ శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఎస్ ఆర్తో, జాయింట్ రీప్లేస్ మెంట్ అర్దోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అభిషేక్ కొరివిపాడు తెలిపారు.వైద్యశాలలో రెండు వేల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించామని,అనేక మందికి వారి ప్రస్తుత పరిస్థితి ల పై అవగహన సైతం కల్గిచమన్నారు. బిఎండి అనే పరీక్ష నిర్వహించి, వచ్చిన పేషెంట్లు అందరికీ, వారి యొక్క ఎముకల దృఢత్వం మరియు ఎముకల పట్టిష్టత గురించి ఆయన తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అవసరమైన వారికి ఆపరేషన్ కోసం సజెషన్ చేశామన్నారు. ఈ చక్కటి సదవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవడంపై, సంబంధిత వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి అవకాశం కల్పిచిన శ్రీ దత్త హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ కాంత్, గార్లపాటి కి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేశ్వరి, గార్లపాటి కు ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేటి ఒపి 250 పై మించిన స్పందన రావడంపై హర్షం వ్యక్తం చేశారు.(Story:వైద్య శిబిరానికి విశేష స్పందన)