వీర మరణం పొందిన జవాన్ రాజేష్ కు నివాళులు ఆదర్శ సేవా సంఘం
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : బ్రహ్మంగారి మఠం మండలంలోని పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొడవటి కంటి రాజేష్ చతిస్గడ్ లోని మిజాపూర్ లో ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ లో జవాన్గా పనిచేస్తున్నారు. ఈనెల 19వ తేదీన నక్సల్స్ అమర్చిన మైనింగ్ బాంబ్ బేబీ వారు మరణించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాండురంగ వీధిలో గల ఆదర్శ గ్రీన్ పార్క్ సైనిక స్తూపం దగ్గర మాజీ సైనికులు తోపాటు ఆదర్శ సేవా సంఘం తరఫున అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు చెన్నా ప్రకాష్, కార్యదర్శి గుద్దిటి నాగార్జున, మారుతి, నాగభూషణ, తదితరులు రాజేష్కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వీర జవాన్ రాజేష్ మృతి బాధాకరమని, అయినా దేశం కోసం తన ప్రాణాలు వడ్డీన మహనీయుడని వారు తెలిపారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలిపారు.(Story:వీర మరణం పొందిన జవాన్ రాజేష్ కు నివాళులు ఆదర్శ సేవా సంఘం)