Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష హోదాపై యుద్ధం

ప్రతిపక్ష హోదాపై యుద్ధం

0

ప్రతిపక్ష హోదాపై యుద్ధం

తెరపైకి జనసేన

వైఎస్‌ఆర్‌సీపీకి చెక్‌కు యత్నం

ఇప్పటికే పీఏసీ చైర్మన్ ప‌ద‌వి జ‌న‌సేన కైవసం

దిక్కుతోచని వైఎస్‌ఆర్‌సీపీ

జగన్‌ వ్యూహం ఫలించేనా ?

న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదాపై యుద్ధం నడుస్తోంది. ఇటీవలనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 20 రోజులపాటు ఈ సభల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగానికి వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో హాజరయ్యారు. జగన్‌తోపాటు శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే సీటులో ఆశీనులయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కొద్దిసేపు స్పీకర్‌ పోడియం వద్ద నిరసనకు దిగారు. దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, అసెంబ్లీలో 11 నిమిషాలపాటు ఉండకుండా గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేసి బయటకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి జగన్‌ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అలా ఇస్తేనే ప్రజా సమస్యలపై పూర్తిగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు తనకు అవకాశం కలుగుతుందని వాదిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు ఎప్పటికప్పుడూ తిప్పికొడుతున్నారు. సంఖ్యా బలం ఆధారంగా ప్రతిపక్ష హోదా వస్తుందని, పార్లమెంట్‌, అసెంబ్లీలో ఉన్న చట్టాలను జగన్ ఆపోసన పట్టాలని సూచిస్తున్నారు. తెలివిగా తెరపైకి కూటమిలో భాగస్వాములైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దించింది. అసెంబ్లీలో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్‌ పదవిని వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీకి దక్కాల్సి ఉంది. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పీఏసీ చైర్మన్‌ పదవి పయ్యావుల కేశవ్‌కు కేటాయించింది. అదే ఆనవాయితీ ప్రకారం ప్రస్తుతం అధికారం కోల్పోయిన వైఎస్‌ఆర్‌సీపీకి పీఏసీ చైర్మన్‌ హోదా రావాల్సి ఉండగా..దాన్ని జనసేనకు కేటాయించడం వివాదస్పదంగా మారింది.

ప్రతిపక్షంపై పవన్‌ కళ్యాణ్‌ కన్ను!

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి సర్కార్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ కేవలం 11సీట్లకే పరిమితమైంది. జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. అప్పటి నుంచి జగన్‌ ప్రతిపక్ష పల్లవి అందుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నవి రెండే పక్షాలు..అవి ఒక కూటమి పక్షం, రెండు ప్రతిపక్ష అని జగన్‌ అనేక మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానించారు. కూటమి పక్షం అధికారంలో ఉన్నందున..ఇక మిగిలిన వైఎస్‌ఆర్‌సీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుపడుతున్నారు. దీనిపై హైకోర్టును జగన్‌ ఆశ్రయించగా..అసెంబ్లీ స్పీకర్‌కు వివరణ ఇవ్వాలని సమాచారం పంపింది. జగన్‌పై ఉన్న రాజకీయ వ్యతిరేకతతో అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయ అధికారులూ దానిపై అంతగా దృష్టి పెట్టడంలేదని తెలిసింది. ఈ క్రమంలో జగన్‌ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్ష హోదాకు డిమాండ్‌ చేశారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, కూటమిలో టీడీపీ తర్వాత జనసేనే అత్యధిక సంఖ్యాబలం గల పార్టీ అని, ఒక వేళ ప్రతిపక్ష హోదా దక్కాలంటే అది తమకే వస్తుందన్న సందేశంతో వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అయినా వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతిపక్షం రాబోదంటూ తేల్చిచెప్పారు. సీఎం చంద్రబాబు సైతం దీనిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఇప్పటికైనా వైఎస్‌ఆర్‌సీపీ తన తీరు మార్చుకోవాలని సూచించారు. ఇది జగన్‌ వ్యూహం, ఎత్తుగడలకు చెక్‌పెట్టేలా ఉంది. పవన్‌ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూ, జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తారని కూటమిలో భయం పుడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

మండలిలో మంత్రి లోకేష్‌ ఘాట్‌ కౌంటర్‌

వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేస్తున్న ప్రతిపక్ష హోదాపై శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ గైడ్‌లైన్స్‌ను మనం అనుసరించాల్సి ఉందని, అందులో లోక్‌సభ స్పీకర్‌ నేతృత్వంలో కండిషన్స్‌ ఫర్‌ రికగ్నిషన్‌ పేజీ నంబరు 62లో 121సి పాయింట్‌లో టోటల్‌ నెంబరు ఆఫ్‌ హౌస్‌లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పష్టంగా ఉందని మంత్రి లోకేష్‌ వివరించారు. జగన్‌కు ఈ నియమాలు తెలియవేమో అని, 2009లో అసెంబ్లీకి సంబంధించి కూడా అలాంటి నిబంధనలే ఉన్నాయని, పేజీ నంబరు 19లోని 56వ అంశంలో అదే తరహా నిబంధనలు పొందుపరిచారని పేర్కొన్నారు. ఈ క్రమంలో జగన్‌కు ఇక ప్రతిపక్ష హోదా రాకుండా అన్ని విధాలా కూటమి చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించింది. అటు చట్టసభల్లోను, ఇటు న్యాయపరంగాను సిద్ధమైంది. వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ప్రతిపక్ష రాద్దాంతానికి విరుగుడుగా కూటమి పార్టీలు ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో జగన్‌ ప్రతిపక్ష హోదా డిమాండ్‌ ముందుకు సాగుతుందా?, లేక మరుగున పడుతుందా? అనేదీ రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. ఇక గవర్నర్‌ ప్రసంగానికి మాత్రమే వెళ్లిన జగన్‌…మిగిలిన సమావేశాలకు హాజరవుతారా?, లేదా? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అటు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వైఎస్‌ఆర్‌సీపీ..ప్రజాసమస్యలపై పోరాటం చేయకుండా, కేవలం ప్రతిపక్ష హోదా కోసమే పోరాడటంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. (Story: ప్రతిపక్ష హోదాపై యుద్ధం)

Follow the Stories:

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

జ‌గ‌న్‌..జ‌స్ట్ ఫైవ్ మినిట్స్‌! అలా వచ్చి..ఇలా వెళ్లి..!

జగన్‌ టీమ్‌కు అనర్హత భయం!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version