Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కుద‌ర‌దంటే కుద‌ర‌దు: వంశీకి హైకోర్టు షాక్‌!

కుద‌ర‌దంటే కుద‌ర‌దు: వంశీకి హైకోర్టు షాక్‌!

0

కుద‌ర‌దంటే కుద‌ర‌దు: వంశీకి హైకోర్టు షాక్‌!

ముందస్తు బెయిల్‌ నిరాకరణ
త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు పోలీసులు ఏర్పాట్లు

న్యూస్ తెలుగు/అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో షాక్‌ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతించలేదు. ముందుస్తు బెయిల్‌ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం త్రోసిపుచ్చింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వారికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించిన నేప‌థ్యంలో త‌దుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఈనెల 19వ తేదీన ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారించారు. సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరముందని, సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని, వారిలో ఐదుగురు మాత్రమే అరెస్ట్‌ అయ్యారని, మరో ఆరుగురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అవసరం లేదని వంశీ తరపు లాయర్‌ వాదించారు. సత్యవర్ధన్‌ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఇద్దరు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేయడంతో, విచారణ ముగిసింది. వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు నిరాశకు గురయ్యారు. (Story: కుద‌ర‌దంటే కుద‌ర‌దు: వంశీకి హైకోర్టు షాక్‌!)

Follow the Stories:

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?

ఇంజినీరింగ్‌ కాలేజీలపై నిఘా?

మావోల కింకర్తవ్యం?

నంబరు-2 రూటెటు?

కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?

షుగ‌ర్ రాకుండా తినాల్సిన 5 ప‌దార్థాలు!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version