గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
100 ప్రాముఖ్యత వివరింపు
రోడ్డు ప్రమాదాల నిర్మూలన కోసం కృషి చేద్దాం
చిన్నబోయినపల్లి గ్రామంలో గ్రామ సభలో అవగాహన సదస్సు. పోస్టర్ ఆవిష్కరణ : ఎస్సై తాజుద్దీన్
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం /ములుగు :
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లోని గ్రామీణ ప్రాంతాలలో గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒకరు కృషి చేయాలని ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు.
ములుగు జిల్లా ఎస్పీ. ఏటూరు నాగారం ఏ ఎస్పీ ఆదేశాల మేరకు. ఏటూరు నాగారం సిఐ సూచనల మేరకు. గురువారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గుడుంబా నిర్మూలన. మత్తు పదార్థాలపై ప్రజలకు యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్సై తాజుద్దీన్ మాట్లాడుతూ. గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. గంజాయి లాంటి మదక ద్రవ్యాలు. మత్తు పదార్థాలకు యువత బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. గ్రామంలో గుడుంబా విక్రయాలు జరిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డయల్ యువర్ 100
అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ శాఖ వారికి 100 కి ఫోన్లు చేసే ప్రాముఖ్యతను వివరించారు. తమ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకు 100 నెంబర్ కు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 100 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.
యువత మద్యానికి బానిసై రాత్రులు రహదారి వెంట మోరీల వద్ద గుంపులు గుంపులుగా కూర్చోవద్దన్నారు. తాము రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో తమకు కంటబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మత్తు పదార్థాలు గంజాయి నిర్మూలన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
రోడ్డు ప్రమాదాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. అతి వేగంగా ప్రయాణించకూడదు. వాహన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చిన్న బోయినపల్లి గ్రామస్తులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి)