పేద ప్రజల ఆరోగ్యమే రక్షణగా నిరంజన్ రెడ్డి
అత్యవసర పరిస్థితుల కోసం ఏడు అంబులెన్సలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా కేంద్రంలో ఆరోగ్యం కోసం వ్యయప్రయాసలు పడుతున్న పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ ఆసుపత్రులను తలపించే విధంగా జిల్లా ఆసుపత్రిని, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని,మెడికల్ కళాశాల మొత్తం కలపి అన్ని సౌకర్యాలతో 300బేడ్స్ కు ఆప్ గ్రేడ్ చేసి ప్రస్తుతం 450 బెడ్స్ కు పెంచిన ఘనత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కి దక్కుతుందని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా సాంకేతిక ప్రమాణాలతో స్కానింగ్ సెంటర్స్,డయాలిసిస్ సెంటర్,సంతృప్తికరంగా సిబ్బందిని నిరంజన్ రెడ్డి మంత్రిగా సాధించారు.ఆయన కృషివల్ల రోగులను ఇతర ప్రాంతాలకు తరలించకుండా వైద్యం అందించడంతో ఎంతో మంది పేద ప్రజలు స్వాంతన పొందారు.ఆసుపత్రి సూపరంటెండెంట్ గారుమరియు డాక్టర్స్,టెక్నికల్ సిబ్బంది,ఇతర సిబ్బంది గత ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు వైద్య సేవలు మాజీ మంత్రి సహకారంతో అందించారు. ముఖ్యంగా కొవిడ్ సమయములో ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు రక్షించడం జరిగింది దానితో పాటు జిల్లా కె.సి.ఆర్ కిట్లు అందిస్తూ గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాలు చేశారు.ఇదిలా ఉండగా పేద ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం గౌరవ నిరంజన్ రెడ్డి గారు తన తల్లి పేరిట సొంత ఖర్చులతో మరియు దాతలను ఒప్పించి మొత్తం 7 అబులెన్స్ లను అత్యవస పరిస్థితుల కోసం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఈ ఎడంటిలో రెండు వాహనాలుజిల్లా ఆసుపత్రి పరిధిలో మరియు రెండు వాహనాలు D.M అండ్ H.O గారి పరిధిలో ఇతరత్రా మండలా లలో అవసరాన్ని బట్టి పనిచేస్తున్నాయి.గత సంప్రదాయాల ప్రకారం రాజకీయాలకు అతీతంగా దాతల పేర్లు ఫోటోలు పెట్టే సంప్రదాయాన్ని అధికారులు మరచి ఎన్నికల కోడ్ పేరిట దాతల ఫోటోలు,పేర్లు తొలగించిన అధికారులు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పెట్టకపోవాడాని నందిమల్ల.అశోక్ తీవ్రంగా ఖండించారు. కాబట్టి వెంటనే జిల్లా వైద్య అధికారులు స్పందించి దాతల ఫోటోలు పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. (Story : పేద ప్రజల ఆరోగ్యమే రక్షణగా నిరంజన్ రెడ్డి)