సారధి గారు తమ్మిలేరుపై హై లెవెల్ కాజ్వే నిర్మించండి..!
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
న్యూస్‌తెలుగు/చాట్రాయి : సారధి గారు సరిహద్దు ప్రాంతంలో తమ్మిలేరుపై చిన్నంపేట శివపురం గ్రామాల మధ్య హై లెవెల్ కాజ్వే నిర్మించాలని తెలంగాణ సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి సారధిని కోరారు. ఆదివారం రాత్రి చింతలపూడి మండలం శివపురం గ్రామంలో ఇటీవల మరణించిన గుత్తా సత్యనారాయణ(సత్యం గారు) నివాసానికి వచ్చి ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం శివపురం గ్రామస్తులు ఆయనతో మాట్లాడుతూ. చాట్రాయి మండలం చిన్నంపేట చింతలపూడి మండలం శివపురం గ్రామాల మధ్య తమ్మిలేరు కాజ్వే వద్ద వర్షాకాలంలో పదేపదే గళ్ళు పడుతుందని అందు వలన స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, వ్యవసాయం ,వ్యాపారం అన్ని రంగాల వారికి ప్రతినిత్యం రాకపోకలకు అవసరమవుతుందని ఇటీవల సత్తుపల్లి డిపో నుండి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు సౌకర్యం వలన చాలా మేలు జరుగుతుందని ఆంధ్ర రాజధాని కి వెళ్లడానికి విజయవాడ ఆసుపత్రికి వెళ్లడానికి సత్తుపల్లి బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇటీవల వరదకు కాజ్వే వద్ద ప్రమాధకరంగా మారడంతో బస్సు సౌకర్యం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై స్పందించిన తుమ్మల వెంటనే మంత్రి సారథి కి ఫోన్ చేసి స్థానిక పరిస్థితులను వివరించారు. సరిహద్దు ప్రాంతంలో రాకపోకల కోసం హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. మంత్రి సారథి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ అచ్చిన నరసింహులు నీటి సంఘం మాజీ అధ్యక్షులు నరుకుళ్ళరవి వెదుళ్ళ వేంకటేశ్వరరావు ,నాగరాజు పలగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story : సారధి గారు తమ్మిలేరుపై హై లెవెల్ కాజ్వే నిర్మించండి..!)