ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసిన బేబీ నాయన
పారాది వంతెనకు నిధులు మంజూరు కోసం వినతి
న్యూస్‌తెలుగు/విజయనగరం :
రెండు రాష్ట్రాలను మరియు రెండు జిల్లాలను అనుసంధానం చేసే వేగావతి నది మీద పారాది బ్రిడ్జి త్వర తగిన పూర్తి చేయాడానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ బొబ్బిలి శాసన సభ్యులు ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ని సోమవారం కలిసి ఒక నివేదిక అందజేశారు. అదే విధంగా బొబ్బిలి- తెర్లాం రోడ్డు , పినపెంకి-ఆకులకట్ట రోడ్డు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రివర్యులకు వినతి పత్రం సమర్పించడం జరిగిందని శాసన సభ్యులు తెలిపారు. (Story :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసిన బేబీ నాయన)