ఇనార్బిట్ మాల్లో ‘రోస్సో బ్రూనెల్లో’ స్టోర్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: లగ్జరీ ఫుట్‌వేర్, యాక్సెసరీస్ కు ప్రసిద్ధి చెందిన ‘రోస్సో బ్రూనెల్లో’ స్టోర్‌ను హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రోస్సో బ్రూనెల్లో లెదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సాహిల్ మాలిక్ మాట్లాడుతూ లెదర్ ఫుట్‌వేర్ అందించడంలో ఎన్నో ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నామన్నారు. రోస్సో బ్రూనెల్లో బూట్లు పరిపూర్ణమైనవన్నారు. ఇవి ఇటాలియన్ సంప్రదాయంలో ఉంటాయన్నారు. డిజైన్లు అధునాతనతనకు చిరునామాగా చెప్పవచ్చన్నారు. ఆధునికతకు క్లాసిక్ శైలి మిళితమన్నారు. ఈ బూట్లు చేతితో తయారు చేయబడినవన్నారు. నాణ్యతకు మారుపేరని, ఎంతో సౌకర్యంగా ఉంటాయని చెప్పారు. (Story : ఇనార్బిట్ మాల్లో ‘రోస్సో బ్రూనెల్లో’ స్టోర్ ప్రారంభం)