భారత్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ప్రారంభించిన పీఎన్‌బీ మెట్‌లైఫ్
న్యూస్‌తెలుగు/ముంబయి: పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారత్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీకి చెందిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూలిప్) విభాగంలోనే ఒక కొత్త ఫండ్ ఆప్షన్. భారత్‌లో దూసుకెళ్తున్న తయారీ రంగంలో పెట్టుబడి పెట్టే ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని పాలసీదారులకు ఈ ఫండ్ అందిస్తుంది, అలాగే కొత్త ఫండ్ ప్రారంభ వ్యవధి అయిన 2024 ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 15 వరకు రూ.10 ప్రారంభ యూనిట్ ధర చొప్పున ఇది అందుబాటులో ఉంటుంది. పీఎన్‌బీ మెట్‌లైఫ్ గోల్ ఎన్సూరింగ్ మల్టిప్లయర్, పీఎన్‌బీ మెట్‌లైఫ్ స్మార్ట్ ప్లాటినం ప్లస్, ఇంకా పీఎన్‌బీ మెట్‌లైఫ్ మేరా వెల్త్ ప్లాన్ సహా, ఇప్పటికే ఉన్న వివిధ రకాల పీఎన్‌బీ మెట్‌లైఫ్ యూలిప్‌ల ద్వారా కస్టమర్లు ఈ భారత్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ యూలిప్‌లు సమగ్రమైన ప్రయోజనాలను గుదిగుచ్చి అందిస్తాయి, ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత, అనువైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, ఇంకా వ్యక్తిగతీకరించిన సంపద సృష్టి పరిష్కారాలు కూడా ఉంటాయి. (Story : భారత్ మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ప్రారంభించిన పీఎన్‌బీ మెట్‌లైఫ్)