చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తా
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నేత కార్మికులతో కలిసి చేనేత దినోత్సవాన్నీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో చేనేతరంగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సోమవారం అధికారులు చేనేత వస్త్రాలను ధరించే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో ఉత్పత్తి చేసిన చేనేత చీరలను కలెక్టరేట్లో ప్రదర్శనకు ఉంచే విధంగా సూచిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. అన్ని పారిశ్రామిక సంఘం వెల్టురు కు రూ. 20,04,410 ల పావుల వడ్డీ సబ్సిడీ చెక్కును అందజేసారు.
అనంతరం చేనేత దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనపరిచిన కొత్తకోట విద్యార్థులకు, చేనేత కార్మికులకు ప్రశంసా పత్రాలు, మెమొంటొ లతో సత్కరించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, పి.డి.డి.ఆర్డీవో ఉమాదేవి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యమ్మ, అడిషనల్ డి.ఆర్.డి. ఒ సెర్ప్ భీమయ్య, చేనేత కార్మికులు, గెలుపొందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తా)