UA-35385725-1 UA-35385725-1

ముస్లిం మైనార్టీ హక్కుల సాధన కోసం ఉద్యమించాలి

ముస్లిం మైనార్టీ హక్కుల సాధన కోసం ఉద్యమించాలి

– 10న నంద్యాలలో మైనార్టీ హక్కుల మహా గర్జనను విజయవంతం చేయండి
– రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా

నంద్యాల (న్యూస్ తెలుగు): అనాదిగా అన్ని రంగాల్లో వివక్షతకు గురవుతూ పేదరికంలో మగ్గుతున్న మైనార్టీ వర్గాల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణ శివారు ఎస్ఆర్బిసి రహదారిలో ఉన్న హరున్ ఫంక్షన్ హాల్ లో మహబూబ్ బాషాతో పాటు ఎంఆర్పిఎఫ్ యూత్ రాష్ట్ర అధ్యక్షులు షోయబుద్దీన్ ఖాద్రితో పాటు ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్, మిల్లి కౌన్సిల్ ఉపాధ్యక్షులు ఉస్మాన్ భాష, డెమొక్రటిక్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్, ఎంఆర్పిఎఫ్ కోశాధికారి సయ్యద్ షా ముర్తుజా ఖాద్రి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఖాదర్ బాష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ వర్గాల హక్కుల సాధన కోసం నంద్యాలలో ఈ నెల 10న ముస్లిం మైనార్టీల హక్కుల మహా గర్జనకు వేలాది గా రావాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకు చెందిన వక్స్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ ఇక్యమత్యంగా పోరాడుదామన్నారు.రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు చెందిన సుమారు 66 వేల ఎకరాల భూములు వున్నా సగం భూ కబ్జాదారుల కబందహస్తల్లో నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూల్ జిల్లాలో సుమారు 30 వేల భూములు, విలువైన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాజకీయ పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంక్ గా గుర్తించి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. మైనార్టీలకు కంటి తుడుపు చర్యగా అధికారాలు లేని శాఖలు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారని, ముస్లిం మైనార్టీలు ఇప్పటికైనా మేల్కొని మన హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మా ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.ఆంధ్రప్రదేశ లో 66 వేల ఎకరాలకు పైగా ఉన్న వాక్స్ భూములు రక్షించాలని, అన్యాక్రాంతమయిన భూములను పరిరక్షణ చేసి పేద ముస్లిం మైనార్టీలకు పంపిణీ చేయాలన్నారు. వక్స్ బోర్డ్ కు చెందిన స్థలాల్లో షాపింగ్ మాల్స్,కాంప్లెక్స్ లు నిర్మించి ముస్లిం మైనార్టీలకు లీజుకు ఇవ్వాలన్నారు.ప్రత్యేక ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించాలని, పేద ముస్లింలకు రుణ సదుపాయం కల్పించాలని, దేశ, విదేశీ చదువుల కోసం ఆర్థిక సహాయంతో పాటు స్కాలర్ షిప్స్ ఇవ్వాలన్నారు. షాదీ ముబారక్, పండుగ తొఫా పథకాలు అందించాలన్నారు. ఉర్దూ యూనివర్సిటీలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.ప్రతి జిల్లాలో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కర్నూల్ లో శిధిలావస్థలో వున్న యునాని కాలేజీ అభివృద్ధికి నిధులు కేటాయించి భవనాలు నిర్మించాలన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు గుర్తించడానికి గ్రూప్ వన్ స్థాయి అధికారిని నియమించి జుడిషియల్ అధికారాలు కల్పించాలని కోరారు. రాజకీయ పార్టీలు ఎంపి, ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. అధికార పార్టీలు ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన నేతలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్గిన మంత్రిత్వ శాఖలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. (Story: ముస్లిం మైనార్టీ హక్కుల సాధన కోసం ఉద్యమించాలి)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1