ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి
న్యూస్‌తెలుగు\వీపనగండ్ల :సిపిఎం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో వీపనగండ్ల గ్రామానికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మండలంలో ఉన్న ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి మాట్లాడుతూ సింగోటం గోపాల్ది నా లింకు కెనాల్ భూ నిర్వాసితులకు ఎకరాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు కోరారు, గ్రామంలోడ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, వీధిలైట్లు వెలగడం లేదని, ప్రభుత్వ స్కూల్లో టీచర్స్ లేక విద్యార్థులు ఆందోళనలో గురవుతున్నారని, వెంటనే టీచర్స్ ను నియమించాలని, ప్రభుత్వ హాస్పిటల్ లో సరైన డాక్టర్స్,సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు గురవుతున్నారని, మీరు స్పందించి డాక్టర్స్, సిబ్బందిని నియమించాలని కోరారు. గోపాల్ దీన్నే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, పాసుబుక్కు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలి, అర్హులైన వారికి పింఛన్లు,రేషన్ కార్డులు ఇవ్వాలి . మంత్రి గారు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి, మండల నాయకుడు సర్పంచ్ ఆరు మౌలాలి, మండల నాయకులు రామచంద్రయ్య గౌడ్, రాముడు,ముత్యాలు సిహెచ్ వెంకటయ్య, ఆశన్న, ఈశ్వర్, రామకృష్ణ, లక్ష్మణ్, వీపనగండ్ల ప్రజలు పాల్గొన్నారు. (Story :ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి)