UA-35385725-1 UA-35385725-1

వైఎస్‌ వివేకా హత్య కేసులో మరో మలుపు!

వైఎస్‌ వివేకా హత్య కేసులో మరో మలుపు!

సీబీఐకి కీలక వాంగ్మూలమిచ్చిన వైఎస్‌ సునీత

హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా వివేకా కుమార్తె సునీత సీబీఐకి తన వాంగ్మూలాన్ని మరోసారి ఇచ్చారు. ఇప్పటికే నాలుగుసార్లు సీబీఐ విచారణలో పాల్గొని పలు విషయాలను వెల్లడిరచిన సునీత ఈ కేసులో మొదట్నించీ పోరాడుతున్న విషయం తెల్సిందే. శనివారంనాడు సీబీఐ విచారణకు వెళ్లిన సునీత ఈసారి అధికారుల వద్ద సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. హత్య జరిగిన ఏడు రోజుల తర్వాత (2019 మార్చి 22న) వైఎస్‌ భారతి తనకు ఫోన్‌ చేసి ఇంటికి వస్తానని చెప్పిందని, తాను కడప, సైబరాబాద్‌ కమిషనరేట్‌లకు వెళ్తున్నట్లు చెప్పినప్పటికీ, ఆమె ఎక్కువ సమయం తీసుకోనంటూ వచ్చేసిందని సునీత సీబీఐకి వివరించింది. తాను బయలుదేరి లిఫ్ట్‌ దగ్గర ఉన్న సమయంలోనే భారతి అనూహ్యంగా అక్కడ కన్పించిందని, ఆమెతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్‌ విజయమ్మ, అనిల్‌రెడ్డిలు కూడా రావడంతో ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అయితే అప్పటికే వాళ్లంతా చాలా డిస్టర్బ్‌గా వున్నట్లు కన్పించారని గుర్తుచేశారు. నాన్నగారు చనిపోయాక తొలిసారి ఇంటికి వచ్చినందుకు బాధగా వున్నారని అనుకున్నానని, కానీ ఈ కేసుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, పరిణామాలు ఏమి జరిగినా ఇకముందు సజ్జలకు తెలియజేయాలని, ఆయనను సంప్రదిస్తూ వుండాలని వైఎస్‌ భారతి తనకు గట్టిగా చెప్పారని వివరించారు. కేసు విషయంలో ఒకసారి మీడియాతో మాట్లాడుదామని కూడా సజ్జల ఆ సందర్భంలో తెలియజేశారన్నారు. సజ్జల ఆలోచన తనకు కాస్త ఇబ్బందికి ఉన్నట్టు అన్పించి తాను ఆయనకు ఒక వీడియో చేసి పంపించానని, హత్య జరిగిన తర్వాత గదిని శుభ్రం చేసేటప్పుడు సీఐ శంకరయ్య ప్రవర్తన అనుమానంగా వుందని పేర్కొంటూ ఆ వీడియోను సజ్జలకు పంపించానని సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. వీడియో కాకుండా ఈ అంశానికి ముగింపు పలికేలా ఒక ప్రెస్‌మీట్‌ పెట్టాలని, అలాగే ఆ ప్రెస్‌మీట్‌లో జగనన్న, అవినాష్‌రెడ్డిల పేర్లను కూడా ప్రస్తావించాలని సజ్జల కోరినట్లు తెలిపారు. వాళ్ల పాత్ర ఈ ఏమీ లేదన్నట్లుగా ఆ ప్రస్తావన వుండాలన్నది సజ్జల అభిప్రాయం కావచ్చని సునీత వాంగ్మూలంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదిలావుండగా, సునీత వాంగ్మూలంతో కూడిన ఛార్జిషీటును సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. (Story: వైఎస్‌ వివేకా హత్య కేసులో మరో మలుపు!)

News on YouTube

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1