UA-35385725-1 UA-35385725-1

బిసిల చరిత్రలో సువర్ణాధ్యాయం బిసి డిక్లరేషన్

బిసిల చరిత్రలో సువర్ణాధ్యాయం బిసి డిక్లరేషన్

రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పెదవేగి (న్యూస్ తెలుగు): బిసిలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు – సమాజానికి వెన్నుముక వంటి వారు అని గుర్తించి, సామాజిక ఆర్థిక రంగాలతో పాటు వారిని రాజకీయంగా కూడా అత్యుత్తమ ప్రాధాన్యత కల్పించిన ఏకైక పార్టీ తెదేపా అని, తెలుగుదేశం జనసేన కూటమి సంయుక్తంగా ప్రకటించిన “బిసి డిక్లరేషన్” రాష్ట్రంలోని మొత్తం 153 వర్గాలకు చెందిన బిసి కుటుంబాల సంక్షేమ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబోతుందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గుంటూరులో జరిగిన జయహో బిసి కార్యక్రమంలో టిడిపి జనసేన కూటమి సంయుక్తంగా ప్రకటించిన బిసి డిక్లరేషన్ పై దుగ్గిరాలలోని నియోజక వర్గ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.
ఈ సందర్భగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, ” బీసీ డిక్లరేషన్ ఏమీ ఆషామాషీగా తీసుకురాలేదని, గత మూడేళ్లుగా 153 కులాలను 56 సాధికార కమిటీలుగా విభజించి, అన్ని ప్రాంతాల్లో 800 సమావేశాలు నిర్వహించామని తెలిపారు. అనేక మంది నాయకులతో, ప్రజాసంఘాలతో చర్చించి, లోకేశ్ చేసిన యువగళం పాదయాత్రలో గమనించిన ఎన్నో అంశాలను, బిసి వర్గాల కష్టాలపై పవన్ కళ్యాణ్ రూపొందించిన నివేదికలను కూడా అధ్యయనం చేసి బిసి డిక్లరేషన్ తెచ్చారని చెప్పారు. బిసిల కుటుంబాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి చర్చించి బిసి డిక్లరేషన్ ని రూపొందించారని తెలిపారు.
40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెదేపా అని, మరోసారి బిసిలకు మేలు చేస్తూ పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చామన్నారు. తొలిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించి, ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేసి రాజకీయ నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీయని, ఈ కార్యాచరణతోనే బిసిల నుంచి అనేకమంది సమర్థవంతమైన నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎదిగారని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. బిసిలకు 50ఏళ్లకే ఫించన్ అందించనున్నామని, ఇది బిసి వర్గాల కుటుంబాలకు ఎంతో చేదోడుగా నిలివనుందని చింతమనేని తెలిపారు. ఫించన్లు పెంచుతామని ప్రజలను జగన్ దగా చేశారని, కానీ టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే పెన్షన్ ను రూ.4 వేలు చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు.వైసిపి ప్రభుత్వంలో 300 మంది బీసీలను చంపారాని, బిసిలపై దాడులు పెరిగి పోయాయని, కొన్ని వేల మందిపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టారనీ అన్నారు. రాజకీయంగా ఎదుగుతున్న బీసీలను అణచివేసే ధోరణికి ఈ చట్టంతో అడ్డుకట్ట వేస్తామని, ఎస్సీ, ఎస్టీలకు చట్టం ద్వారా ఎలా రక్షణ ఉందో, అదే విధంగా బీసీల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్త అనే విధంగా ఈ చట్టం ద్వారా ప్రత్యేక రక్షణ కల్పిస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
బీసీలు పరిశ్రమలు పెట్టాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు పెట్టాలన్నా ప్రోత్సహిస్తూ, ఐదేళ్లలో కనీసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించటం ఎంతో శుభ సూచకం అన్నారు. గతంలో టిడిపి హయాంలో తీసుకువచ్చిన అన్ని విద్యా పథకాలను పునరుద్ధరించనున్నట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
చంద్రన్న బీమా మళ్లీ తేసుకురాబోతున్నమని, గతంలో ఎవరైనా చనిపోతే చంద్రన్న భీమా ద్వారా మట్టి ఖర్చులే కాకుండా ఇంటికి రూ.5 లక్షలు వరకు పంపి అదుకునే వాళ్ళం అని, బీసీల కోసం చంద్రన్న బీమా పథకం కింద రూ.10 లక్షలు ఇస్తామని, పెళ్లి కానుక మళ్లీ ప్రారంభించి, ఎవరు పెళ్లి చేసుకున్నా రూ.1 లక్ష ఇచ్చే బాధ్యతను టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందనీ,శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
బిసి డిక్లరేషన్లో ప్రకటించిన 10సూత్రాలు రాబోయే రోజుల్లో బిసి కుటుంబాలకు ఒక గొప్ప సంక్షేమాన్ని, సమాజంలో మరింత గౌరవాన్ని అందిస్తూ, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తుని అందించనున్నట్లు చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
టిడిపి జనసేన సంయుక్తంగా ప్రకటించిన ఇంత గొప్ప బిసి డిక్లరేషన్ నీ నాయకులు, కార్యకర్తలు సగర్వంగా ప్రతి ఒక్క బిసి ఇంటికి తీసుకు వెళ్లి వివరించాలని చింతమనేని ప్రభాకర్ పార్టీ శ్రేణులకు సూచించారు. (Story: బిసిల చరిత్రలో సువర్ణాధ్యాయం బిసి డిక్లరేషన్)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1