UA-35385725-1 UA-35385725-1

బిసిలకు అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ తెదేపా

బిసిలకు అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ తెదేపా

చింతమనేని ప్రభాకర్

పెదపాడు (న్యూస్ తెలుగు): బిసిలకు సామాజికపరంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా అండగా ఉండటంతో పాటు, రాజ్యాధికారంలో సైతం సముచిత ప్రాధాన్యత కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. గుంటూరు జిల్లా లోని నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జయహో బీసీ కార్యక్రమానికి చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంకి చెందిన బీసీ నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. పెదపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద జయహో బిసి కార్యక్రమంలో పాల్గొనటానికి సుమారు 200 కార్లలో తరలి వెళ్తున్న దెందులూరు నియోజక వర్గ బిసి నాయకుల భారీ ర్యాలీనీ చింతమనేని ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే రాష్ట్రంలోని బీసీలకు తగిన గుర్తింపు లభించిందని, బీసీలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు హయాంలో ప్రవేశపెట్టడం జరిగిందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, బీసీ నాయకులను తప్పుడు కేసులతో ప్రభుత్వం వేధిస్తూ బీసీలను అడగదొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేసిందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.టిడిపి జనసేన కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని కూడా చింతమనేని తెలిపారు.
జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా గుంటూరులో జరుగుతున్న కార్యక్రమానికి హాజరై తిరిగివచ్చిన దెందులూరు నియోజకవర్గ బీసీ నాయకులకు దుగ్గిరాలలోని నియోజక వర్గ కార్యాలయం వద్ద రాత్రి భోజన ఏర్పాట్లను చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీల అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, బొప్పన సుధా, మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లు బాబు), సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇంచార్జీ లు గుత్తా అనిల్, బొడ్డేటి మోహన్, నేతల రవి, ఐనాల నారాయణ, కొనకళ్ళ శివమణి గౌడ్, పార్టీ నాయకులు కొత్తూరు చినబాబు,విశ్వనాథం సహా పలువురు బిసి సంఘం నాయకులు పాల్గొన్నారు. (Story: బిసిలకు అన్ని విధాలా అండగా నిలిచిన పార్టీ తెదేపా)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1