UA-35385725-1 UA-35385725-1

పొత్తు గెలవాలి.. వైసిపి పోవాలి

పొత్తు గెలవాలి.. వైసిపి పోవాలి

టిడిపి-జనసేన విజయం ఖాయం

తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ

ఏలూరు (న్యూస్ తెలుగు) : పొత్తు గెలవాలని.. వైసిపి పోవాలని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
జాలా బాలాజీ స్థానిక మూడవ డివిజన్ నవాబ్ పేట కాలనీలో ఓటర్ పరిశీలన, సూపర్ సిక్స్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూమూడు రాజధానుల ముక్కలాటతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడని విమర్శించారు. అమరావతి ఐదు కోట్ల మంది ఆంధ్రుల సంపదని, దానిని నిర్వీర్యం చేసే దాక జగన్ రెడ్డి నిద్ర పోలేదన్నారు. వ్యవస్థలను సరిగా నడపలేక , పరిపాలన గాలికి వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను సరైన దారిలో పెట్టి, గాడి తప్పిన పాలన సరిచేయాలంటే విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. లేకపోతే రాష్ట్ర అధోగతి పాలవుతుందన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో, ఎవరి పాలనలో దోపిడీ జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. బంగారు రాష్ట్రాన్ని బస్మాసురలు నాశనం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. టిడిపి, జనసేన అధికారం చేపట్టిన తరువాత అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టిడిపి,జనసేన త్యాగాలకు సిద్ధపడి విజయం కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు. టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడినప్పుడే విజయం ఖాయం అయ్యిందన్నారు.టిడిపి, జనసేన అభ్యర్థులను గెలిపించి మన భవిష్యత్తుని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ జాలా సుమతి బాలాజీ, షేక్ రిజ్వానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు. Story: పొత్తు గెలవాలి.. వైసిపి పోవాలి)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1