సత్య కళాశాలలో ధ్యానంపై క్లాస్
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్ధానిక తోట పాలెం లో గల సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం – 2024 ను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్న తరుణంలో ధ్యానంపై క్లాస్ ను నిర్వహించటం జరిగింది. ఈ క్లాసును పిరమిడ్ ధ్యానం ను గత 13 సంవత్సరాలుగా అనుసరిస్తున్న అశ్వనీ తీసుకున్నారు.
ధ్యానం ఎలా చేయాలో మెళుకువలు నేర్పించి విద్యార్థులతో ఒక 30 నిముషాలు ధ్యానం చేయించారు. ఇలా 21 రోజులు ప్రయత్నిస్తే ప్రశాంతంగా ధ్యానం చేయటం అలవాటు అవుతుందని అన్నారు. దీని వలన ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని వారు ఏది అనుకుంటే అది సాధించ గలరని అన్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మానవుడు ఎంతో ఉన్నతంగా తయారవుతాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవమణి, పిరమిడ్ ధ్యాన అనుచరులు శ్రీరామకృష్ణ, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. (Story: సత్య కళాశాలలో ధ్యానంపై క్లాస్)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!