UA-35385725-1 UA-35385725-1

చంద్రబాబు, పవన్ క‌ల‌యిక రాష్ట్ర అభివృద్ధి కోసమే!

చంద్రబాబు, పవన్ క‌ల‌యిక రాష్ట్ర అభివృద్ధి కోసమే!

జనసేన నాయకుడు మాజీ మంత్రి కొత్తపల్లి

మొగల్తూరు (న్యూస్ తెలుగు): రాష్ట్ర అభివృద్ధి కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా పోటీ చేస్తున్నారని జనసేన నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. గురువారం నవ్వుల్తురు టి ఆర్ కె కార్ బజార్ లో విలేకరులతో మాట్లాడుతూ టిడిపి జనసేన కూటమి తాడేపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతమైందని ఆ సభను చూసి వైసిపి మాజీమంత్రి పేర్ని నానికు అంత భయం ఎందుకని ప్రశ్నించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని, పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు లేని ఇబ్బంది వైసీపీ నాయకులకు ఏమిటని అన్నారు. పవన్ కళ్యాణ్ జెండాలు మోయిస్తున్నారు అనే ముందు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల జెండాలు మీరు మోసిన రోజులు గుర్తు చేసుకోవాలన్నారు. మీ సొంత పార్లమెంట్ సభ్యుడు మీ పార్టీకి ఎందుకు దూరమయ్యాడో మీరు చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు లేవని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తప్పేమిటని ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందనన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మీ ఐదేళ్ల పాలనలో పోలవరంతో సహా రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారన్నారు. పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకుంటే మీకు ఎందుకు 23 సీట్లు తీసుకుంటే మీకెందుకు నామినేషన్ల సమయానికి మీ పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులు ఉంటారో లేదో చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంకె రామకృష్ణ, బర్రె రామస్వామి, దంపనబోయిన సత్యనారాయణ, దేశంశెట్టి శ్రీనివాస్, మైలబత్తుల రాంబాబు, దొంగ స్వామి, ముక్కు పుల్లయ్య నాయుడు, మెండె రాజేష్, దాసరి నాగరాజు, గుడాల చింతన్న, తదితరులు ఉన్నారు. (Story: చంద్రబాబు, పవన్ క‌ల‌యిక రాష్ట్ర అభివృద్ధి కోసమే!)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1