అన్నదాత అభ్యున్నతికి అందరం కలిసి పని చేద్దాం
న్యూస్‌తెలుగు/వనపర్తి: అన్నదాతల శ్రేయస్సు, అభివృద్దే, ధ్యేయంగా ప్రతి ఒక్కరం పని చేద్దామని రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు మూడు గంటల సమయాన్ని కేటాయించి వారి సమస్యలను పరిష్కరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి మార్కెట్ యార్డులో నూతనంగా నియమితులైన అధ్యక్ష ఉపాధ్యక్ష డైరెక్టర్ ల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు రైతు శ్రేయస్సునే పరమావధిగా భావించి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారని గురువారం మధ్యాహ్నం నాటికి లక్ష రూపాయల వరకు రుణాలున్న ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు మొదటి వారంలో రూ . లక్ష యాభై రెండో వారం 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని రైతులెవ్వరు అధైర్య పడకూడదని రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు రుణమాఫీ అమలు అవుతుందా అన్న కొందరు నాయకులకు రేపు మధ్యాహ్నం లోగా సమాధానం దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఆగస్టు 15వ తేదీ లోపే అందరూ రైతులకు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద కాలువలకు తూముల ఏర్పాటు చేసి మేమే నీళ్లు తీసుకువచ్చామన్న విధంగా ప్రచారం చేసిన గత పాలకులకు 70 ఏళ్ల చరిత్రలో రైతు శ్రేయస్సు కోసం కట్టిన నాగార్జునసాగర్ కోయిల్ సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు సరళ సాగర్ జూరాల లాంటి ఎన్నో ప్రాజెక్టులు సమాధానం చెబుతాయని ఆయన అన్నారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన ఒకే ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయిన సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు
ప్రజా ప్రతినిధులుగా తాము అనుభవిస్తున్న పదవులన్నీ నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష అని వారి శ్రేయస్సు కోసం పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొదట ఆయన మార్కెట్ యార్డ్ నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారి ఛాంబర్ లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డైరెక్టర్లు అందరిని శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : అన్నదాత అభ్యున్నతికి అందరం కలిసి పని చేద్దాం)