UA-35385725-1 UA-35385725-1

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి

ఎర్రకాలువ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అధునీకరణ పనులు చేపట్టాలి
ఎంపి ల్యాడ్స్ నిధులు పూర్తిగా వినియోగం కావాలి
మంజూరైన అన్ని పనులు వేగవంతంగా పూర్తిచేయాలి
వందే భారత్ రైలు ఏలూరులో హాల్ట్ కు రైల్వే అధికారులకు అభ్యర్ధన
ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్
ఏలూరు (న్యూస్ తెలుగు): ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతగా చేపట్టిన అన్ని కార్యక్రమాలు అధికారులు సమర్ధవంతంగా అమలు చేసి లక్షితప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా చేరేలా చూడాలని ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్ కోరారు.మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపి కోటగిరి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాల అమలుపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తో కలిసి ఈ  సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వివిధ పధకాలు జిల్లాలో అమలు జరుగుతున్న తీరు, ప్రగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా ఎంపి కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న ఆరోగ్య, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సమగ్రంగా అందేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషిచేయాలన్నారు.  ఎర్రకాలువ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కు సంబంధించి వాల్స్ రిపేర్, అధనపు గేట్ల అమరిక, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు చేపట్టేందుకు జనవనరుల శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లా కేంద్రమైన ఏలూరు రైల్వే స్టేషన్ లో వందేబారత్ రైలు నిలుపుదల విషయంపై ఇప్పటికే ఢిల్లీలోని రైల్వేబోర్డ్ చైర్మన్ ను కోరడం జరిగిందని ఈ విషయంపై  సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు.  ప్రధాన మంత్రి పసల భీమా యోజన-వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా కింద 2022 ఖరీఫ్ లో 3వేల 622 మంది రైతులకు రూ. 2.41 కోట్లు, 2023 ఖరీఫ్ లో 5 వేల 964 మంది రైతులకు రూ. 10.65 కోట్లు అందించడం జరిగిందన్నారు.  జిల్లాలో 10 వేల 842 భూసార పరీక్షా కార్డులు పంపిణీ చేశారన్నారు.  ప్రధాన మంత్రి ఉజ్వలయోజన కింద వికసిత్ సంకల్ప భారత్ యాత్రలో 16 వేల గ్యాస్ కనెక్షన్లతోపాటు కొత్తగా 22 వేలు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారన్నారు.  జిల్లాలో ఇంతవరకు 3.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారన్నారు.  జిల్లాలోప్రతి నెలా 2,72,843 మందికి రూ. 81.502 కోట్లు పెన్షన్లుగా అందించడం జరుగుతున్నదన్నారు.  జిల్లాలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రధాన దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ ద్వారా జిల్లాలో ఇంటింటికి కుళాయిల ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించే కార్యక్రమాన్ని సమీక్షించారు.  ఎంపి ల్యాడ్స్ నిధులతో జిల్లాలో మంజూరు చేసిన వివిధ నిర్మాణ అభివృద్ధి పనులను రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆయన కోరారు. జిల్లాలో గృహనిర్మాణం, స్వామిత, మధ్యాహ్నం భోజన పధకం అమలు, శానిటేషన్, నూట్రిషన్, అంశాలపై ఆయన సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఉపాధిహామీకి సంబంధించి పాత పనులన్నింటిని వేగవంతంగా పూర్తిచేయాలని అందుకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ రెండు రోజుల్లో అప్ లోడ్ చేయాలని పంచాయితీరాజ్ ఎస్ఇని కలెక్టర్ ఆదేశించారు.  బిల్లులుచెల్లింపులు జరుగుతున్నందున ఎటువంటి జాప్యం లేకుండా సంబంధిత పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని పంచాయితీరాజ్, ఆర్ డబ్లూఎస్ అధికారులను ఆదేశించారు.  ఎంపి ల్యాడ్స్ తో చేపట్టిన పనులకు సంబందించి అగ్రిమెంట్ పిరియడ్ లోపు పూర్తి చేసేలా  గట్టి చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎటువంటి గడువుకు ఆస్కారం ఇవ్వరాదని ఆయన స్పష్టం చేశారు.జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఉజ్వలయోజన కింద గ్యాస్ కనెక్షన్ల పంపిణీ, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ అంశాలపై సంబంధిత అధికారులనుండి సమాచారం రాబట్టారు.
సమావేశంలో జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, దిశ కమిటీ సభ్యులు ఉంగుటూరు ఎంపిపి ఘంటా శ్రీలక్ష్మీ, చింతలపూడి ఎంపిపి డా. బి.రాంబాబు, కైకలూరు సర్పంచ్ వి.వసంతకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story: సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1