UA-35385725-1 UA-35385725-1

తాడేపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతం చేయండి

తాడేపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతం చేయండి

తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పిలుపు

ఏలూరు (న్యూస్ తెలుగు): నేడు తాడేపల్లిగూడెంలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని తేదేపా ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి మూడవ డివిజన్ కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు,సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని విమర్శించారు. ఉద్యోగ కల్పన లేక యువత మద్యం, డ్రగ్స్, గంజాయి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వెలిబుచ్చారు. జగన్ పాలనలో మద్యం రేట్లను మూడు రెట్లు పెంచి నాసిరకం మద్యంతో
లక్ష కోట్ల ఆదాయం తాడేపల్లి ప్యాలెస్ కు మళ్లించాడని ఆరోపించారు. అత్యాచారాలు, నేరాలు పెరిగి పోయాయన్నారు.రాష్ట్రంలో నాలుగు లక్షల బెల్టుషాపులు, మొబైల్ షాపులతో మద్యం అక్రమ వ్యాపారం యదేచ్ఛగా కొనసాగుతుందన్నారు. సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని గత ఎన్నికల్లో వాగ్ధానం చేసిన జగన్అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలను ఒక ఉద్యమంలా చేపట్టాడని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడురెట్లు ధరలు పెంచి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి సుమారు రూ.40 వేల కోట్లు అప్పుతెచ్చాడని ఆరోపించారు. రాబోయే 25 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం
మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. మహిళల మాంగల్యాలు నిలవాలంటే జగన్ పోవాలి, చంద్రబాబు రావాలని ఇందుకోసం ప్రతి టిడిపి కార్యకర్త, జన సైనికులు ఎన్నికలలో అలుపెరగకుండా శ్రమించి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి మూడవ డివిజన్ అధ్యక్షులు చనపతి వెంకటరమణ, నాగు, యు. రూపేష్, పట్నాల మోహన్, సరిపల్లి పెద్దిరాజు, బోను లోకేష్, రవి, వీర బత్తిన రత్న తదితరులు పాల్గొన్నారు. (Story: తాడేపల్లిగూడెం బహిరంగ సభ విజయవంతం చేయండి)

See Also

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1