ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం
వనపర్తి (న్యూస్ తెలుగు) : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 62 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సీపీవో జే వెంకట రమణ, జడ్పీ సీఈవో యాదయ్య, జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story: ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!