గట్టుకాడిపల్లి బ్రహ్మోత్సవాలలో నిరంజన్ రెడ్డి, రావుల
వనపర్తి (న్యూస్ తెలుగు) : వనపర్తి జిల్లా ఘనపూర్ మండలానికి చెందిన గట్టుకాడిపల్లి అల్మేర్ మంగ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ,మాజీ ఎం.పి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.వీరికి ఆలయ కమిటీ,పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గట్టుకాడిపల్లి వేంకటేశ్వర స్వామి మహిమానితులని ఈ ఆలయ అభివృద్ధికి సహకారం అందించామని రాబోవు రోజులలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు.అనంతరం జాతరలోరావుల చంద్రశేఖర్ రెడ్డి మిఠాయిలు పంచి నాయకులను, కార్యకర్తలను ఉత్సహపరిచారు. ఈకార్యక్రమంలో పురోహితులు శేషచారి, ఎం.పి.పి కృష్ణ నాయక్, సర్పంచులు వెంకట రమణ, దేవేందర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, సింగిల్ విండో ఛైర్మెన్ మురళిదర్ రెడ్డి, సత్యం, పెద్ద ఆంజనేయులు గౌడ్,చిన్న ఆంజనేయులు గౌడ్, బాలస్వామి, అమరేందర్, మల్లేష్ గౌడ్, ప్రతాప్,శరత్ తదితరులు పాల్గొన్నారు. (Story: గట్టుకాడిపల్లి బ్రహ్మోత్సవాలలో నిరంజన్ రెడ్డి, రావుల)
See Also:
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!