అమ్మవారి ఆలయంలో సిరి సహస్ర లక్ష కుంకుమార్చన
నెల్లిమర్ల (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం , పెద్దబూరాడపేట గ్రామంలో మాఘ పౌర్ణమి సందర్భంగా జరుగు లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్ఆర్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) పాల్గొని కుంకుమ పూజలు చేసారు. తదననంతరం అక్కడ ఉన్న దక్షిణామూర్తిని దర్శించారు . ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సిరమ్మకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయనగరం జిల్లా వాసులకు మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజాలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బాల త్రిపురా సుందరి అమ్మవారిని ఆమె ప్రార్ధించారు. ఆమె రాకను తెలుసున్న పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె వారితో కరచాలనం చేసి సంతోషంగా గడిపారు. వారు చూపిన ప్రేమాభి మానాలకు సిరిసహస్ర ఎంతో ముగ్ధులయ్యారు. తదనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదం వితరణ చేసారు. (Story: అమ్మవారి ఆలయంలో సిరి సహస్ర లక్ష కుంకుమార్చన)
See Also:
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!