అసెంబ్లీలో మెగా డిఎస్సీపై తీర్మానం చేయాలి
డివైఎఫ్ఐ డిమాండ్
విజయనగరం (న్యూస్‌తెలుగు): మెగా డిఎస్సీ25వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద నుండి ర్యాలీగా ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్ హరీష్ అధ్యక్షతన నిర్వహించి అనంతరం కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న ,రాష్ట్ర ఉపాధ్యక్షులు పి ఎస్ ఎన .రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డిఎస్సీ ,ఇదిగో డిఎస్సీ రాష్ట్రంలో 1.88లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1. 69లక్షలు మాత్రమే ఉన్నారని దాదాపు 18,520 ఖాళీగా ఉన్నాయని, ఇవే కాక ఈనెల చివరి నాటికి మరో 5వేలమంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. కేంద్రం చేబుతున్న లెక్కలు ప్రకారం 40వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117జీవో పేరుతో మరో 10వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మిడియం తీసివేసి 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. జగనన్న ప్రభుత్వంలో 2వేల పాఠశాలలు మూసివేసిందని, ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 9వేలు ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
జిల్లా అధ్యక్షులు సిహెచ్ హరీష్, ఉపాధ్యక్షులు.సతీష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాపౌట్ కావడం లేదా ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ అవ్వడం జరుగుతుందని, దాదాపు రెండేళ్లలో 6లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాపౌట్ అయ్యారని గుర్తుచేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించాలని, లేని పక్షంలో ఈ కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. (Story: అసెంబ్లీలో మెగా డిఎస్సీపై తీర్మానం చేయాలి)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2