UA-35385725-1 UA-35385725-1

భాషా హద్దులు లేనిది ‘అగ్నిపంఖ్‌’: మితా వశిష్ట

భాషా హద్దులు లేనిది ‘అగ్నిపంఖ్‌’: మితా వశిష్ట

ముంబయి: అగ్నిపంఖ్‌ నాటకం బాషా హద్దులు లేనిదని, ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని నటి మితా వశిష్ట్‌ అన్నారు. ఈ నాటకం ఎయిర్‌టెల్‌ థియేటర్‌, డిష్‌ టీవీ రంగ్‌మంచ్‌ యాక్టివ్‌, డి2హెచ్‌ రంగ్‌మంచ్‌ యాక్టివ్‌లో ప్రసారమవుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పితృస్వామ్య సమాజాలలో అధికారం కోసం మహిళలు ఎలా చర్చలు జరుపుతారు అనే ఇతివృత్తం ఆధారంగా ఈ నాటకం రూపొందిందని అన్నారు. జీ థియేటర్‌ టెలిప్లేగా ‘అగ్నిపంఖ్‌’ ప్రశంసలు అందుకుంది. దానిలో ఆమె నీతిగల, భూస్వామ్య మాత్రధికారిణి పాత్ర ‘దుర్గేశ్వరి’గా నటించారు. దుర్గేశ్వరి పాత్ర ప్రేక్షకులతో లోతుగా కనెక్ట్‌ అవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ నాటకంలో దినకర్‌ గవాండే, గుల్కీ జోషి, ప్రభాత్‌ శర్మ, సత్యజీత్‌ దూబే, సత్యజిత్‌ శర్మ, శీతల్‌ సింగ్‌, సోమేష్‌ అగర్వాల్‌ నటించారు. సుమన్‌ ముఖోపాధ్యాయ్‌ దర్శకత్వం వహించారు.

అనుభవజ్ఞురాలైన  నటి మితా వశిష్ట్ యొక్క శక్తివంతమైన ప్రదర్శనలు వేదికపై అలాగే పెద్ద మరియు చిన్న తెరపై దశాబ్దాలుగా ఆమెకు ఎన్నో ప్రశంసలను తీసుకువచ్చాయి.  జీ థియేటర్ యొక్క టెలిప్లే ‘అగ్నిపంఖ్’ అందుకు మినహాయింపేమీ కాదు. దానిలో ఆమె నీతిగల , భూస్వామ్య మాత్రదికారిణి పాత్ర  ‘దుర్గేశ్వరి’ గా నటించారు.  విభిన్న పరిశ్రమలు, కళా ప్రక్రియలు, భాషలు మరియు ఫార్మాట్‌లలో పనిచేసిన మితా ఇప్పుడు ఈ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ప్రేక్షకుల కోసం తెలుగులో ప్రసారం చేయబోతున్నందుకు తన ఆనందాన్ని వెల్లడించారు.

 స్వాతంత్య్రానంతర భారతదేశంలో వచ్చిన సామాజిక మార్పుల నేపథ్యంలో తన భూస్వామ్య సామ్రాజ్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి దుర్గేశ్వరి చేసిన పోరాటాన్ని టెలిప్లే లో చూపారు. ఈ ప్లే గురించి మితా మాట్లాడుతూ  “అగ్నిపంఖ్’ వంటి కథ భాషా హద్దులు లేనిది మరియు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది.  పితృస్వామ్య నిర్మాణాలలో అధికారం కోసం మహిళలు ఎలా చర్చలు జరుపుతారు అనేది దీని ఇతివృత్తం. ఇది సార్వజనీనమైనది. నేను కూడా వివిధ భాషలలో కొన్ని గొప్ప థియేటర్‌ ప్లేలను ఆస్వాదించాను. అలాగే వేదికపై నా ప్రదర్శనను చూడటానికి వచ్చిన వారు కూడా ఉన్నారు, ఉదాహరణకు, నేను చేసిన నాటకాలలో ఒకటి ‘లాల్ డెడ్’, ఇది ఒక కాశ్మీరీ ఆధ్యాత్మికవేత్త మరియు కవి చుట్టూ తిరుగుతుంది.  కాశ్మీర్ తో ఎలాంటి సంబంధం కూడా లేని వ్యక్తులు ఈ కంటెంట్, ప్రదర్శన మరియు ఇతివృత్తంతో పూర్తిగా లీనమై పోయారు. ఈ ప్లే కు మంత్రముగ్ధులయ్యారు. చాలా విషయాలను ఉన్నత స్థాయిలో తెలియజేయడానికి భాషను థియేటర్ అధిగమించగలదని నేను నిజంగా నమ్ముతున్నాను” అని అన్నారు.

దుర్గేశ్వరి పాత్ర మరియు ఆమె ఆందోళనలు ప్రేక్షకులతో లోతుగా కనెక్ట్ అవుతాయని ఆమె నమ్ముతున్నారు మరియు ఆమె మాట్లాడుతూ  “దుర్గేశ్వరి ఒక శక్తివంతమైన మహిళ.  అయినప్పటికీ ఆమె చాలా బలహీనమైన మరియు కొంత స్థాయిలో పిల్లల లాంటి మనస్తత్వమూ ఒక్కోసారి కనబడుతుంది, ఎందుకంటే చిన్న వయస్సులోనే ఆమెకు వివాహం జరగడంతో బంధాలకు సంబంధించి ఆమెకు తెలిసిన ఏకైక బంధం  తన భర్త మాత్రమే. ఆమె ఈ ప్రపంచంలోని మహిళ మరియు అదే సమయంలో, ప్రేమ విషయాలలో ఆమెకు ఎలాంటి అనుభవమూ లేదు. అలాగే  జీవిత భాగస్వామితో  వ్యవహరించే విధానం లోనూ ఆమె కు అనుభవ లేమి వున్నది. ఆమె లో నియంత  చాలా ఆసక్తి కరం ఎందుకంటే , ఆమె అధికారం కలిగిన స్త్రీ, వ్యాపారవేత్తగా చాలా తెలివైనది, అదే సమయంలో ఆమె చాలా అమాయకురాలు. కాలాతీతమైన,  ప్రతి మనిషి అనుభవించే శాశ్వతమైన గందరగోళం ఆమెది ” అని అన్నారు.

 ఈ రోజు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ‘అగ్నిపంఖ్’ వంటి మన కథల పరిధిని విస్తరించడంలో సహాయపడుతున్నాయని కూడా ఆమె భావిస్తోన్నారు. ఆమె మాట్లాడుతూ “డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు రాకముందు, సృజనాత్మకతకు ఇప్పటిలా అవకాశాలు లేవు.  ఇప్పుడు కథకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో సంభాషించగలరు. .” అని అన్నారు .

  ‘ దుర్గేశ్వరి’  లేదా ‘బాయిసాబ్’ పాత్రను పోషించడం ఆమెకు జీవితకాల అనుభవం మరియు ఆమె మాట్లాడుతూ , “ఆమెలాంటి మహిళలు మన నిజ జీవితంలో కూడా ఉంటారు, అయితే వారు సినిమా లేదా ప్రధాన స్రవంతి వినోదంలో కనుగొనడం మాత్రం ఖచ్చితంగా కష్టం” అని అన్నారు. (Story: భాషా హద్దులు లేనిది ‘అగ్నిపంఖ్‌’: మితా వశిష్ట)

News on YouTube

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1