UA-35385725-1 UA-35385725-1

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

హైదరాబాద్‌: ఏపీ సీఎం జ‌గ‌న్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు మ‌రింత పురోగ‌తి సాధించిన‌ట్లు క‌న్పిస్తోంది. ఫోన్ల లొకేష‌న్ డేటాతోపాటు వివేకా ఇంట్లో ఉన్న వైఫై రూట‌ర్ల‌తో అనుసంధాన‌మై ఉన్న ప్ర‌తి ఒక్క‌రి ఫోన్ డేటాను సేక‌రించ‌డానికి సీబీఐ స‌మాయ‌త్త‌మైంది. ఈ విష‌యాన్ని తాజా ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్‌ టేకౌట్‌, ఫోన్ల లొకేషన్‌ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించిన విష‌యం తెల్సింది. జూన్ 30వ తేదీన సమర్పించిన ఈ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది. వివేకానంద‌రెడ్డి హ‌త్యకు ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్క‌ర‌రెడ్డిలు కుట్ర ప‌న్నిన విష‌యాన్ని పున‌రుద్ఘాటించింది. వారి కుట్ర‌లో ఇంకెలాంటి అనుమానం లేద‌ని, మ‌రిన్ని ఆధారాలు త్వ‌ర‌లో రాబోతున్నాయ‌ని పేర్కొంది. కాక‌పోతే, వివేక పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని ఒప్పుకుంది. సాక్ష్యాలను తారుమారు చేయ‌డానికి జ‌రిగిన ప్ర‌య‌త్నంలో వైఎస్ మనోహర్ రెడ్డి పాత్ర ఉన్న‌ప్ప‌టికీ, అత‌ని ప్రమేయం ఇంకా నిర్ధారణ కాలేదని సీబీఐ ఆ ఛార్జిషీటులో వెల్ల‌డించింది. వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక ఇంకా త‌మ‌కు అందాల్సి ఉంద‌ని, వివేకానంద‌రెడ్డి ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలను సేకరిస్తున్నామ‌ని తెలిపింది. ఈ వివ‌రాల‌ను అమెరికా నుంచి తెప్పించాల్సి వుంటుంది. వైఫై రూట‌ర్ల‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమెరికా అధికారులను కోరిన‌ట్లు సీబీఐ తెలిపింది. అలాగే, పలు మొబైల్ ఫోన్ల ఫొరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీ డాక్ నుంచి అందాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. ఇదిలావుండ‌గా, వివేకా లేఖ‌పై నిన్ హైడ్రిన్ ప‌రీక్ష నివేదిక ఈ కేసులో కీల‌క‌మ‌వుతుంద‌ని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ నివేదిక‌లు వ‌స్తే కేసుకు సంబంధించి మ‌రిన్ని కోణాలు తెలిసే అవ‌కాశం వుంద‌ని భావిస్తున్నారు. వివేకా హ‌త్య కేసు ఇప్ప‌టికే అవినాష్‌రెడ్డి మెడ‌కు ఉచ్చులా చుట్టుకున్న విష‌యం తెల్సిందే. ఈ కేసు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి కూడా త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. ఏదేమైన‌ప్ప‌టికీ, ఈ కేసు ప‌రిణామాలు ఏపీలో రాజ‌కీయంగా కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశం వుండ‌టంతో ప్ర‌తి అంశ‌మూ చ‌ర్చ‌కు దారితీస్తున్న‌ది. (Story: వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!)

News on YouTube

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1