Homeటాప్‌స్టోరీషాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

హీరో అబ్బాస్‌ గుర్తున్నాడా? ప్రేమదేశం సినిమాతో అప్పట్లో అమ్మాయిల హృదయాలను గెల్చుకొని, రోమాంటిక్‌ హీరోగా గుర్తింపు పొందాడు. హీరోగానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచివాడిగా సినీ పరిశ్రమలో పేరుతెచ్చుకున్నాడు. వాస్తవానికి అబ్బాస్‌ తమిళహీరో. తెలుగులోనూ మంచి హీరో అయ్యాడు. అయితే ఈ స్మార్ట్‌ హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? న్యూజిలాండ్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడంటే ఆశ్చర్యం కలగకుండా వుంటుందా? కానీ ఇది నిజం. అబ్బాస్‌ తమిళంలో రజనీకాంత్‌ కాకపోవచ్చు, లేదా కమల్‌హాసన్‌ కాకపోవచ్చు. కానీ కాదల్‌ దేశమ్‌, పడయప్ప, మిన్నాలే వంటి సినిమాలతో పాపులర్‌ హీరో అయ్యాడు. హార్పింగ్‌ వంటి ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం దశాబ్ధకాలంగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా వున్నాడు. ఇప్పుడాయన న్యూజిలాండ్‌లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు మెకానిక్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఈ విధంగా రెండు పనులు చేస్తూ పొట్టనింపుకుంటున్నాడని అనలేం గానీ…జీవితం వెల్లబుచ్చుతున్నాడు. ఈమధ్యనే అబ్బాస్‌ అకస్మాత్తుగా యూట్యూబ్‌లో దర్శనమిచ్చాడు. చాలా విషయాలను మనసువిప్పి చెప్పాడు. తాను టీనేజర్‌గా వున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడిరచి కలకలం రేపాడు. సినిమాల్లోకి వెళ్లకముందు ఈ సూసైడ్‌ ఆలోచన వచ్చినట్లు వెల్లడిరచాడు.
అబ్బాస్‌ సోషల్‌మీడియాలో పెద్దగా కన్పించడు. కాకపోతే, అనూహ్యంగా యూట్యూబ్‌లో ఒక వీడియోలో పలు విషయాలు చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ‘‘కొవిడ్‌ కాలంలో వెనకబడ్డాను. న్యూజిలాండ్‌లో నివసిస్తున్నప్పుడే అభిమానులను జూమ్‌లో కలిసి మాట్లాడేవాడిని. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలతో పరుగులు తీసే వారిని అదుపుచేసి, వారికి సాయం చేయాలన్ననే నా లక్ష్యంగా మారింది. ఆత్మహత్య ఆలోచనలకు సంబంధించి నాకు వ్యక్తిగతంగా అనుభవం వుంది. టెన్త్‌క్లాస్‌ ఫెయిలయ్యాక చాలా అవమానంగా ఫీలయ్యాను. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. అదే సమయంలో నా గాళ్‌ఫ్రెండ్‌ కూడా నాకు దూరమైంది. అనుకోకుండా నాకు నేనుగానే మారిపోయాను. అనుకోని పరిస్థితులను నన్ను మార్చాయి. ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నాను. నేను రోడ్డు దాటుతుండగా, ఒక కారు డ్రైవర్‌ను చూశాను. అతను డ్రైవింగ్‌ చేస్తూ..అంటే ఒక పనిలో వుంటూ…రోడ్డు దాటుతున్నవారిని, ముందూవెనుక వెళ్తున్నవారిని గమనిస్తూ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఎదుటవారి కదలికలను కచ్చితంగా కనిపెడుతూనే వుంటాడు. ఈ ఆలోచన ప్రక్రియ నన్ను మార్చింది. ఆత్మహత్య చేసుకోవాలన్న చీకటి పరిస్థితుల్లోనూ నేను ఇంకో డ్రైవర్‌గా గురించి ఆలోచించాను. ఆ తర్వాత సినీ ఫీల్డ్‌లోకి వెళ్లాను. అక్కడ కొంత మేరకు సక్సెస్‌ అయ్యాక, తర్వాతికాలంలో విఫలమయ్యాను. కనీసం సిగరెట్లు కొనుక్కోలేని దౌర్భాగ్య పరిస్థితిలోకి చేరిపోయాను. ఆ పరిస్థితుల్లో ఆర్‌బీ చౌదరి గారిని కలిశాను. ఆయన నాకు పూవీలే మూవీలో ఛాన్స్‌ ఇచ్చాడు. అది కూడా నాకు బోరు కొట్టింది. వెంటనే ఆ మూవీని ఆపేసి, ప్రత్యామ్నాయం కోసం వెతికాను. హిందీలో నా తొలి చిత్రం ‘అన్ష్‌: ది డెడ్‌లీ పార్ట్‌’ను నా ఫ్రెండ్స్‌ పదేపదే చూస్తూ వుండటం గమనించాను. అది ఆనందమే..కానీ నాకు నచ్చలేదు. అసలివన్నీ బకవాస్‌ అని అనుకొని నా కుటుంబాన్ని పోషించడానికి బైక్‌ మెకానిక్‌గా పనిచేయడం ప్రారంభించాను. న్యూజిలాండ్‌లో టాక్సీ కూడా నడుపుతున్నాను’’ అని అబ్బాస్‌ నర్మగర్భంగా తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టాడు. ఈ విషయంలో తాను ఎలాంటి సిగ్గూ పడటం లేదని అబ్బాస్‌ చెప్పకనే చెప్పాడు. సినిమా జీల్‌ అనేది ఎప్పటికీ చచ్చిపోయేది కాదు కాబట్టి, మంచి అవకాశాలు వస్తే అబ్బాస్‌ మళ్లీ నటిస్తాడేమో వేచిచూడాల్సిందే. (Story: షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?)

News on YouTube

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!