8 మంది మహిళలతో సహా…
22 మంది మావోయిస్టులు లొంగుబాటు
న్యూస్ తెలుగు/ చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా కేంద్రంలో ఎస్పి ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగి పోయారు. వారిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరికి 37 లక్షల 50 వేలు రివార్డు ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులు వారి సంస్థ అయిన జనతన సర్కార్ లోని వివిధ విభాగాల్లో పని చేశారని, అనేక నేరాలతో సంబంధం ఉందని ఎస్పీ తెలిపారు. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 110 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 241 బెటాలియన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (Story: 22 మంది మావోయిస్టులు లొంగుబాటు)

