పాన్ షాప్ లు, కిరాణా షాపుల్లో పోలీస్ తనిఖీలు
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు మండలం చట్టి గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతూరు యస్. ఐ రమేష్ , సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం కిరాణా షాప్స్, హోటల్స్, పాన్ షాపులను తనిఖీ చేశారు తనిఖీల్లో ఎటువంటి మత్తు పదార్థాలు దొరికినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటా మని తెలిపారు. పాఠశాలల కు, కళాశాలలకు 100 మీటర్ల దూరంలో, మత్తు పదార్థాల నిషేధిత, రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించారని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఎస్ఐ రమేష్ సిబ్బంది శివ, తదితరులు పాల్గొన్నారు. (Story:పాన్ షాప్ లు, కిరాణా షాపుల్లో పోలీస్ తనిఖీలు )

