UA-35385725-1 UA-35385725-1

IPL: రసపట్టులో ఓడిన రాహుల్‌ సేన

IPL: రసపట్టులో ఓడిన రాహుల్‌ సేన

హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ బోణీ

ముంబయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కొత్తగా చేరిన రెండు జట్లు సోమవారంనాడు తమ తొలి మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కె.ఎల్‌.రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్‌ ఓడిపోగా, హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ తొలి విజయంతో బోణీ కొట్టింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నాల్గవ ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా, గుజరాత్‌ ఇంకా రెండు బంతులు మిగిలివుండగానే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. హుడా ఆల్‌రౌండ్‌ ప్రతిభ లక్నోను కాపాడలేకపోయింది. ఉత్తమ బౌలింగ్‌తో 3 వికెట్లు తీసుకున్న మహ్మద్‌ షమీ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (0) వికెట్టును చేజార్చుకుంది. చమీరా బౌలింగ్‌లో దీపక్‌ హుడా పట్టిన క్యాచ్‌కు గిల్‌ అవుట్‌ కావడం గుజరాత్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. జట్టు స్కోరు 15 వద్ద ఉన్నప్పుడు విజయ్‌శంకర్‌ (4) వికెట్టును కూడా పోగొట్టుకుంది. చమీరా క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో శంకర్‌ వెనుదిరగక తప్పలేదు. ఈ దశలో ఇంకో ఓపెనర్‌ మ్యాథ్యూ వేడ్‌కు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జతగా నిలిచాడు. ఇరువురూ ఆచితూచి ఆడుతూ నెమ్మదిగా స్కోరుబోర్డును కదిలించారు. అవసరమైన మేరకు మంచి షాట్లు కొడుతూ అలరించారు. వీరిద్దరూ మూడో వికెట్టుకు 57 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించారు. పాండ్యా మెరుపు బ్యాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. అతను కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌ సాయంతో 33 పరుగులు చేశాడు. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో మనీష్‌ పాండే పట్టిన క్యాచ్‌కు హార్దిక్‌ అనూహ్యంగా అవుటయ్యాడు. ఈ దశలో వేడ్‌కు మిల్లరÊ తోడయ్యాడు. కానీ వేడ్‌ ఇంకెంతోసేపు నిలవలేకపోయాడఱు. అతను దీపక్‌ హుడా వేసిన మంచి లైన్‌ అండ్‌ లెన్త్‌ బంతికి వేడ్‌ (30, 29 బంతులు, 4I4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ తరుణంలో మిల్లర్‌కు రాహుల్‌ తెవాటియా జతకలిసాడు. ఇరువురూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ చూడముచ్చటైన నాలుగు సిక్సర్లు కొట్టి అలరించారు. మ్యాచ్‌ టర్నయింది. 21 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసిన మిల్లర్‌ను ఆవేష్‌ఖాన్‌ అవుట్‌ చేసిన తర్వాత అభినవ్‌ మనోహర్‌ క్రీజ్‌లోకి అడుగుపెట్టాడు. తెవాటియా, మనోహర్‌లు ఇన్నింగ్స్‌ను గెలుపుతో ముగించారు. కాకపోతే ఆఖరి ఓవర్‌లో 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వుండగా, తెవాటియా రెండు బౌండరీలు, మనోహర్‌ ఒక బౌండరీ కొట్టారు. 4 బంతుల్లో 3 పరుగులు చేయాల్సి వుండగా, మనోహర్‌ చివరి బంతిని బౌండరీకి తరలించి గెలిపించాడు. లక్నో బౌలర్లలో చమీరా 2, ఆవేష్‌, కృనాల్‌, హుడాలు తలో వికెట్టు తీసుకున్నారు.
గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి ముందుగా లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఓపెనర్‌, కెప్టెన్‌ కె.ఎల్‌.రాహుల్‌ తడబడి తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. మహమ్మద్‌ షమీ బౌలింగ్‌లో మ్యాథ్యూ వేడ్‌ పట్టిన క్యాచ్‌కు అతను అవుటయ్యాడు. ఆ తర్వాత క్వింటన్‌ డీకాక్‌ (7), ఎవిన్‌ లూయిస్‌ (10), మనీష్‌ పాండే (6)లు పెద్దగా రాణించలేదు. వారిలో డీకాక్‌, మనీష్‌లను షమీ అవుట్‌ చేయడం విశేషం. కష్టాల ఊబిలో కూరుకుపోయిన లక్నోను ఆదుకోవడానికి దీపక్‌ హుడా, ఆయుష్‌ బదోనీలు రంగంలోకి దిగారు. నిజంగానే వీరిద్దరూ అద్భుతంగా ఆడారు. మంచి సమన్వయంతో ఆడుతూ ఓ వైపు బంతిని బౌండరీలు తరలిస్తూనే, ఇంకో వైపు సింగిల్స్‌తో అలరించారు. వీరిద్దరూ ఐదు సిక్సర్లు కొట్టడం విశేషం. ఇరువురూ తలో అర్థసెంచరీ కూడా సాధించారు. హుడా, బదోనీలు ఐదో వికెట్టుకు 87 పరుగుల భాగస్వామ్యం అందించారు. 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన దీపక్‌ హుడా అనుకోకుండా రషీద్‌ఖాన్‌ ఎల్బీకి దొరికిపోయాడు. బదోనీ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి వరుణ్‌ ఆరాన్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కృనాల్‌ పాండ్యా (21), చమీరా (1)లు నాటౌట్‌గా మిగిలారు. లక్నో స్కోరు 158 వద్ద ఆగిపోయింది. గుజరాత్‌ బౌలర్లలో షమీ మూడు వికెట్లు, ఆరాన్‌ రెండు వికెట్లు, రషీద్‌ ఒక వికెట్టు తీసుకున్నారు. (Story: IPL: రసపట్టులో ఓడిన రాహుల్‌ సేన)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1