హైదరాబాద్‌లో 7% పెరిగిన ఆస్తుల ధరలు
హైదరాబాద్ : తెలంగాణా (Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో ఇళ్ల ధరలు 2021 సంవత్సర చివరి మూడు నెలల కాలంలో 7% వృద్ధి చెందాయని రియల్ ఇన్‌సైట్స్ రెసిడెన్షియల్ వార్షిక రౌండప్ 2021 వెల్లడిరచింది. భారతదేశ ఎనిమిది ప్రధానమైన గృహ మార్కెట్‌లలో రియల్ ఎస్టేట్ (Realestate) కంపెనీ ప్రాప్ టైగర్ నిర్వహించే త్రైమాస నివేదిక ఇది. నూతన అపార్ట్‌మెంట్‌ల వార్షిక ధరలలో వృద్ధి ప్రధానంగా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు కారణమయ్యాయి. కరోనా మహమ్మారి తరువాత నిర్మాణ వ్యయాలు పెరగడం, నిర్మాణ సామాగ్రి సరఫరాలో అంతరాయాలు కూడా ఈ వృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. రాష్ట్ర రాజధానిలో సరాసరి చదరపు అడుగు ధర అపార్ట్‌మెంట్‌లతో పాటుగా గ్రామాల్లోని గృహ ప్రాజెక్ట్‌లలో పెరిగి ఇప్పుడు 5900-6100 రూపాయల నడుమ ఉంది. దీనితో పాటుగా అహ్మదాబాద్‌తో పాటుగా హైదరాబాద్‌లో 2021 సంవత్సర చివరి త్రైమాసంలో పెరిగాయి.
సరాసరి ధరలు పెరగడంతో పాటుగా ఇప్పుడు దేశంలో ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ తరువాత అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా హైదరాబాద్ నిలిచింది.
City-Wise Price card
City Weighted average price in Rs per square foot as on December 2021 YoY % growth
Ahmedabad 3,400-3,600 7%
Bangalore 5,500-5,700 6%
Chennai 5,400-5,600 5%
Delhi NCR 4,400-4,600 5%
Hyderabad 5,900-6,100 7%
Kolkata 4,300-4,500 5%
Mumbai 9,700-9,900 4%
Pune 5,100-5,300 3%
India 6,300 – 6,500 6%
2021లో గృహ విక్రయాలతో పాటుగా నూతన సరఫరా సైతం వృద్ధి చెందింది
దక్షిణాది రాష్ట్రంలో ఇళ్లకు డిమాండ్ వృద్ధి చెందుతూనే ఉంది. 2021లో ఇళ్ల విక్రయాల పరంగా 2020తో పోలిస్తే ఏకంగా 36% వృద్ధి కనిపించింది. 2020లో 16400 ఇళ్ల విక్రయాలు జరగ్గా, 2021లో హైదరాబాద్‌లో 22,239 ఇళ్లు విక్రయించబడ్డాయి. బాచుపల్లి, తెల్లాపూర్, మియాపూర్‌లు అత్యంత ప్రాధాన్యతా ప్రాంతాలుగా నిలిస్తే, 3బీహెచ్‌కె ఇప్పటికీ ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న ఇల్లుగా నిలిచింది. దాదాపు 48% మంది వీటినే కొంటున్నారు.
సరఫరా పరంగా కూడా హైదరాబాద్‌లో రెండు రెట్ల వృద్ధి కనిపించింది. 2020లో 22,940 ఇళ్లు అందుబాటులోకి రాగా 2021లో 48,566 ఇళ్లు వచ్చాయి. పుప్పాలగూడా, మియాపూర్, బాచుపల్లి వంటి ప్రాంతాలలో వీటి సరఫరా అధికంగా ఉండగా, ఒక కోటి రూపాయల ధరల్లోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది.
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు, నూతన గృహాలు పెరగడం మాత్రమే కాదు అమ్ముడుకాకుండా ఉంటున్న ఇళ్ల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతుంది. దాదాపు 35 నెలల పాటు ఇక్కడ వేచి చూడటం 2021లో కనిపించింది.
Unsold Inventory as on Dec’21
City Unsold stock on December 30, 2021 Inventory Overhang (months)
Ahmedabad 63,096 45
Bangalore 66,754 32
Chennai 35,729 33
Delhi NCR 1,02,147 68
Hyderabad 65,635 35
Kolkata 25,716 31
Mumbai 2,48,815 51
Pune 1,19,051 34
India 7,26,943 42
‘‘ఇటీవల ముగిసిన పండుగ సీజన్ ఇళ్ల డిమాండ్, సరఫరా పరంగా కనిపించే ప్రభావానికి కారణమైంది. ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుండటం, ఉద్యోగ భద్రత వంటి కారణాలు కారణంగా 2022లో రియల్ ఎస్టేట్ దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది’’ అని శ్రీ రాజన్ సూద్, బిజినెస్ హెడ్, ప్రాప్ టైగర్ డాట్ కామ్ అన్నారు. (Story: హైదరాబాద్‌లో 7% పెరిగిన ఆస్తుల ధరలు)
See Also: 27న ఓఆర్‌డీఐ ‘రేస్ ఫర్ 7’