UA-35385725-1 UA-35385725-1

15కి ఎగబ్రాకిన పుష్ప

15కి ఎగబ్రాకిన పుష్ప

‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా…ఫైరు’ అని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నట్లుగానే గ్రాస్‌ కలెక్షన్లలో పుష్ప సినిమా ఫైర్‌ పుట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో గ్రాస్‌ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో పుష్ప 15వ స్థానానికి ఎగబ్రాకింది. తానాజీ, కబీర్‌సింగ్‌, ఎవెంజర్స్‌:ఇన్‌ఫినిటీ వార్‌, సింబా, యురి సినిమాలను దాటుకొని 61 రోజులకు గాను 331.50 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్‌తో ఇండియన్‌ బాక్సాఫీసులో ఆల్‌టైమ్‌ రికార్డుల జాబితాలోకి చేరింది. ఇప్పుడు ప్రభాస్‌ ‘సాహో’ చిత్రాన్ని దాటడానికి అత్యంత సమీపంలో వుంది. సాహో రూ.339.25 కోట్లతో 14వ స్థానంలో నిలిచింది. హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లో పుష్ప ఇంకా ధియేటర్లలో ఆడుతూనే వుంది. ఇంకో రెండు మూడు కోట్లు సంపాదిస్తే ఇంకో మెట్టు ఎక్కుతుంది. సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్‌ కలెక్షన్లు సాధించిన సినిమాగా బాహుబలి: ది కంక్లూజన్‌ రూ. 1351 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో దంగల్‌ రూ.511.30 కోట్లతో నిలిచింది. బాహుబలి ఎవరికీ అందనంత ఎత్తులో వుంది. త్వరలో విడుదల కాబోయే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఒక్కటే అటుఇటుగా ఈ జాబితాల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.
బాక్సాఫీసు కలెక్షన్‌ రికార్డులు ఇలా వున్నాయి:
1. బాహుబలి: ది కంక్లూజన్‌ ` రూ. 1351 కోట్లు
2. దంగల్‌ ` రూ. 511.30 కోట్లు
3. 2.0 ` రూ. 508.50 కోట్లు
4.. బాహుబలి: ది బిగినింగ్‌ ` రూ. 482 కోట్లు
5. పి.కె. ` రూ. 455 కోట్లు
6. అవెంజెర్స్‌: ఎండ్‌గేమ్‌ ` రూ. 442.70 కోట్లు
7. సంజూ ` రూ. 434.30 కోట్లు
8. టైగర్‌ జిందా హై ` రూ. 432.50 కోట్లు
9. బజరంగి భాయిజాన్‌ ` రూ. 422.20 కోట్లు
10. సుల్తాన్‌ ` రూ. 415.10 కోట్లు
11. పద్మావత్‌ ` రూ. 379 కోట్లు
12. ధూమ్‌ 3 ` రూ. 363.30 కోట్లు
13. వార్‌ ` రూ. 359.80 కోట్లు
14. సాహో ` రూ. 339.25 కోట్లు
15. పుష్ప: ది రైజ్‌ ` రూ. 331.50 కోట్లు (61 రోజులు)
16. తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌ ` రూ. 331.20 కోట్లు
17. కబీర్‌సింగ్‌ ` రూ. 325.40 కోట్లు
18. అవెంజర్స్‌: ఇన్‌ఫినిటీ వార్‌ ` రూ. 297 కోట్లు
19. సింబా ` రూ. 293.50 కోట్లు
20. ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌ ` రూ. 285 కోట్లు
వాస్తవానికి పుష్ప సినిమా ఇప్పటికే మరో 30`35 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్‌ చేసుకునేదే. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల లొల్లి కారణంగా పుష్ప ఆదాయం పడిపోయింది. లేకుంటే, ఈసరికే రూ.365`370 కోట్లతో 12వ స్థానంలోకి ఎగబ్రాకేది. (Story : 15కి ఎగబ్రాకిన పుష్ప)

See Also : అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1