రైతు సంఘం పోరాటానికి జిల్లా వ్యవసాయ అధికారి స్పందన..!
న్యూస్‌తెలుగు/ చాట్రాయి : రైతు సంఘం పోరాటానికి ఫలితంగా జిల్లా వ్యవసాయ అధికారి భాష చిన్నంపేట గ్రామానికి వచ్చి రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఏలూరు చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో సిపిఐ అనుబంధ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య రైతు సంఘం జిల్లా నాయకులు నిమ్మగడ్డ నరసింహ చందంపేట గ్రామంలో ఎస్సై న్డ్ భూముల రైతులకు ఈక్రాప్ పంట నమోదు చేయాలని సహకార సంఘాలలో ఎస్సై భూముల రైతులకు సభ్యత్వ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన నేపథ్యంలో దానిపై స్పందించిన ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి భాష సోమవారం చిన్నంపేట రైతు సేవ కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ. రైతు సేవా కేంద్రంలో అధికారిగా పనిచేస్తున్న ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వాస్తవాలను గుర్తించిన జిల్లా వ్యవసాయ అధికారి అధికారి పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. చిన్న రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. చిన్న చిన్న వారికి ప్రభుత్వ సేవలను అందించడమే ప్రధానమైన బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు పరసా వెంకటేశ్వరావు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు కందుకూరి అప్పారావు చిన్నంకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (Story : రైతు సంఘం పోరాటానికి జిల్లా వ్యవసాయ అధికారి స్పందన..!)