రాష్ట్ర స్థాయికి ఎంపికైన ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరం విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ శైలజ, వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశోక్ కుమార్- అండర్/14 టేబుల్ టెన్నిస్ నవంబర్ 8,9 తేదీలలో నంద్యాలకు, మధుసూధన్ -అండర్/17 టేబుల్ టెన్నిస్ నవంబర్ 2 వ3 వతేదీలలో నంద్యాల, సాయికుమార్ – అండర్17 నెట్ బాల్ నవంబర్ 7,8 తేదీలలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో, శశిధర్ – అండర్/14 బాస్కెట్ బాల్ నవంబర్ 1,2 తేదీలలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను హెడ్మాస్టర్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర, టీచర్లు వేణుగోపాల్, హేమలత ,శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి ,ప్రసాద్ బాబు లలితమ్మ శుభాకాంక్షలు అని తెలియజేశారు.
ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు వి నాగేంద్ర పాఠశాల ఉపాధ్యాయులు హిందీ పండిత్ వేణుగోపాల్, హేమలత,గారు శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, ప్రసాద్ బాబు , లలితమ్మ శుభాకాంక్షలు అని తెలియజేశారు. అక్కడ కూడా రాష్ట్ర స్థాయి పోటీలలో విజయం సాధించే విధంగా మంచి ప్రగతిని చూపాలని తెలిపారు. (Story : రాష్ట్ర స్థాయికి ఎంపికైన ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు)