మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
న్యూస్ తెలుగు/ధర్మవరం(శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ఒకటవ వార్డు గూడ్ సెట్ కొట్టాలకు చెందిన మందల మల్లికార్జున భార్య మందల మీనాక్షి ఇరువురు 10 రోజుల వ్యవధిలో మృతి చెందారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుటుంబంలో మీకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా నింపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story:మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి)