మంచి ప్రభుత్వానికి అండగా ఉండండి
టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి పుట్ల రమణ
న్యూస్ తెలుగు/విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని రాణిగారితోట 17 డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారిని కోరుతున్నారు. ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో భాగంగా బుధవారం కృష్ణలంక రాణిగారితోటలో టిడిపి నాయకులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి పుట్ల రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాణిగారితోటలోని మసీదు వీధి, కరకట్ట ఫీడర్ రోడ్డు తారకరామ నగర్ పలు వీధుల్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు 100 రోజుల పరిపాలన గూర్చి వివరిస్తున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆదేశం మేరకు ఈ కార్యక్రమం తలపెట్టినట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్యే గద్దె ఇచ్చినా డైరెక్షన్‌లో ప్రభుత్వ 100 రోజుల పరిపాలన గూర్చి ముద్రించిన కరపత్రాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బ్రోచర్లును పంచి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలకు సదవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాబోయే కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను సరైన ప్రణాళికతో అమలు చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజా మన్ననలను పొందటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల సంభవించిన వరదలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ఎమ్మెల్యే గద్దె అధికారులు, వరద సహాయక సిబ్బందిని సమన్వయం చేసుకొని తగిన కృషి చేస్తున్న తీరును ప్రజలకు చేరవేయడంలో ముందున్నామని చెప్పారు. తాము ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో ప్రజల నుండి ముఖ్యంగా మహిళల నుండి మంచి ఆదరణ లభిస్తుందని ఉత్సాహంతో మహిళలు కూడా తమతో పాలు పంచుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 81వ సచివాలయం అడ్మిన్ బాలకృష్ణ, నాగమణి(సచివాలయ మహిళా కానిస్టేబుల్), డివిజన్ నాయకులు ముని పోలిపల్లి, వేల్పుల శౌరి, 17వ డివిజన్ ప్రధాన కార్యదర్శి మొకర ఆది బాబు, మహిళా అధ్యక్షురాలు మల్లెల కుమారి, కుంభ ఏసుపాదం, అరవపల్లి విశ్వనాథం, కొమ్ము వెంకటేశ్వరరావు, వేల్పుల గురవయ్య, గోపాల్ దాస్ రమణయ్య, ఎస్‌కే.అమీనా. వెంకటమ్మ, గోవిందమ్మ, వెంకయ్య, సలాదుల అప్పారావు, డేవిడ్ రాజ్, టీడీపీ డివిజన్ నాయకులు ఎస్‌కే.మదర్, మోర విజయ, వేల్పుల సురేష్ పాల్గొన్నారు. (Story: మంచి ప్రభుత్వానికి అండగా ఉండండి)