రీ సర్వే, ఎల్పీ నెంబర్లను రద్దు చేయాలని కలెక్టర్ కు మెమోరాండం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : షేక్ మస్తాన్ వల్లి పిడిఎం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్టి రద్దు చేయడంతో రైతులు సమస్యలు ఏమి పరిష్కారం కాలేదు, అసలు సమస్య భూమి రీ సర్వే, ఎల్ పి నెంబర్లు దీని మూలంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు నష్టం జరిగింది. భూ రీ సర్వే, ఎల్ పి నంబర్లు ల్యాండ్ టైటిల్ యాక్టివ్ రద్దు చేస్తానని ప్రకటించారు గాని ఆచరణలో రైతులు పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, రెవిన్యూ యంత్రాంగం చుట్టూ రైతులు తమ భూమి తగ్గిందని మొరపెట్టుకున్నా అధికారులు పెడసేవిన పెడుతున్నారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సర్వే అనిత రెడ్డి, మండల సర్వే రవికుమార్, వీఆర్వో బ్రహ్మ రెడ్డి, నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ సర్వేయ ర్ బి రామాంజనేయులు రైతులంటే లెక్కచేయట్ల, రైతులు భూమికి తామే యజమానులు ఉన్నట్లుగా ఒక కలం పోటుతో రైతుల హక్కుల్ని కాల రాస్తున్నారు. ఈ దుర్మార్గాలకు పాల్పడే విఆర్వోల్ని సర్వేయర్లని, తాహసిల్దారులపై కఠిన చర్యలు తీసుకొని వారిని శిక్షించకపోతే రైతులకి జరిగిన నష్టం పూడ్చలేనిదని, జగన్ ప్రభుత్వం మోసం చేస్తే, చంద్రబాబు న్యాయం చేస్తాడు అనుకుంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే రైతులకి అన్యాయం చేసి, భూ సర్వే, ఎల్ పి నంబర్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కి సోమవారం మెమోరాండం ఇవ్వడం జరిగింది. పరిశీలించి తగినచర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడియం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, ఎం సిపిఐ జిల్లా అధ్యక్షుడు ఓర్సు కృష్ణ, రజక నాయకులు సురభి వెంకటేశ్వర్లు, పిడిఎం నాయకులు నల్లపాటి రామారావు వై. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story : రీ సర్వే, ఎల్పీ నెంబర్లను రద్దు చేయాలని కలెక్టర్ కు మెమోరాండం)