మల్లంపల్లి, జంగాలపల్లి పనులల్లో వేగం పెంచాలి.
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : మల్లంపల్లి, జంగాలపల్లి మార్కెట్ లలో అదనంగా నిర్మిస్తున్న షేడ్ల నిర్మాణ పనులల్లో వేగం పెంచాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మల్లంపల్లి గ్రామపంచాయితీ ఆవరణంలో ఉన్న మార్కెట్లో, జంగాలపల్లిలోని మార్కెట్ లోఅదనంగా నిర్మిస్తున్న షేడ్ల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు మీద పేదవారు చిన్న, చిన్న టెంట్లు వేసుకొని వ్యాపారం చెయడం వలన, ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని, అమ్ముకొని వారికి ఇబ్బందులు కలగకుండా , అదనంగా షెడ్స్ అవసరం ఉన్నందున నిర్మించుట జరుగుతుందని అన్నారు. వర్షపు నీరు నిలువ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని, చుట్టూ స్టెన్చ్ కొట్టించాలని అధికారులను సూచించారు. ఎంబి రికార్డ్ ప్రకారమే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, నాణ్యతతో లోపం ఉంటే బిల్లులలో కోతలు విధిస్తామని అన్నారు. పనులు నిర్దిష్ట గడువులోగా జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ఏ పి ఓ రాజు, జే ఈ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ సతీష్, పంచాయితి సెక్రటరీ రాజు, తదితరులు పాల్గొన్నారు.(sTORY:మల్లంపల్లి, జంగాలపల్లి పనులల్లో వేగం పెంచాలి.)