వినుకొండ చిత్రకారుడు బి ప్రసాద్ రావు కు జాతీయ నంది పురస్కారం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఆదివారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో కాలోజీ స్మారక సంస్థ, జాతీయ తెలుగు వెలుగు సంస్థలు సంయుక్తంగా ప్రసాద్ చిత్రకళలో పలు సేవలు అందించటంలో భాగంగా నాసా శాస్త్రవేత్త సాంబశివరావు చేతుల మీదగా సంస్థ అధ్యక్షులు పోలురాజు, రాజారావు, ఝాన్సీ లక్ష్మీబాయి వంశస్థురాలు మనమరాలు శాంతి భాయ్ చేతుల మీదగా ఈ నంది పురస్కారం అందుకున్నారు. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ. జాతీయ నంది పురస్కారం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,కర్ణాటక,ఒరిస్సా రాష్ట్రాల నుంచి కవులు, వివిధ శాఖలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ అరుదైన నంది పురస్కారం సాధించిన బి ప్రసాద్ రావు ను పట్టణానికి చెందిన ప్రముఖులు, న్యాయవాదులు, డాక్టర్స్, తోటి కళాకారుసులు అభినందనలు తెలిపారు. (Story :వినుకొండ చిత్రకారుడు బి ప్రసాద్ రావు కు జాతీయ నంది పురస్కారం)