సౌర రంగంలో మూడు నెలల ఉచిత భోజన , వసతితో నిరుద్యోగ యువతకు శిక్షణ
న్యూస్‌తెలుగు/వినుకొండ : నిరుద్యోగ యువతీ, యువకుల కోసం నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఐఎస్ఈ) సహ కారంతో ఆంధ్ర ప్రదేశ్ న్యూ, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సౌర రంగంలో ‘సూర్యమిత్ర’ పేరుతో ఆషా సొసైటీ నందు శిక్షణ ఇస్తు న్నట్లు ఆషా సొసైటీ డైరెక్టర్ షేక్ కరీముల్లా తెలిపారు. శిక్షణలో చేరిన వారికి ఉచిత భోజన, వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. సోమవారం వినుకొండలోని ఆషా సొసైటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రెసిడెన్షియల్ విధా నంలో మూడు నెలలపాటు కొనసాగే ఈ కోర్సులో చేరేందుకు ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ పూర్తిచేసిన వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, మహిళ లకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. బ్యాచ్కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్లను ఒకేసారి
ప్రారంభిస్తున్నట్లు, ఆంధ్ర ప్రదేశ్ లోని ఇరవై ఆరు జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉప యోగించుకోవాలని సూచించారు. సౌర రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉండటంతో కేంద్రం ఈ శిక్షణనిస్తోందని, శిక్షణానంతరం ఉత్తీర్ణులైన వారికి స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ సంస్థతో సర్టిఫి కెట్లు, ప్రముఖ సోలార్ పరిశ్ర మలలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాల కోసం వినుకొండ మార్కాపురం రోడ్ లోని ఆషా సొసైటీ నందు సంప్రదించాలని మరిన్ని వివరాల కోసం 76709 85218 94949 93755 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. (Story : సౌర రంగంలో మూడు నెలల ఉచిత భోజన , వసతితో నిరుద్యోగ యువతకు శిక్షణ..)