ప్రహరీ గోడ నిర్మించాలి
న్యూస్ తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : పాఠశాల విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ నిర్మించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా ఎస్.పి. డి.వి. శ్రీనివాస్ రావు తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని. పాఠశాల జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ, ఇంజనీర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంటశాల, ముద్రశాలకు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.(Story:ప్రహరీ గోడ నిర్మించాలి)